త్రికేంద్రీకరణ..త్రిఫలచూర్ణమా..త్రీ కేపిటల్ ప్లాన్‌తో జగన్ సెన్సేషన్


ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు...ఈ మాట అనగానే వెంటనే ఇందులో తప్పేముంది అని కొందరు..నాశనం..దుంప నాశనం..సర్వనాశనం  అంటూ కొందరు రెచ్చిపోవడం ప్రారంభించారు..అక్కడికీ క్లియర్ గానే ముఖ్యమంత్రిగారు చెప్పారు..ఎక్కడ ఏది ఉండబోతోందో..అయినా కమిటీ రిపోర్ట్ ఇలా ఉండాలని లేదు..ఇలానే ఉండాలని అసలే లేదు
ఓ వేళ కమిటీ రిపోర్ట్ ఇలానే లేకపోయినా...చేయాలనుకుంటే ఎలాగైనా చేయగలిగిన అధికారం చేతిలో ఉంది..ఐతే ఇక్కడ సెంటిమెంటల్ గా ఫీలై...రైతులకేదో అన్యాయం జరుగుతుందనే వాళ్లకి ఒకటే మనవి..మన ఇల్లు...పొలం..ఆస్తి..ఏదైనా ఇతరులకు అమ్మేసిన తర్వాత దానిని ఎవరు ఎలా వాడితే మాత్రం మనం అభ్యంతరం పెట్టగలమా...లేదు

అదే రైతుల దగ్గర పొలం లీజుకు తీసుకుని ఉఁటే..అద్దెకి తీసుకుని ఉంటే మాత్రం...ఖచ్చితంగా అబ్యంతరం పెట్టవచ్చు..మనం అద్దెకి ఇచ్చింది ఇల్లు..ఫలానా పనికి అని..కానీ తర్వాత అది వేరే పని కోసం వాడితే మాత్రం కోర్టుకైనా వెళ్లవచ్చు..కానీ రాజధాని విషయంలో ిఅప్పుడు ఇప్పుడు చంద్రబాబు అండ్ కో చేస్తోన్న పని అదే..అమ్మేసుకున్న రైతులు..లేదంటే స్వచ్చందంగా ఇచ్చిన రైతులకు..ఆమేరకు డబ్బులు కట్టేసి ఉండాలి..లేదంటే ఇప్పటికైనా ఇవ్వాలి..అలా డబ్బులు ఇవ్వని పక్షంలో వారి పొలం వారికి అప్పగించాలి..ఇది న్యాయం..

అంతేకానీ.. రాజధాని వస్తుందన్న ఆశతో పొలం ఇచ్చామనడానికి నిజంగా చట్టపరంగా హక్కు లేదు..ఇది ఓ వాదన..ఇంకొకటి..రాజధాని అంటే ముందు నిర్వచించాలి..ఖచ్చితంగా ఇవిగో ఇవన్నీ ఉఁటేనే రాజధానా కాదు..కాదు..అంటూ త్రీ కేపిటల్ ఫార్ములా బైటికి రాగానే..జనం అంతా నెట్ లో ఏ రాష్ట్రాలలో హైకోర్టులు ఎక్కడెక్కడ ఉంటే..కేపిటల్ సిటీ ఎక్కడ ఉందో లిస్టు తీసి చదవడం ప్రారంభించారు..ఎలాగైతేనేం ఇక అమరావతి..కర్నూలు..వైజాగ్..లో రియల్ ఎస్టేట్ దందా విజృంభించబోతోందిక కాచుకోండి




Comments

  1. Mee picha raashtramlo pettubadulu pette pichollu ika evaru leru le.....
    Annee maa Hyderabad ke😁😁😁

    ReplyDelete
  2. చూడండి మీసాల పెద బొచ్చు పిచ్చయ్యగారూ...అంత సీన్ లేదు..పక్కనోడిని చూసి సెకలు పడితే..ఇరిగితే మన బొమికలే..ఆల్రెడీ ఇరిగాయ్ కూడా...అది చూస్కోండి..అక్కడా ఇక్కడా కాదు..ఎక్కడా ఏదీ ఊడబొడిచేది లేదు..మీ బాబుకి జై కొట్టుకుంటూ భ్రమల్లో బతకండి

    ReplyDelete
    Replies
    1. అతనెవరో కానీ హైదరాబాదీ మాత్రం కాదు. Hyderabadi logan aisa sochteyich nai, inu koi peela cyclewala dikhra.

