చిరంజీవి..అఖిల ప్రియ తొందరపడి కూసేరా..మరి ఆళ్ల కనబడుటలేదే..!


పాలిటిక్స్‌లో ఒక్కోసారి ఫాస్ట్‌గా మూమెంట్స్ ఉండాలి..స్పందించడం కూడా వేగంగా ఉండాలి..ఒక్కోసారి స్పందించకుండా..జస్ట్ చూస్తుంటే చాలు ఈ రెండింటిలో ఏదెప్పుడు చేయాలనేది తెలిసినవాళ్లే రాజకీయాల్లో ఎక్కువకాలం ఉంటారని అర్ధమవుతుంది. అలా ఇప్పుడు రాజధానిని మూడు ప్రాంతాలలో
ఏర్పాటు చేయడమనే అంశంపై స్పందించడంలో..మహామహులే లైట్ తీస్కుంటుంటే( స్పందించడం విషయంలోనే) చిరంజీవి, అఖిలప్రియ  మాత్రం చాలా చాలా వేగంగా డైలాగులేసేశారు..

మూడు ప్రాంతాలలో రాజధానులు ఉండటమనేది చాలా ముదాహవం అంటూ చిరు స్పందించడం అస్సలు అనవసరం అనే అంటున్నారు ఎందుకంటే ఆయనిప్పుడు పొలిటీషియన్ కాదు..అంత అర్జంట్‌గా స్పందించాల్సిన అవసరం కూడా లేదు..ఎందుకంటే..రియల్ డెసిషన్స్ డిసెంబర్ 27న కానీ రావు
మరిది తొందరపడి కూయడం కాదా...? ఎందుకంటే మెగాస్టార్ ఫ్యామిలీకి రాష్ట్రమంతా అభిమానులు ఉండొచ్చు..కానీ గుంటూరు కృష్ణాజిల్లాల్లో ఫ్యాన్స్ మాత్రం ఈ తొందరపాటు ప్రకటనపై మండిపడటం ఖాయం..ఆల్రెడీ స్టార్టైపోయింది కూడా..

ఇక అఖిలప్రియ విషయం చూస్తే..తండ్రిమరణంతో మంత్రిపదవి చేపట్టినా..ఫిరాయింపు ఎమ్మెల్యేగా..పేరుబడ్డారు..సీమ ప్రాంతంలో అందులోనూ తన ప్రాంతంలోనే హైకోర్టు వస్తుంటే..దాన్ని స్వాగతించాల్సింది పోయి..పెద్ద పుడింగ్‌లాగా..బెంచ్‌లు వేరే చోట అంటున్నారు ఇంకేంటి లాభం..అసలు విజయవాడని మేం అందరికీ దగ్గర కాబట్టి ఏర్పాటు చేసామంటూ ఆరిందాలాగా ప్రకటనలు చేయడం పొలిటికల్ కెరీర్‌కి ఎండ్ కార్డ్ పడేవే..ఆల్రెడీ చంద్రబాబుగారు కర్నూలు హైకోర్టు విషయంపై ఎవరూ మాట్లాడవద్దన్నారని టాక్ నడుస్తోంది..ఇలాంటి సిచ్యుయేషన్‌లో ఆమె ఇలా కామెంట్ చేయడం..సొంత ఇలాకాలో నష్టంతో పాటు..పార్టీకి కూడా నష్టం కలిగించవచ్చు  పార్టీ సంగతి పక్కనబెడితే..సీమద్రోహిగా కొన్ని రోజుల్లోనే ఆమెపై ప్రచారం జరగడం ఖాయం..
ఇక మూడో వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి...2014 నుంచి 2019 వరకూ టిడిపికి నీళ్లు తాగించిన ఈ ఎమ్మెల్యే మంగళగిరిలో మందలగిరి మాలోకాన్ని శంకరగిరి మాన్యాలు పట్టించడంతో మంత్రి అవుతారని ఎక్స్ పెక్ట్ చేశారు కానీ అది జరగలేదు..ఇప్పుడు రాజధాని తరలిపోవడంపై ఎటూ మాట్లాడకపోవడంపై బోలెడన్ని విమర్శలు వస్తున్నాయ్..ఓ వైపు గుంటూరు జిల్లాలోని నరసరావుపేట ఎమ్మెల్యే చేసినంత ధైర్యం కూడా చేయకపోవడంపై విమర్శలు తప్పదు.

పైన ఇద్దరూ తొందరపడి స్పందిస్తే..ఆళ్ల మాత్రం స్పందించక తప్పు చేస్తున్నారా..కాలమే జవాబు చెప్తుంది

Comments

  1. ఇవాళ కన్నా గారు చెప్పేసారు "అమరావతి కోసం భాజపా పోరాడుతుంది" అని.
    నిజంగా? అని అడగొద్దు. ప్రత్యేకహోదా కోసం కట్టుబడినంత నిబద్ధత ఖఛ్చితంగా ఉంటుంది వారి పోరాటంలో!!

    ReplyDelete
    Replies
    1. ఇవాల వెంకయ్య నాయుడుగారు అన్నారు "ఇంగ్లీషువాల్లు మనకి వాళ్ళభాష నేర్పారుగానీ, మన తెలుగు నేర్వలేదు అని".. మరి ఉత్తరాది భాజాపా పెద్దలు తెలుగు తమిళాలు నేర్వకుండా, హిందీ మనమీద ఎందుకు రుద్దాలనుకున్నారో సెప్పరు గాక సెప్పరు..

      Delete
    2. వంకాయల నాయుడు చదివే స్క్రిప్ట్ ఎవరిచ్చిందో తెలువంది ఎవరికి? ఉన్నతమయిన రాజ్యాంగ పదవిలో కూచున్నాననే సోయి కూడా లేకుంట "కనకపు సింహాసనం మీద శునకం" తరహా పరాచికాలు చేసే బదులు, తన కులపోళ్ల పిల్లల కోసం పెట్టుకున్న స్వర్ణ భారతి బడులను తెలుగు మీడియం చేయొచ్చు కదా.

      Delete
    3. పరకాల ప్రభాకర్ అనే ఇంకొకాయన "భాషోద్యమంలో" కొత్త బిచ్చపోడు మల్లె బయలుదేరాడు. వాళ్ళ కుటుంబ ట్రస్ట్ నడిపే ఇస్కూలులో తెలుగు మాధ్యమం పెట్టడానికి మాత్రం ఇతడికి మనసొప్పదు.

      Delete
  2. రాజధాని తరలిపొయిందా?? నిజమా??

    ReplyDelete

Post a Comment