వాటే డ్రామా..బాబుగారి సాష్టాంగ ప్రమాణం..మోడీగారు అప్పాయింట్ మెంట్ ఇవ్వడమే లేట్ ఇక


ఉద్దండరాయని పాలెంలో చంద్రబాబుగారు ఇలా మోకరిల్లారు..రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతం కాబట్టి..ఇలా సెంటిమెంట్ గా ఫీలయ్యారాయన..కానీ ఇక్కడ ఫోటో చూస్తే తెలీడం లేదా..అక్కడ ఆ రాయి తప్ప ఇంకేం పడలేదని
ఐనా ఇక్కడ అంత అన్యాయం జరుగుతుందని ఎవరూ అనుకోవడం లేదు..రాజధాని తరలిపోతుందని ఎవరూ అనుకుని బెంగపడాల్సిన అవసరం అసలే లేదు..

యాక్చువల్‌గా రాజధాని అంటే ఏంటో ముందు చెప్పాలి..అంతకు ముందు హైదరాబాద్ గురించి మాట్లాడినప్పుడల్లా..ఒకటే మాట అందరూ చెప్పేవాళ్లు..అది అభివృద్ధి కేంద్రీకృతం కావాలి..అని అంటే..రాష్ట్రంలోని
అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలంటే..పెద్ద పెద్ద సంస్థలు..ప్రభుత్వ కార్యాలయాలు..అన్ని జిల్లాల్లో ఏర్పాటు కావాలి..వైఎస్సార్ నుంచి వయా కిరణ్ కుమార్ రెడ్డి టూ చంద్రబాబు అందరూ ఇదే మాట చెప్పేవాళ్లు...తీరా రాష్ట్రం విడిపోయిన తర్వాత..చంద్రబాబుగారు ఇదే మాట అన్నారు కానీ..తర్వాత రూట్ మార్చేశారు.

మొత్తం అన్ని సంస్థలు..అమరావతి లోనే పెడతాం అన్నారు..దీని వెనుకే పెద్ద మతలబు ఉన్నట్లు ఆరోపణలున్నాయ్..ఎందుకంటే..అసలు రాజధాని అంటే..అసెంబ్లీ, సెక్రటరియేట్..రాష్ట్రంలోని అన్ని విబాగాల హెడ్డాఫీసులు..అంతే కదా...మరి..వీటికోసం 30వేల ఎకరాలు అవసరమా...! ఈ మాట అంటే ఎందుకంత ఉలికిపాటు..
హైకోర్టు ఒకచోట..ఎయిమ్స్ మంగళగిరిలో..ఐఐటి తిరుపతి..వైజాగ్‌లో చెరొకటి..ఐటీ కారిడర్ వైజాగ్..విజయవాడలో
కోస్టల్ కారిడార్ కాకినాడ టూ నెల్లూరు..అగ్రికల్చర్,,ఆక్వా యూనివర్సిటీలు..ఉత్తరాంధ్రలో ఇలా డెవలప్ చేస్తేనే కదా..ఏపీలో ప్రతి జిల్లాలో డెవలప్ మెంట్ వచ్చేది.ఇది మానేసి..రాజధానిని డిస్ట్రాయ్ చేయడమేంటి..బాబుగారూ...

మోదీగారు వేసిన శిలాఫలకం చూసి నమస్కారం పెట్టేబదులు..నిన్న అమిత్  షా దగ్గరకి వెళ్లిన ఎంపీలతో బాబూ మీరేసిన రాయి పదిలంగా ఉంది..ఏపీకి ఫండ్స్ ఇబ్బడి ముబ్బడిగా పంపండి అని కబురు పంపకపోయారా..ఇప్పుడంటే ఆగిపోయి ఉండొచ్చు..( కన్ఫామ్ గా తెలీదు కానీ) మరి ఆరు నెలల క్రితం వరకూ మీర కదా సీఎం ఎందుకు ఉద్దండరాయనిపాలెంలో పెద్ద పెద్ద సంస్థలను రప్పించలేకపోయారు..? రియల్ ఎస్టేట్ బిల్డింగ్స్ చూపించి...సెకలు పడకండి..అదే బిల్డరైనా చేస్తాడు

Comments

  1. ఓరి నాయనో ఏమి డ్రామా ట్రిక్స్ ఇవి. ఇందాకే ఈనాడు లో వార్త ఇచ్చారు. - బాబు గారు అప్పటి అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలిస్తున్నా రట. అంటే ఈనాడు ఇంకా బాబుగారినే ముఖ్యమంత్రిగా భావిస్తుందా.

    ReplyDelete
    Replies
    1. పరిశీలించడం ముఖ్యమంత్రే చెయ్యక్కర్లేదు. ఎవ్వరైనా చెయ్యొచ్చు. కావాలంటే మీరూ వెళ్లి పరిశీలించుకోండి. పేపర్లో రావాలంటే మాత్రం మీరూ ఓ పేపర్ పెట్టుకోండి. (అబ్బా జేబులో టిస్ష్యు పేపర్ కాదండీ.. మీకెలా చెప్పేది?)

      Delete
  2. ఆయన జస్ట్ అలా పడుకున్నాడో లేదో మీరేమిటి అప్పుడే ఫీలయిపోతున్నారు!

    ReplyDelete

Post a Comment