ఎస్పీజీకి థ్యాంక్స్....సోనియా గివింగ్ లెటర్


ఎస్పీజీ లాక్కుంటే లాక్కున్నారు..మాకు మాత్రం హ్యాపీగానే ఉంది..ఎందుకంటే ఎక్కడకెళ్లినా మీకు చెప్పాల్సిన అవసరం లేదు..కానీ మీరు చాలా గొప్పోళ్లు..ఇప్పటిదాకా మాకు బాగా సెక్యూరిటీ ఇచ్చారు..మీకు మా ధన్యవాదాలంటూ సోనియా రాహుల్ లెటర్ రాయడం రాజకీయాల్లో ఇంకా హుందాతనం పోలేదనిపిస్తోంది

1984,1991 ఈ రెండు సంవత్సరాలలో సోనియా కుటుంబానికి జరిగిన దారుణం గుర్తుంటే వారికి భద్రత విషయంలో
వెనుకా ముందాడాల్సిన అవసరం లేకుండా..ఏ రేంజ్ సెక్యూరిటీ కావాలంటే అది ఇవ్వడంలో తప్పులేదంటారు..కానీ మోదీ, షాలు ఇలాంటి వాటిలో చాలా పట్టింపులతో ఉంటారు..తమకి చెప్పి వెళ్లాలి లేదంటే అసలు మీకు సెక్యురిటీనే అక్కర్లేదనుకుంటాం అని తమ అంతేవాసులతో ఏడాదికాలంగా సిగ్నల్స్ పంపుతూనే ఉన్నారు( బిజెపి స్పోక్స్ పర్సన్స్...భజన ఛానళ్లతో)

ఐనా రాహుల్ సోనియా ప్రియాంకలు వినలేదు..మా ప్రైవసీ మా ఇష్టమంటూ ఎస్పీజికి చికాకులు పెట్టి..టూర్లు చేసేవారుట..అలా ముగ్గురూ విడివిడిగానే కనీసం వందసార్లు పర్యటించారని టాక్..అందుకే ఇక మీకెందుకు ఈ రేంజ్ సెక్యూరిటీ మీకవసరంలేదులే..అని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ రక్షణ వలయాన్ని తీసేసి..జస్ట్ సిఆర్‌పిఎఫ్ సెక్యూరిటీని
పెట్టేయబోతున్నారు..దీనిపై కాంగ్రెస్ పార్టీ చీత్కరించింది ఐనా..నో యూజ్..ఎందుకంటే అక్కడున్నది మోదీ..షా...

ఐతే అసలు కథలో లీడర్లు మాత్రం హుందాగా మాకిన్నాళ్లు రక్షణ ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ చక్కగా రెస్పాండ్ అయ్యారు..నిజానికి కాలం కలిసిరాకగానీ...రాహుల్ బాబే పిఎం అవ్వాలి కానీ..మళ్లీ ఎస్పీజీ యాక్ట్  లో రూల్స్ మారిపోవూ...కానీ అది జరుగుతుందా..?

Comments

  1. is it really needed SPG security for Gandhis..? LTTE ledu.. Prabhakaran ledu.. inkaa antha security avasaramaa vaallaki.. it seems you are hardcore anti BJP.

    ReplyDelete
  2. అయ్యా పిడక గారూ...నాకు కాంగ్రెస్ బిెజెపిని అంటించకండి..నేను వారి హుందాతనం గురించి మాత్రమే చెప్పా..సెక్యూరిటీ థ్రెట్ ఉండాలంటే మీరు చెప్పన ఎల్‌టిటిఈ మాత్రమే ఉండాలని నాకు తెలీదు..

    ReplyDelete

Post a Comment