మా అంచనాలే కరెక్ట్..ఇక అభివృద్ది విషయంలోనూ ఇలానే జరగాలి


మొదటి నుంచీ రాజధాని విషయంలో ఓ వేళ మార్పు ఉంటే ఇలానే జరుగుతుందన్న అంచనా వేసినందుకు..సంతోషంగా ఉంది..అయితే ఏ నిర్ణయమైనా అది సత్ఫలితం ఇస్తుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. అభివృధ్ది ఎప్పుడూ ఒక్కచోటే ఉండకూడదన్న సూత్రం అమలు కాబోతున్నందుకు మరీ హ్యాపీ..

అందరూ బాగుండాలి..అందులో నేనుండాలి..ఈ లైన్ ఆటోలపై లారీ కేబిన్లపైనే కాదు..రాజకీయనాయకులు కూడా చెప్తుంటారు..ఆచరించినప్పుడే కదా అందులో ఆనందం..అందం..అందుకే ఇప్పుడు మూడు రాజధానులు..పేరుకు రాజధానులే కానీ..అసలు రాజధాని అమరావతే అనడంలో సందేహం లేదు..ఎందుకంటే మనవరకూ రాజధాని అంటే అక్కడ అసెంబ్లీ ఉండాలి..అక్కడ సెక్రటరియేట్ ఉండాలి..అక్కడే మంత్రులు..ఎమ్మెల్యేలు ఉండాలి...అంటే ప్రభుత్వాన్ని నడిపించే మంత్రులశాఖలు..అక్కడ ఉండాలి..ఎందుకంటే..పరిపాలన సాగించే రాజు ఉండే చోటే రాజధాని..కాబట్టి...
ఇక ఇందులో జగన్ ప్రకటన కాస్త మెలికగా ఉన్నా...వైజాగ్‌లో మంత్రులను కూర్చొబెట్టి అక్కడ్నుంచి పాలన సాగిస్తారని మాత్రం  అనుకోవడం లేదు..ఓ వేళ అలా ఉన్నా..కూడా డిజిటల్ పాలనగా చేస్తారేమో చూడాలి..
ఇక ఎక్కడ ఏ మాన్‌స్టర్ బిల్డింగ్ కట్టుకుంటారనేది..పారిశ్రామికవేత్తలు...ఇండస్ట్రియలిస్టుల ఇష్టం..కర్నూలు వాసుల చిరకాల కోరిక...కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనేది..అది ఈ రకంగానైనా తీరడం ఆ ప్రాంతవాసులకు పండగే

కానీ టిడిపి ఆందోళనకి కాస్త విలువ ఇవ్వాలి..ఎందుకంటే..కేవలం తమ భూముల విలువ పెంచుకునేందుకే అయితే ఈ త్రీపాయింట్ ఫార్ములా బెడిసి కొట్టడం ఖాయం..కానీ ఇంత అడ్డగోలుగా ఆ పని వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తుందని అనుకోవడం లేదు

Comments