గొల్లపూడికి మొద్దుశీను రాసిన లెటర్ ఇదే

మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఆయన చంటి మావ్యా....
వెంకటేష్  ఫ్యాన్స్ కి ...సింగిల్ పూరీ శర్మ గారు
చిరంజీవి ఫ్యాన్స్ కి గద్దముక్కు పంతులు.
.ఇలా హీరోలు ఎంతమందున్నా...అందరి సరసనా నటించి తన ప్రాధాన్యత..గుర్తింపు..నిలబెట్టుకున్న కొంతమంది నటుల్లో ఆయన ప్రముఖుడు..కన్నింగ్ తో కూడిన విలనిజం..అదే స్థాయిలో కొడుకులు..అల్లుళ్ల చేతిలో దగాపడిన తండ్రిగా..మామగా ..ఓ మధ్యతరగతి మనిషిగా..గొల్లపూడి నటన అనితర సాధ్యం..

ఐతే ఆయనలోని గొప్ప రచయిత సాహితీలోకంలోని వారికి..ఎక్కువగా ఆ సైడ్ ఉన్నవారికే తెలుసు..


బహుశా ఇప్పుడే సందర్భం..ఇదే సందర్భం ఇక ఈ ప్రస్తావన తీసుకొచ్చే అవసరమే ఉండకపోవచ్చు..నటుడు రచయిత అంతకు ముందు నాటకరంగ ప్రముఖుడు..ఆకాశవాణిలో ప్రయోక్త అయిన గొల్లపూడి మారుతీరావ్ ఎక్కువమందికి నటుడిగానే తెలుసు..కానీ ఆయన ఎంత గొప్ప రచయితో..భావుకుడో తెలిపేందుకు కొన్ని పుస్తకాలు చూస్తే చాలు అర్ధం అవుతుంది..

వాటిలో కౌముది.నెట్ అనే వెబ్ మ్యాగజైన్ చదివేవారికి గొల్లపూడి గారి రచనలు అన్నీ కాకపోయినా..దాదాపుగా తెలిసి ఉంటాయ్..అలాంటి వాటిలో ఒకటి ఎర్రసీత..ఆ ఎర్రసీత...మొద్దుశీను అనే వ్యక్తిని కదిలించిందంటే ఆశ్చర్యం ఏమీ ఉండదు..చాలా రోజుల క్రితమే ఆయన చెర్లపల్లి జైలు నుంచి గొల్లపూడికి రాసిన ఓ ఉత్తరం గురించి ప్రస్తావన ఉంది..ఐతే గొల్లపూడి గారి మరణానంతరం ఆ ఉత్తరం కూడా వెబ్ సైట్‌లో పెట్టారు..అదే ఈ కింది భాగాలు..చూడండి







చదివారు కదా..అడ్డదిడ్డంగా మీకు లెటర్ అందించినా...అసలు భావం తెలిసిపోయింది..కదా..మొద్దుశీను ముద్దుగా మొద్దే కానీ...అతను నేరస్తుడు కాదు..అలానే ఇప్పుడు అందరికీ గొల్లపూడి గారి ఎర్రసీతపై మనసై బోలెడంతమంది మళ్లీ చదవడం ప్రారంభమైంది..
ఈ లెటర్ అంతా కౌముది గారి సౌజన్యంతోనే 

Comments