      హైదరాబాదుకు ఎవరితోనూ పోటీ లేదు. వచ్చే పెట్టుబడులు వస్తాయి. ఆంధ్రులు రాజధాని ఎక్కడ పెట్టినా కొత్తగా పెరిగేది లేదు తగ్గేది కూడా లేదు.

      చెరబండరాజు "ఈ నేల నాకు పట్టెడన్నం పెట్టి పాలు తప్పింది" అన్నాడు. ఎందరికో బతుకు తెరువు చూపించిన ఈ గడ్డకు వాడెవ్వడో వచ్చి ఉద్దరించాల్సిన ఖర్మ లేదు.

      చెప్పులు కూడా లెకుండ వచ్చినోడు నేనే మహానగరాన్ని కట్టిన అని చెప్పుకుంట తిరుగుతున్నడు, వాన్నోట్ల మన్ను పడ!

      Delete
    2. >>అతనెవరో కానీ హైదరాబాదీ మాత్రం కాదు.
      100% correct. ఒక్క పిచ్చబాచ్చికి తప్ప అలా మాట్లాడిల్సిన అవసరం ఇంకెవరికీ లేదు.

      >>చెప్పులు కూడా లెకుండ వచ్చినోడు నేనే మహానగరాన్ని కట్టిన అని చెప్పుకుంట తిరుగుతున్నడు

      చంద్రబాబు కాకపోతే, మరి ఐటి ఎవరివల్ల డెవలప్ అయింది అంటారూ? మట్టి ఉన్నంత మాత్రానా అది డెవలప్ ఐతది అంటే, మరి మిగితా ప్రాంతం ఎందుకు కాలేదు?? ఎవరో ఒకరో లేక ఒక సమూహమో పూనుకోకుండా, హైదరాబాదుకు గానీ, మరే ఇతరప్రాంతానికిగానీ అంత సీన్ లేదు. హైదరాబద్ అనేది ఒకటుందనీ, దాన్లో తెలుగువాల్లు ఉంటారనీ.. ఉత్తరాదివాళ్ళు, ఇతర దేశాలు... గుర్తించని రోజులు మర్చిపోయారా??

      Delete
    3. @Chiru Dreams:

      ముందు మాట: నా వ్యాఖ్య చంద్రబాబును ఉద్దేశయించి కాదు.

      పోలీసు యాక్షన్ సమయానికి హైదరాబాదు దేశంలోనే నాలుగవ మహానగరం. దేశవిదేశాలలో హైదరాబాదు ప్రాముఖ్యత తెలువని వారు లేరంటే అతిశయోక్తి కాదు. డాఖ్నీ తీయదనం & మాట పదును జగత్విఖ్యాతం. Apna biryani aur sherwani duniya mein hamesha se mashoor tha, yeh baat nakko bhoolo yaron.

      హైదరాబాదుకు ప్రత్యేకతలు ఎన్నెన్నో: అనుకూలమయిన వాతావరణం, డెక్కన్ పీఠభూమిలో అనువయిన లొకేషన్, నైజాం కాలంలోనే అభివృద్ధి చెందిన ఇంఫ్రాస్ట్రక్చర్, రవాణా సౌకర్యాలు, విద్యావైద్య వసతులు, సర్ఫేఖాస్ భూముల పుష్కర లభ్యత, ఇంగిలీషు/హిందీ (ఉర్దూ) ప్రావీణ్యం, అన్నిటికన్నా మించి ఎవరినయినా సొంతం చేసుకోగలిగిన మిశ్రమ కాస్మోపాలిటన్ సంస్కృతి (గంగా జమునీ తెహజీబ్). స్వాతంత్య్రం తరువాత భద్రత దృష్ట్యా కీలక ప్రాధాన్యాంశంగా మారడంతో సరిహద్దులకు, సముద్రానికి & క్షిపణి రేంజుకు దూరంగా ఉండడం కూడా మరో ఎడ్వాంటేజీ.

