లులూ గ్రూప్ పోతే ఎవరికి నష్టం..డోన్ట్ కేర్ జగన్


ఏపీలో ఇన్వెస్ట్ మెంట్స్ చేయమంటూ లులూ గ్రూప్ అనౌన్స్ చేసింది..అసలింతకీ లులూ గ్రూప్ ఎంత పెట్టుబడి పెడతామని చెప్పింది..2200కోట్లు.
ఎక్కడ ?
విశాఖపట్నంలో..ఏం కట్టేందుకు అంటే..ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్..దీనికి అప్పటి ప్రభుత్వం
వైజాగ్‌లో భూమి పంచింది..ఈ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో షాపింగ్ మాల్, ఫైవ్ స్టార్ హోటల్ కట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఓ వేదిక ఏర్పాటు చేస్తే..ప్రపంచస్థాయి సదస్సులు ఏపీలో జరిగితే వాటికి పర్ఫెక్ట్ వేదిక కావాలి కాబట్టి..దానికి ఈ లులూ గ్రూప్ కన్వెన్షన్ సెంటర్ సరిపోతుందనేది . ప్రభుత్వం(అప్పటి) వ్యూహం...లులూ గ్రూప్ కూడా ఇదే  చెప్పింది..

లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ తో ఏంటి లాభం

7వేలమందికి ఉద్యోగాలు..ఉపాధి కలిగేవట
లులూ గ్రూప్ ఎక్కడిది...--యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోది..
ప్రభుత్వం ఎంత స్థలం కేటాయించింది..13.83 ఎకరాలు..అంటే దాదాపు 14 ఎకరాలు
ఎక్కడ- హార్బర్ పార్క్ ఏరియాలో బీచ్ రోడ్ లో
రేటెంత- ఎకరం 4 లక్షలు..

అప్పట్లో ప్రభుత్వం ఏం చెప్పింది

చంద్రబాబునాయుడుగారు సిఎంగా ఉండగా...అజయ్ జైన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారప్పుడు..మూడేళ్లలో దశలవారీగా రూ.700కోట్లు లులూ గ్రూప్ పెట్టుబడి పెడుతుందని..ఇన్ క్యాప్ దీనికి నోటిఫికేషన్ ఇచ్చింది
ప్రాజెక్టు -ప్రవేట్, పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్ మోడల్‌లో పూర్తవ్వాలనేది అప్పటికి ఉన్న నిర్ణయం ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా కార్పోరేషన్ దగ్గర ఉన్న 9.3 ఎకరాలు..ప్రవేట్ స్థలమైన మరో 4.5 ఎకరాలు కేటాయించారు..
ప్రాజెక్టు ఏ దశలో ఉంది-?
ఈ ఏడాది ఫిబ్రవరిలోనే శంకుస్థాపన జరిగింది


లులూ గ్రూప్ ఏం చెప్తోంది.?
కరంట్ సిచ్యుయేషన్‌లో మేం ఏపీలో ఇకపై ఇన్వెస్ట్ చేయం..కానీ..తెలంగాణ,ఉత్తరప్రదేశ్,తమిళనాడు, కేరళలో మాత్రం టైమ్‌కే పూర్తి చేస్తాం..(ఈ  రాష్ట్రాల సంగతి ఇప్పుడెందుకు మాట్లాడటం)
ఇప్పటికే మేం కన్సల్టెన్సీలకు బోలెడంత డబ్బులు పోశాం..ఈ దశలో ప్రాజెక్టు రద్దు చేయడం సరికాదు..

ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది?
అక్టోబర్ 30న రద్దు చేసింది..ఎందుకంటే..కేటాయింపులలో గ్లోబల్ బిడ్డింగ్ జరగలేదని...(అంటే ఇక్కడ కూడా మళ్లీ రివర్స్ బిడ్డింగ్ ఉంటుందేమో తెలీదు) సిపిఎం జగన్ సిఎంగా మారగానే జూన్ 1న ఓ లెటర్ రాసింది..మీరు అప్పోజిషన్ లీడర్ గా ఉండగా..లులూ గ్రూప్ నిర్మాణాన్ని నిలిపివేస్తామని హామీ ఇచ్చారు..ఇప్పుడది నిలబెట్టుకోండి అని..దాన్ని కానీ కారణంగా ప్రభుత్వం ఇప్పుడు చెప్తుందా..?

అప్పటి తెలుగు రాష్ట్రాల అధినేతలతో లులూ గ్రూప్ రిలేషనేంటి..ఇది మాత్రం దేవ రహస్యం


Comments

  1. Yes. Maadeam poyindi. Maa astulaa maa pillala bhavishyat aa,..?
    Asalu anee poyina maake ti. Maa kurcho maaku te chaalu. Daani kosam smaajaanni chinnaga bhinnam chestamu.

    Oppandam mem chesukunte ganga opposition vaaallu chesukunte moosee...

    AP prajalaaraa,
    Meeku taggavaadu mee raaju.meeku sarva naasana
    Yoga arhta complete gaa undi.
    Best of luck.
    Yogam

    ReplyDelete

Post a Comment