నమ్మినవాళ్లందరికీ న్యాయం జగన్ ఫార్ములా



చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..ధర్మాన కృష్ణదాస్, కొడాలి వెంకటేశ్వర్రావ్, ఆళ్ల నాని, మేకతోటి సుచరిత, రోజా,  పుష్పశ్రీవాణి ఫృథ్వీరాజ్, దేవులపల్లి అమర్, రామచంద్రమూర్తి, మిధున్ రెడ్డి..వాసిరెడ్డి పద్మ, అంబటి రాంబాబు.. ఇదిగో ఇప్పుడు లక్ష్మీపార్వతి..ఈ లిస్టు చూడండి...వీరిలో కొంతమందిపై అనేక విమర్శలు వచ్చాయ్..వారి వల్లనే జగన్ కి చెడ్డపేరు వచ్చిందనే వాళ్లు కూడా కొంతమంది ఉన్నారు...కానీ వాళ్లంతా జగన్ వెంటే ఉన్నారు...జగన్ కూడా వాళ్లతోనే ఉన్నాడు

మంత్రి పదవులు..లేకపోతే కేబినెట్ ర్యాంక్ హోదా..ఇదే కదా ఓ మాదిరి పొలిటీషియన్ పాలిటిక్స్ లో కోరుకునేది..పైన చెప్పినవాళ్లలో సమర్ధత ఉన్నవాళ్లున్నారు..కేవలం విధేయత చూపినవారే ఉన్నారు...ఎవరైనా సరే..తమ పని ( పార్టీ కోసం) చేసినవాళ్లకి ఎలా రివార్డ్ ఇవ్వాలో అలానే వైఎస్ జగన్ ఇచ్చినట్లు క్లియర్ గా అర్ధమైపోతుంది..ఇది చాలదూ..వైఎస్ జగన్‌కి చెదరని ఫాలోయింగ్ ఏర్పాటు కావడానికి..వీరిలో ఎస్సీలు..బీసిలు..ఎస్టీలు , కమ్మ, రెడ్డి అందరూ ఉన్నారు..

ఐతే ముఖ్యమంత్రిగా జగన్ పని తీరుని విమర్శిస్తున్నవారికి కౌంటర్ ఇవ్వడానికి మాత్రం అంత తొందరగా మంత్రులు..ఎమ్మెల్యేలు బైటికి రావడం లేదంటారు..విమర్శలు వచ్చినంత మాత్రాన కౌంటర్లు వెంటపడి మరీ ఇవ్వాల్సిన అవసరం లేదు..పని చేసుకుంటూ పోవడమే..ఈ క్రమంలో వైఎస్ జగన్ కొంతమంది సీనియర్లుని కావాలని పక్కనబెట్టి ఉండొచ్చు..పార్టీలు మారి..కష్టకాలంలో వదిలేసి తిరిగి వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే వైఎస్సార్సీపీలో కుదరదని చాలామంది విషయంలో ప్రూవైంది..ఐతే బాగా పని చేయాలి..లేదంటే వారి వలన పార్టీకి లాభం జరగాలి..ఇదే ఫార్ములానీ జగన్ ఫాలో అవుతున్నాడనిపించకతప్పదు..
తాజాగా లక్ష్మీపార్వతిగారికి తెలుగు పీఠం దక్కడం కరెక్ట్ హోదా..ఆమెకి రాజకీయంగా ఉన్న సత్తా ఏంటో పక్కనబెడితే ఓ రచయితగా..కవిగా..సాహితీవేత్తగా ఆమె టాలెంట్ బైటి ప్రపంచానికి చాలా తక్కువే తెలుసు..ఆమె విద్వత్తుకి తగిన పదవి అని చెప్పాల్సిందే..దీంతో ఆమె తెలుగు రచనాలోకంలోని మరుగునపడిపోయే కవులకు..రచయితలకు సాయం చేయాలని..చేస్తారని అభిప్రాయం ఉంది..

Comments