      ఈ నేలను ఎవడో అభివృద్ధి చేయడం కాదు, పొట్టకూటి కోసం వచ్చిన పతోడినీ పొట్టలో పెట్టుకొని పెంచి పోషించిన ఘనత ఆ పుణ్యభూమిదే. నాగార్జున కేవీకే రాజు, జీవీ కృష్ణా రెడ్డి, రామోజీ రావు ఇత్యాదులు కాకపొతే ఇంకో టాటా/బిర్లాలు ఈ సదుపాయాలను వాడుకుంటారు. తిన్నింటి వాసాల లెక్కలు పెట్టే ప్రబుద్ధులు తామే ఎదో పొడిచామనుకుంటే ప(త)ప్పులో కాలేసినట్టే.

      Delete
    4. ఇంతకీ.. ఆ చెప్పులు లేకుండా ఒచ్చినోడెవ్వడు?

      Delete
  3. >>నా వ్యాఖ్య చంద్రబాబును ఉద్దేశయించి కాదు
    Clear

    >>పోలీసు యాక్షన్ సమయానికి హైదరాబాదు దేశంలోనే నాలుగవ మహానగరం
    >> నైజాం కాలంలోనే అభివృద్ధి చెందిన ఇంఫ్రాస్ట్రక్చర్

    మరి పోలీసు యాక్షన్ తర్వాత చెప్పుకోదగ్గవి ఏమున్నాయి ఇక్కడ?

    >>ఇంగిలీషు/హిందీ (ఉర్దూ) ప్రావీణ్యం

    ఇంగ్లీష్ లో అంత ప్రావీణ్యత ఉంటే, 1952 లో అడ్మినిస్ట్రేషన్ కోసం మద్రాసు, బోంబే నుంచి ఇంగ్లీష్ వచ్చినవాళ్ళని ఎందుకు అప్పాయింట్ చేసుకున్నారు మరి?

    >>పొట్టకూటి కోసం వచ్చిన పతోడినీ పొట్టలో పెట్టుకొని పెంచి పోషించిన ఘనత ఆ పుణ్యభూమిదే

    మనదగ్గర విషయముంటే, బయటోడైన ఆ "ప్రతోడూ" తో పనేంటి? తెలగాణా అక్షరాశ్యతశాతం అప్పట్లో ఎంత? ఏప్రాంతమైనా అక్కడ ఉన్న చదువుకున్నవాళ్ళపైన, లేక ఆక్కడికి వచ్చి స్థిరపడిన చదువుకున్నవాళ్ళమీద ఆధారపడి ఉంటుంది. చదువుకున్న ఆంధ్రాప్రానతం వాళ్ళు ఇక్కడకి వొచ్చేసరికి, ఇక్కడభూముల్లో తొండలు తిరిగేవని చెబుతారు. వాళ్ళు రావడం వొచ్చి, పావలా భూమికి.. 5 రూ. ఇచ్చి కొనుక్కోని డెవలప్ చేసుకోని, 20రూ.. అమ్ముకున్నారు. దాన్ని మోసమ అని ఫీలయ్యే ఇక్కడివాళ్ళు.. అస్సలు ముందు వాళ్ళ భూములు ఎందుకు అమ్ముకున్నారొ చెప్పాలి.

    నేనొచ్చినకొత్తలో, ఇక్కడివారిలో చాలామంది వడ్డీ వ్యాపారంలో స్థిరపడినవాళ్ళు ఉన్నారు. అదేంట్రా అంటే "మీ వాళ్ళొచ్చాక భూముల ధరలకి రెక్కలొచ్చాయి.. మావాళ్ళంతా అమ్ముకోని, తాగి చెడిపోయిన్వాళ్ళు చెడిపోయారు.. మిగితావాళ్ళు ఆడబ్బుల్ని వడ్డీకి తిప్పుకుంటున్నారు" అని ఇక్కడివారే చెప్పారు. బయటీవాళ్ళూ రావడంవల్ల ఇక్కడివారికి కూడా ఇప్పుడిప్పుడే చదువుమీద శ్రధ్ధ మొదలై.. పిల్లల్ని చదివించుకొని బాగుపడుతున్నారు.. ఆ పిల్లలు ఎక్కడో బెంగులూరులోనో, అమెరికాలోనో స్థిరపడితే, అక్కడివాళ్ళని మోసం చేసి సంపాదించుకున్నట్ట్ళా లేక వీళ్ళ టాలెంటు నిరూపించుకున్నట్లా?

