అంత మిడిసి పడొద్దు..ఇదీ బిజెపికి 2019 ఇచ్చిన జలక్



2019 భారతీయ జనతా పార్టీకి బాగా కలిసి వచ్చింది.  పార్లమెంట్ ఎన్నికలలో అప్రతిహతమైన విజయం దక్కింది..ఐతే ఏడాది చివర్లో మాత్రం  ఎదురుదెబ్బలు తిన్నది కూడా ఈ ఏడాదిలోనే. ఈ ఏడాది  ఏడు దశలలో జరిగిన లోక్‌సభ ఎన్నికలు బిజెపికి కనివినీ ఎరుగని విజయాన్ని కట్టబెట్టాయ్. ఈవిఎం బాక్సులు బద్దలయ్యేలా 543 సీట్లకు గానూ..353 సీట్లలో గెలిచి ఎన్‌డిఏ అలయన్స్ రికార్డ్ క్రియేట్ చేసింది..వీటిలో బిజెపి సొంతంగా 303 సీట్లు దక్కించుకుంది. అంతకి ముందు బిజెపి 200 నుంచి 220 సీట్లకి పరిమితమవుతుందనే అంచనా
కాస్తా..తలకిందులు కావడంతో..మోదీ షా మ్యాజిక్‌కి ఎదురులేదని తేలిపోయింది..అటు పార్టీలో కూడా ఈ ఇద్దరి కాంబినేషన్‌పై నోరెత్తేవాళ్లే లేకుండాపోయారు. ఓ రకంగా ఇప్పుడు బిజెపి అంటే మోదీ..అమిత్‌షాలే..ఇంకో లీడరే బిజెపికి కన్పించరన్న స్థాయిలో వీరి ప్రభ 2019లో వెలిగిపోయింది. కేబినెట్ కూర్పు కూడా మొత్తం తామనుకున్నవాళ్లకే అలాట్ చేసుకున్నారు..సుమిత్రామహాజన్, మురళిమనోహర్ జోషిలాంటి వాళ్లని సీనియర్లనే మొహమాటమే లేకుండా...పక్కనపెట్టేశారు..మొదటిసారిగా మంత్రి అవుతూనే అమిత్‌షా ఏకంగా హోంమినిస్ట్రీని చేపట్టగా..నిర్మలాసీతారామన్‌కి ఫైనాన్స్ మినిస్ట్రీ ఇచ్చారు..స్వతంత్రభారతదేశంలో  పూర్తి స్థాయిలో ఓ మహిళ ఆర్ధికమంత్రిత్వశాఖ నిర్వహించడం బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా 2019లో చోటు చేసుకున్న ఓ రికార్డు..

 ఎన్నికలలో బిజెపికి భారీ మెజారిటీ దక్కింది కాబట్టే..ఈ ఇద్దరు మిత్రులూ తాము అనుకున్నది పర్ఫెక్ట్‌గా చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు..ఐతే ఆగండాగండి..మీకు బ్రేకులేయాల్సిందేనంటూ ఓటర్లు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తీర్పు ఇచ్చేశారు. ..అక్టోబర్ 25న విడుదలైన హర్యానా,మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్స్‌లో
బిజెపికి షాక్ తగిలింది. హర్యానాలో 90 సీట్లుంటే..బిజెపికి 40 మాత్రమే దక్కాయి..కాంగ్రెస్ 31 సీట్లు గెలుచుకోగా..జననాయక్ జనతా పార్టీ మద్దతుతో పీఠం దక్కించుకున్న బిజెపిది చావుతప్పి కన్నులొట్టబోయిన పరిస్థితే..

