పడి లేస్తోందా..లేక తోక పార్టీగా మారుతుందా కాంగ్రెస్ సిచ్యుయేషన్ ఇన్ 2019


కాంగ్రెస్ పడి లేస్తుందా...లేక పూర్తి తోకగా మారబోతోందా...ఇదే ప్రశ్న ఇప్పుడు 2019 పూర్తయ్యేసరికి విన్పిస్తోన్న ప్రశ్న.. ఎందుకంటే..ఈ పార్టీ లీడర్షిప్ నాకొద్దూ అంటూ రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టిన తర్వాత పరిమిత స్థాయిలో అయినా  కాంగ్రెస్‌కి విజయాలు దక్కాయి..అందుకే ఈ డౌట్.. 2019 పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తగిలిందనేమాట అక్షరాలా నిజం...దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్.. అత్యంత దారుణమైన స్థితికి దిగజారింది..2014కంటే ఎనిమిది సీట్లు ఎక్కువ గెలవడం నిజమే కానీ..వరుసగా రెండోసారి ఈస్థాయికి పడిపోవడం కాంగ్రెస్ కేడర్‌ని కకావికలం చేసింది..అంతకు ముందు చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన ఊపులో లోక్‌సభలోనూ దున్నేయడం ఖాయమేననే అంచనాల మధ్య ఊహల పల్లకిలో ఊరేగారు ఆ పార్టీ నేతలు..ఐతే ఫలితం చూస్తే దిమ్మదిరిగి మైండ్ బ్లాంకైంది..చివరికి పార్టీ అధ్యక్షుడైన రాహులే అమేథీ నుంచి ఓడిపోయారు.. ఇది చాలు కాంగ్రెస్‌కి 2019లో ఓటర్లు ఎలా వాత పెట్టారో అర్ధమవడానికి...దీంతో కాంగ్రెస్ అధ్యక్షపదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు..దాదాపు రెండు మూడు నెలలపాటు ఇదంతా లైట్ తీస్కున్నా..చివరికి మేడమ్ సోనియానే అధ్యక్షపగ్గాలు చేపట్టడంతో కాంగ్రెస్ ఎంతటి దీనస్థితిలోపడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు..అనారోగ్యకారణాలతో యాక్టివ్ పాలిటిక్స్‌కి దూరమైన సోనియానే పార్టీని కాపాడేందుకు రంగంలోకి దిగడం 2019లో కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న అతిపెద్ద పరిణామం..రాహుల్ గాంధీ సౌతిండియాలోని వయనాడ్‌నుంచి ఎంపికైంది కూడా 2019 ఎన్నికలలోనే.

కాంగ్రెస్ అంటే సోనియా, రాహుల్ గాంధీ..ఇదే గత పదేళ్లుగా కన్పించిన సీన్..ఇప్పుడు 2019 పూర్తై వెళ్తున్నా అందులో ఏమాత్రం మార్పులేదు అదే పోత..కాకపోతే ఈసారి ప్రియాంకగాంధీ కూడా ఆ వరసలో చేరిపోయారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత మరో దెబ్బ కర్నాటక రూపంలో కాంగ్రెస్‌కి తగిలింది
జెడిఎస్‌పైకి అదే పనిగా దూకుతోన్న రెబల్ ఎమ్మెల్యేలను కట్టడి చేయలేకపోవడం అటు లోకల్ లీడర్లతో పాటు..ఢిల్లీ పెద్దలదే తప్పుగా చూడాలి..దీనికి పర్యవసానంగా సౌత్‌లో ఉన్న ఒక్క స్టేటూ చేజారిపోయింది..కాంగ్రెస్ పార్టీకి వాస్తవానికి లీడర్లకి కొదవలేదు..ఎటొచ్చీ ప్రతి చోటా ఒకరంటే ఒకరికి పడకపోవడమే ఆ పార్టీ కల్చర్..దాన్ని ఎంకరేజ్ చేయడం కాంగ్రెస్ హైకమాండ్ కి ఓ సంప్రదాయం..అదే పరిస్థితిని 2019లోనూ కాంగ్రెస్ కొనసాగించింది..మధ్యప్రదేశ్‌లో వరస ఓటముల తర్వాత గెలిచినా..కమలనాధ్‌ వర్సెస్ జ్యోతిరాదిత్య పోరు సాగుతున్నా పట్టించుకోకపోవడమే దీనికి నిదర్శనం..
మరోవైపు రాహుల్ అస్త్రసన్యాసం తర్వాత సోనియాగాంధీ పగ్గాలు చేపట్టడంతో ఆ పార్టీలో కాస్త కదలిక కన్పిస్తోంది..హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో సీనియర్లకి పెద్ద పీట వేయడంతో..మంచి సీట్లు సాధించగలిగింది..అలానే జార్ఖండ్‌లో కూడా విజయంలో భాగస్వామి కాగలిగింది..అలానే మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమి ఏర్పాటు కావడానికి 44 సీట్లు గెలిచినా స్పీకర్ పదవి సహా 12 కేబినెట్ పదవులు దక్కడానికి మేడమ్ సోనియా గైడెన్సే కారణమంటారు..ఐతే ఇదంతా ఒకవైపు...ఇన్నాళ్లూ తానే సిఎం పోస్ట్..ఆ తర్వాతి పోస్టులు ఇతర పార్టీలకు కట్టబెట్టే కాంగ్రెస్..ఇకపై సంకీర్ణంలో భాగస్వామిగానే మారుతోన్న పరిస్థితిని 2019 చూపించింది..దేశవ్యాప్తంగా ఆ పార్టీ ఇకపై తోక పార్టీగా మారబోతోందా అనే ఆందోళన ఆ పార్టీ కేడర్‌ని పీడిస్తోంది. అధికారానికి దూరంగా పదేళ్లు దేశస్థాయిలో ఉండాల్సి రావడంతో పాటు..రాష్ట్రాలలో కుంచించుకుపోవడం ఈ రెండే పాయింట్లు..మనకు 2019ని తరచి చూసినప్పుడు కాంగ్రెస్ సీన్‌ని కళ్లముందు చూపెడుతోంది

Comments