    తెలంగాణా రాకముందు కూడా, ఇక్కడ కంపెనీల్లో మేనేజర్ స్థాయిలో పెట్టుకోవాలంటే, ఇక్కడివాళ్ళే దొరికేవాళ్ళుకారు. నమ్మశక్యంగాలేకపోతే, టీఆరెస్ వాళ్ళ కపెనీల్లోనే చూడండి. ఇంతకాలం ఇలా పాచిపోయి కంపుగొట్టే "తిన్నింటివాసాలు..." లాంటీ కథలు చెప్పుకుంటి ఏడుస్తుంటారు?

    అస్సలు మీరంతా సిగ్గుపడాల్సిన ఒక సంఘటన చెప్పనా..
    నాకు తెలిసిన ఒక వ్యక్తి(తెలంగాణా వాడే) ఇక్కడ బిజినెస్సు చేసుకుంటున్నాడు. అతనికి లెక్కలు చూసుకోడానికి ఒక అసిస్టెంటు కావాలని నన్నడిగాడు. కండీషన్ ఏంటో తెలుసా?? ఆంధ్రావాడే కావాలట. తెలంగాణావాడు వొద్దే వొద్దట. ఎందుకంటే, ఆంధ్రావాడు పని చేసుకోని బతుకుతాడు. ఇక్కడివాడైతే, 100రూ.. జేబులోపడితే.. అది తాగుడుకు ఖర్చుపెట్టి, ఆ మత్తు దిగే వరకూ ఇక డ్యూటీవైపు చూడనుగూడా చూడడు. అది అతని ఎక్స్పీరియెన్సు.

    అంతదాకా ఎందుకు.. తెలగాణా మొత్తంలో, ఏదైనా పెద్దవి కట్టాలంటే, ఎందుకు ఆంధ్రావల్ల కోసమే చూస్తారు? పనివాల్లని అక్కడినుంచే తెచ్చుకుంటారు? ప్రూఫ్స్ ఏమైనా కావాలా?

    కాబట్టి.. పని చేసుకోని డెవలప్ అయ్యేవాళ్ళని మోసగాళ్ళనీ, తాగి తిరిగేవాళ్ళని పత్తిత్తులనీ ఎనకేసుకురావడం మానేసి... మీ సొంత తెలివితేటలతో ఎలా డెవలప్ అవ్వాలో ఆలోచించుకోండి..

    కాస్త రామోజీ రావు ఎట్సెట్రా ల పక్కన మీ పేరు ఎలా తెచ్చుకోవాలో చూసుకోండి.

    ReplyDelete
    Replies
    1. Valid points, Chiru garu.
      అసలు ఆనాటికే మహానగరాలుగా వెలుగుతున్న కలకత్తా, ఢిల్లీ, బొంబాయి, మద్రాసులలో ఏ నగరాన్ని కాదని హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలుస్తుందిట?

      ఇక అక్షరాస్యత విషయానికొస్తే ఆంధ్రా నుండి విద్యాధికులు ఆ రోజుల్లో హైదరాబాద్ రాష్ట్రంలో ముఖ్యంగా టీచర్ ఉద్యోగాల్లో నియమించబడేవారు. మా బంధువుల్లో నే అలా వచ్చినవాళ్ళు ఉన్నారు .... నైజాంలో మాష్టరుగా జేరాను, నైజాం రెయిల్వేలో ఉద్యోగం వచ్చింది .... అని చెప్పుకునే వాళ్ళు.

      Delete
    2. @Chiru Dreams:

      తెలంగాణా అక్షరాస్యత అప్పుడూ ఇప్పుడూ దేశంలో సగటు కంటే కాస్త నయమే. మరీ కేరళ స్థాయి టాప్ కాకపోయినా బీహార్ స్థాయి అధోగతి ఎప్పుడూ లేదు. పారిశ్రామిక ప్రగతి కూడా ఇదే కోవ, అనగా బొంబాయికి తక్కువే కానీ యూపీ కంటే బెటర్.

