ట్రిపుల్ తలాఖ్..జమ్ము కశ్మీర్, రామాలయం..ఇక తర్వాత అదేనా..?


ట్రిపుల్ తలాఖ్..రద్దు చేసేసారు..జమ్ము కశ్మీర్ స్పెషల్ స్టేటస్ రద్దు చేసేసారు..రామాలయం విషయంలో తీర్పు వచ్చేసింది..ఇక ఏం మిగిలింది...ఆ..కామన్ సివిల్ కోడ్..ఉమ్మడి పౌరస్మృతి..అదేనా...ఔనంటూ రాజ్ నాధ్ సింగ్ చెప్పేశారు..దేశంలో నివసించే  ఏ పౌరుడికైనా రెండు రకాల చట్టాలు కాదు..రాజ్యాంగం ప్రకారం ఒకటే చట్టం ఉండాలన్నదేఈ కామన్ సివిల్ కోడ్..వాస్తవ దృక్పథంతో చూసినప్పుడు కామన్ సివిల్ కోడ్ ఎవరికైనా వర్తించాల్సిందే..ఇందులో ఎవరూ ప్రత్యేకించి చెప్పాల్సిందేం లేదు

కానీ మన దేశంలోని మతాలను దృష్టిలో పెట్టుకుని ఓ వర్గానికి కొన్ని ప్రత్యేక సంప్రదాయాలు..సంస్కృతి ఉంది కాబట్టి ముస్లిం పర్సనల్ లా...లా బోర్డు అంటూ ఉన్నాయ్..వాటినే బిజెపి వ్యతిరేకిస్తూ వస్తోంది...తాము అదికారంలోకి వస్తే కామన్ సివిల్ కోడ్ అమలు చేస ్తామని బోలెడెసార్లు చెప్పుకొచ్చింది..ఇప్పుడు రెండోసారి వరసగా అధికారంలోకి వచ్చిన తర్వాత దూకుడు ఓ రేంజ్‌లో ఉంది..ఈ స్పీడు చెప్పాలంటే బిజెపి లీడర్లే తట్టుకోలేకపోతున్నారు..మరీ ఇంత ఇదిగానా అన్నంత వేగంగా నిర్ణయాలు వచ్చేస్తున్నాయ్...

అందుకే ఇక కామన్ సివిల్ కోడ్ ని సాధించేదాకా బిజెపి నిద్రపోదేమో అన్పిస్తుంది..ప్లానింగ్ కమిషన్ రద్దు చేసేసి నీతి అయోగ్ తెచ్చారు..జిఎస్టీ తెచ్చారు..డీమానిటైజేషన్ చేసారు..రైల్వే బడ్జెట్ చరిత్రలో కలిపేశారు..బడ్జెట్ ని జనవరికి మార్చారు..ఇలా ఏం చేసినా..స్పెషల్ గా కన్పిస్తున్న మోడీ హయాంలో ఇంకొక్కటే మిగిలిందంటూ ఓ జోక్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది..దయచేసి..ఆ పదిహేనులక్షల  రూపాయలు బ్యాంక్ అక్కౌంట్లో వేయడం కూడా చేసేయండని...



ఐతే కామన్ సివిల్ కోడ్ ని ఇప్పుడు తెద్దామా....లేక జమిలి  ఎన్నికలనే మహా ద్భుత ఘట్టాన్ని ఆవిష్కరిద్దామా అనేదే ఇప్పుడు మోదీ మనసులో మెదులుతోందట


Comments