ఇలాంటోళ్లని ఏం చేయాలి..సెల్ఫీకని వచ్చి !


సెలబ్రెటీలు ఇదివరకు ఆటోగ్రాఫ్ ఇవ్వడమే ఎక్కువ..అసలు దగ్గరికే రానిచ్చేవాళ్లు కాదు..కానీ ఈ మధ్య సెల్ ఫోన్ ట్రెండ్ ఓ రేంజ్‌కి చేరిపోయిన తర్వాత సెల్ఫీలే ఎక్కువ దిగుతున్నారు..స్టార్లు కూడా ఇదివరకటిలా ఫ్యాన్స్ కి దూరంగా ఉండటం లేదు దీంతో ఓ వైపు ఫాన్స్ కి దగ్గర కావడం..ఫాలోయర్లు పెరగడం మామూలైపోయింది..

కానీ ఈ వారం రోజుల పరిణామాల తర్వాత స్టార్లు కూడా ఫ్యాన్స్‌తో ఫోటోలు దిగాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది..రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ భయానీ అనే ఓ పర్సన్ పెట్టిన వీడియో చూస్తే..ఇంత చెత్తవెధవలేంటి జనం అన్పించకమానదు..హీరోయిన్ సారా ఆలీఖాన్ సెల్ఫీకి ఓకే చెప్తే..నడుంపై చేయి వేయబోయాడు..ఓసారి వద్దు అన్నా..మళ్లీ అదే పని..ఆమెకి ఇది కొత్త కాబట్టి..వదిలేసిందేమో కానీ..లేకపోతే చెంప చెళ్లమనేదేమో...

ఆడదంటే ఏదో ఆస్తి అయినట్లు భావించడం..తాకకుండా మాట్లాడలేకపోవడం ఇవన్నీ పెడబుద్దులకు సంకేతాలే..అఁదుకే బీ అలర్ట్

Comments