      మదరాసు రాష్ట్రం నుండి గుమాస్తాలు రావడం విశాలాంధ్ర ఏర్పడ్డాకే మొదలయింది. అందుకు ప్రధాన కారణం నెపోటిజం కాగా అక్కడ ఉద్యోగాలు లేక వాళ్ళు కారుచౌకగా పని చేయడానికి సిద్ధంగా ఉండడం రెండవది.

      మీరు రాసిన మిగిలినవి anecdotal విషయాలు. డెల్టా వాళ్ళు తెలంగాణా & రాయలసీమ గురించి ఏవేవో కట్టుకథలు ఇట్లాంటివే అల్లారు, కొందరు నమ్మడం వార్వారి విజ్జ్యత.

      ఉ. అప్పట్లో తాడేపల్లి అనేటతను తెలంగాణా వారు తాగుబోతులు బోలెడంత ప్రచారం చేసి మద్యం అమ్మకాలు లెక్కలు చూపిస్తే కుక్కిన పేనయ్యాడు. తెలంగాణా వారికి వ్యవసాయం రాదనీ & మా కులపోల్లే నేర్పించారని చంద్రలత అనే ఆమె తందానా కుల సభల్లో చప్పట్లు కొట్టించుకుంది. అదే ఆవిడ పెదనాన్న రాగిడి విత్తులు పుస్తకంలో తానే తెలంగాణా రైతుల దగ్గర కిటుకులు నేర్చుకున్నానని రాసాడని రుజువు చూపిస్తే నీళ్లు నమిలింది.

      తెలంగాణా వచ్చాక కూడా పొద్దుగూకులా "రెండు తెలుగు రాష్ట్రాలు" అంటూ పోల్చేది ఆంధ్రా మీడియాయే. తెలంగాణా మీడియాలో (ఉ. వీ6లో) ఆంధ్రా వార్తలు శానా తక్కువ. అంతెందుకు బాబు "పులివెందుల పంచాయితీ" అంటూ ఊరూరా ఒర్రినట్టు జగన్ "గుడివాడ గడబిడ" అనడం లేదు: ఒకళ్ళ సొమ్ము దొబ్బి వాళ్లనే అనడం మాగాణి కామందుల తత్త్వం తప్ప మెట్ట మట్టి మనుషుల సంస్కృతి కాదు.

      Delete
    3. @విన్నకోట నరసింహా రావు:

      Thanks for catching the inadvertent error.

      సారీ నాలుగోది కాదండీ, అయిదవది. తరువాత కాలంలో ఒక మెట్టు దిగి (అమీన్ సాయానీ భాషలో ఏక్ పాయిదాన్ నీచే) ఆరవదిగా మిగిలింది.

      Delete
    4. >>మదరాసు రాష్ట్రం నుండి గుమాస్తాలు రావడం విశాలాంధ్ర ఏర్పడ్డాకే మొదలయింది. అందుకు ప్రధాన కారణం నెపోటిజం కాగా అక్కడ ఉద్యోగాలు లేక వాళ్ళు కారుచౌకగా పని చేయడానికి సిద్ధంగా ఉండడం రెండవది.
      Very wrong...

      After the Annexation of Hyderabad State into India, M. K. Vellodi was appointed the Chief Minister of the state on 26 January 1950. He was a Senior Civil servant in the Government of India. He administered the state with the help of bureaucrats from Madras state and Bombay state.

      In the first State Assembly election in India, 1952, Dr. Burgula Ramakrishna Rao was elected Chief minister of Hyderabad State. During this time there were violent agitations by some Telanganites to send back bureaucrats from Madras state, and to strictly implement 'Mulki-rules'(Local jobs for locals only), which was part of Hyderabad state law since 1919.

      మరి 1956 లో వచ్చిన విశాలాంధ్రా నుంచి గుమాస్తాలు టైం మిషన్లో తెలంగాణాకి వెళ్ళారా? ఉధ్యమాలు చెయ్యడం తప్ప ఇంకేం తెలియని తెలంగాణావాళ్ళు, విశాలాంధ్ర రాకమునుపే విశాలాంధ్రుల మీద ఉధ్యమించారా? ఐతే, ఉధ్యమాలు లేకపోతే వాళ్ళకి టైంపాస్ కాదన్నమాట.

