వల్లభనేని వంశీ ఇంత రియాక్షన్‌కి ఇదిగో కారణం

పార్టీలు మారవచ్చు...తిరిగి పాత గూటికే చేరవచ్చు..కానీ వల్లభనేని వంశీమోహన్ ఇంత ఆగ్రహంగా రియాక్ట్ అవడానికి కారణం ఆయనే చెప్పాడు...తన ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం జరిగిందని..ఈ విషయం గురించి చంద్రబాబుగారు..లోకేశ్ గారికి కూడా చెప్పానని..ఐతే లోకేశ్ వాటిని ఖండించారనుకోండి..అది వేరే విషయం..వంశీమోహన్ ముందు కొన్ని వెబ్ సైట్ల పేర్లు చెప్పారు.



వాటిని నిజంగానే పరిశీలిస్తే..ఆయన చెప్పిన విషయంలో నిజం ఉందని తేలిపోతుంది..ఎందుకంటే..సదరు సైట్లలో ఇంత జరిుగుతున్న ఎపిసోడ్‌లో వంశీమోహన్ వెర్షన్ ఎక్కడా లేదు..అంతా టిడిపి వెర్షన్ మాత్రమే ఉంది..పైగా వంశీమోహన్ ఏదో తప్పు చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చిన సైట్లు కూడా ఉన్నాయ్...ఓ సైట్ అయితే ఏకంగా ఆయన థంబ్ నైల్స్‌తోనే కొన్ని వీడియోలు పదుల సంఖ్యలో పెట్టాయి కూడా..

ఐతే వీటన్నింటికి మించి చంద్రబాబుగారి డైరక్షన్లో వంశీ దగ్గర సాయం పొందినవాళ్లతోనే తిట్టించాలని వ్యూహం తయారవడమే వంశీ ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి కారణంగా తెలుస్తోంది..రాజేంద్నన్నా అంటూ మొదలైన సంభాషణ ఒరేయ్ దాకా వెళ్లిందంటే..అది తన దగ్గర లక్షలకి లక్షలు డబ్బులు తీసుకుని కూతురు పెళ్లి చేసుకున్న వ్యక్తి తనపైనే అబాంఢాలు వేస్తే ఎవరికైనా కాలదా...పైగా ఇలాంటి జిమ్మిక్కులను చాలా చంద్రబాబుగారి డైరక్షన్లో రాజేంద్రప్రసాద్ చేయడం చూసి ఉంటారు..అక్కడికేదో చంద్రబాబుగారు ఏ పార్టీ ఫిరాయింపులనూ చేయకుండానే చేసినట్లు కన్నతల్లి లాంటి పార్టీ..తండ్రిలాంటి చంద్రబాబు అంటూ యెదవ లాజిక్కులు తీస్తే..సురుక్కుమనదా..అందుకే ఇప్పుడు టిడిపి వాళ్లు అనుభవించాల్సిందే...పైగా రాజీనామా చేశాను పార్టీకి అని చెప్పి వారమైన తర్వాత..తీరిగ్గా ఇప్పుడు సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించేందేంటి..

Comments