ఇక మహారాష్ట్రలో అయితే ఈ పార్టీకి పెద్ద దెబ్బే తగిలింది. దశాబ్దాల నాటి స్నేహానికి శివసేన గుడ్‌బై చెప్పడంతో సంకీర్ణ రాజకీయాల్లో బిజెపి నేర్చుకోవాల్సిన పాఠాలు ఇంకా ఉన్నాయంటూ మరాఠా యోధుడు శరద్ పవార్ చెప్పకనే చెప్పారిక్కడ. ఫలితాలు వచ్చిన నాటి నుంచి శివసేన ముఖ్యమంత్రి పీఠం కోసమే ఓపెన్‌గా స్టేట్‌మెంట్లు ఇవ్వగా..బిజెపి మాత్రం పార్టీలను చీల్చడంపైనే ఫోకస్ చేసి దెబ్బైపోయింది..అక్టోబర్ 25 నుంచి నవంబర్ 28 వరకూ చోటు చేసుకున్న మహానాటకంలో ఫస్ట్ ప్రైజ్ శివసేన దక్కించుకోగా..గవర్నర్, కేంద్రపెద్దలనే జడ్జిలు బిజెపివైపే ఉన్నా.. జస్ట్ ప్రేక్షకపాత్రకే పరిమితమవ్వాల్సి వచ్చింది..సరైనోడు తగలాలే కానీ..
బిజెపికి కూడా చుక్కలు చూపించవచ్చని ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్ ఇక్కడ ప్రూవ్ చేశారు..ఇలాంటి లీడర్ లేకపోవడంతోనే..కర్నాటకలో సేమ్ సిచ్యుయేషన్‌లో కాంగ్రెస్-జెడిఎస్
సర్కారు పడిపోయి బిజెపి పరమైంది...17 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్-జెడిఎస్ కూటమికి గుడ్ బై చెప్పేయగా..2019 జులైలో రెండు వారాల పాటు కర్నాటకం చోటు చేసుకుంది.ఛార్టర్ట్ ఫ్లైట్లు..రిసార్ట్ పాలిటిక్స్..అసెంబ్లీలో రెండు రోజులపాటు విశ్వాసతీర్మానంపై చర్చ అంటూ సాగదీసినా..చివరికి యెడ్యూరప్ప మరోసారి ముఖ్యమంత్రి కావడం 2019లో బిజెపి వరకూ ఓ ముఖ్యమైన డెవలప్‌మెంట్‌గా చూడాలి

 2019 వెళ్తూ..వెళ్తూ కూడా బిజెపికి జార్ఖండ్ రూపంలో పెద్ద ఝలక్ ఇచ్చెళ్లింది..81 సీట్ల అసెంబ్లీలో బిజెపికి పాతిక సీట్లని ఓటర్లు కట్టబెట్టగా..జార్ఖండ్ ముక్తి మోర్చా 30సీట్లలో విజయఢంకా మోగించింది. ఇక్కడ కూడా బిజెపి మిత్రపక్షాలను వదిలేయడంతో ఓటమిపాలైనట్లు వాపోతోంది..ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌తో కనుక కలిసి పోటీ చేసి ఉఁటే రిజల్ట్ వేరేగా ఉండందంటోంది. ఐతే ఇంత తెలిసి ముందే  ఊహించలేకపోవడం బిజెపి స్ట్రాటజిస్ట్ అమిత్‌షా తప్పేనంటారు..మొత్తం మీద బిజెపి వరకూ 2019 కలిసి వచ్చిన సంవత్సరంగా చెప్తున్నా..జార్ఖండ్ పరాజయం..మహారాష్ట్రలో మిత్రబేధం పంటికిందరాళ్లలా బాధిస్తాయనడంలో డౌటే లేదు..అటు కర్నాటక, ఇటు హర్యానాలో అధికార పీఠం దక్కించుకున్నా..ఈ క్రమంలో బిజెపి విలువలు కోల్పోయిన పార్టీగా 2019లో ముద్రవేయించుకుంది..ఇక్కడే రీజినల్ పార్టీలు దేశవ్యాప్తంగా బలపడిన..బలపడుతున్న సందర్భాలను
కూడా గమనించాలి..ఇప్పటిదాకా తాము ఆడిందే ఆటగా ఫీలైన బిజెపి అగ్రనేతలు..ఇక ప్రాంతీయ పార్టీలు చెప్పిందానికి తలొగ్గకతప్పదనే పరిణామాలను 2019వారికి కాస్త గట్టిగానే చూపించింది..

Comments