లోకేశ్ పని పవన్ సాబ్ పంచుకుంటున్నారా..చక్కని జోడీ


ఏమైంది సారూ..
ఏంటీ హుషారూ...అన్నట్లుగా..వారం రోజులనుంచి ప్యాన్స్ కి పండగే పండగ..వరసగా ఏపి సిఎంపై పంచులు కురిపిస్తున్నారు పవన్ కల్యాణ్ సాబ్..దీంతో మన సార్ ఫామ్ లోకి వచ్చేసారు..ఇక ఫుల్ టైమ్ పాలిటిక్స్ నడిపించేస్తారు అనే ఫీలింగ్ వచ్చిందంటే అందులో ఆశ్చర్యం లేదు..మాలాంటోళ్లందిరికీ బుద్ది వచ్చేలాగా..ఇక రాజకీయాలంటే ఏంటో చూపిస్తారేమో అన్నట్లుగా పవన్ కల్యాణ్ గారూ..మంచి రాజకీయ విమర్శలు చేస్తున్నారు..కానీ...కానీ..ఎక్కడో తేడా కొడుతోంది..

అసలు టిడిపిని కలుపుకోవడమే పెద్ద మైనస్..ఎందుకో వ్యాసము చివరిలో పంచ్ లైన్ లో ఉంటుంది..ట్విట్టర్లో కేక పుట్టించే నారా లోకేశ్ గారు..కాస్త అంటే కాస్త..తన పంచ్ లు మిస్సవుతు్న్నారు..ఇవాళ కూడా జగన్ పై వేసారనుకోండి ఓ పంచ్...కానీ ఇప్పుడా డ్యూటీని పవన్ కల్యాణ్ గారు పంచుకుంటున్నారేమో అన్పించకమానదు..మచ్చుకి ఓ ట్వీట్ చూడండి..ఆయనెవరో సిద్దార్ధ అట...రాష్ట్రంనుంచి రిలయన్స్ పోయింది డేటా ప్రాజెక్టు పోయింది..అప్పులు మూడున్నరలక్షల కోట్లయ్యాయ్...కళ్లు తెరవండి జగన్ గారూ..అంటూ ఓ ట్వీట్ పెట్టాడు..అప్పులు అన్నీ ఆర్నెల్లలోనే జగన్ పాలనలోనే వచ్చిపడ్డాయనేది ఆయన భావమా...అదంటుంచితే..చంద్రబాబుగారి హయాంలోనే 70వేలకోట్లరూపాయల డేటా ప్రాజెక్ట్ ఏపీకి రావడం..అది జగన్ గారు రాగానే తీసి పడేయడం జరిగినట్లు ఉంది. ఈ ట్వీట్ చదివితే...నిజానికి ఈ  ప్రాజక్టే కనుక ఏపీలో ఉండి ఉంటే..ఉద్యోగాలు...కనీసం లక్ష వచ్చి ఉండేవి..లేని ప్రాజెక్టు పోవడమేంటో...సదరు ట్వీట్ ని అజ్ఞాతవాసి హీరోగారు రీ ట్వీట్ చేయడం..
అక్కడికీ ఎంతో కష్టపడి దాన్ని తెలుగులోకి ట్రాన్స్ లేట్ చేసి మరీ తెలుగు వారి కోసం పెట్టాడాయన..అందుకే డౌట్ వస్తోంది..లోకేస్ గారి బాధ్యత పవన్ గారు మోయబోతున్నారా...ట్వీట్ల విషయంలో అని...

ఇక టిడిపిని కలుపుకోవడం ఎందుకు తేడా అంటే...దమ్ముంటే కలిసే పోరాడతాం ..లేదంటే క లివిడిగా ఉంటాం అని చెప్పాలి..అంతేకానీ ఎన్నికలకు ముందు బాబూ లోకేశ్ నీ అవినీతిని మీ తాత చూస్తే క్షోభిస్తారంటూ అడ్డగోలుగా గత్తరలేపిన పవన్ కల్యాణ్..ఆర్నెల్లు తిరగకుండానే...అదే పార్టీనేతలతో వేదిక పంచుకోవడానికి తహతహలాడటం తేడా కాదా..

Comments