      >>ఏవేవో కట్టుకథలు ఇట్లాంటివే అల్లారు

      నేను ప్రూవ్ చేస్తాను అన్నాతర్వాతకూడా..... కట్టుకథ అల్లారు అనిచెప్పి, మళ్ళీ డెల్టావాళ్ళు... రాయలసీమ వాళ్ళమీద అలానే అల్లారు అనడంలోనే, మీ అల్లికలు తెలుస్తున్నాయి. ఇప్పటికి కూడా భవన నిర్మాణ రంగంలో పని చెయ్యడానికి.. మీ వాళ్ళంతా.. అంధ్రావైపు మోర ఎత్తుకోని ఎందుకు చూస్తున్నారు? ఎందుకంటే, ఇక్కడోల్లని పనిలో పెట్టుకుంటే, డబ్బులు చేతిలో పడ్డప్పుడల్లా ఇక వాళ్ళకి లోకంతో, తమ యజమానితో పనిలెదు.. తాగడానికి నాలుగు డబ్బులు పడితే, ఇక వాడ్ని మించినోడు ప్రపంచంలోనే లేడు.. వాడితో పెట్టుకుంటే.. 1 స..లో పూర్తవ్వాల్సిన పని.. 6 సం..కి గానీ పూర్తికాదు.. దీన్నిగూడా నిరూపించగలిగే దమ్ము నాకుంది..

      >> తాడేపల్లి అనేటతను తెలంగాణా వారు తాగుబోతులు బోలెడంత ప్రచారం చేసి మద్యం అమ్మకాలు లెక్కలు చూపిస్తే కుక్కిన పేనయ్యాడు

      ఒకడు 100 రూ. పెట్టి చీప్ లిక్కర్ ఫుల్ తాగితే, ఇంకోడు 200రూ.. పెట్టి 100యమ్యల్ కాస్ట్లీ లిక్కర్ తాగాడు. మీరు చూపిచ్చిన లెక్కల్లో 100రూ తాగినోడీకంటే, రెండోవాడే తాగుబోతు అని తేలుతుంది మరి..

      ఏ పేపరైనా చూడండి.. ఎంత శత్రువైనా.. తాగడానికి పిలిస్తే, ముందు వెనక ఆలోచించకుండా వాడి ముడ్డెనక పరిగెత్తడం.. ప్రపంచం మొత్తంలో తెలంగాణాలో తప్ప ఇంకెక్కడైనా కనిపిస్తుందా మీకు? వాడలా తీసుకెల్లి.. వీడ్ని బాగా తాగించి, నెత్తిన బండేసి చంపడం.. ఇదికదా మర్డర్లు చెయ్యాలంటే ఈజీ ప్లాను.. మనకు చావొచ్చినా పర్లేదుగానీ, నాలుగు చుక్కలు మధ్యం పడితే చాలు మరి.. ఇదంతా నేనో, ఇంకో అంధ్రోడో అల్లేసిన కథలు కావు.. సాక్షాత్తూ ప్రతి పేపర్లో, దాదాపు ఒక్కసారైనా ప్రతి వారం చూస్తున్న వార్తలు..


      >>తెలంగాణా వచ్చాక కూడా పొద్దుగూకులా "రెండు తెలుగు రాష్ట్రాలు" అంటూ పోల్చేది ఆంధ్రా మీడియాయే

      ఛా.. నిఝమా??? ఆ మీడియాని చూసేనా, నిన్నగాక మొన్న ఆర్టీసీ వాళ్ళు ఉధ్యమాలు చేసింది? ఆంధ్రా ఆర్టీసీతో పోల్చుకోని కుళ్ళీ ఖుళ్ళీ, మళ్ళీ మళ్ళీ రికార్డుస్థాయిలో ఏడ్చిందీ? ప్రపంచ చరిత్రలో ఏ ఉధ్యమమైనా... అంత లావున చేసి, తుస్సున యాజమాన్యం కాళ్ళు పట్టుకోవడం.. ఎక్కడైనా ఉందా? మా ఆంధ్రా చరిత్రలో మాత్రం లేదప్పా.. అదికూడా మా మీడియా పుణ్యమే మరి..


      Delete
    5. తెలంగాణాలో చదువుకున్న వారు లేరని మీరంటే, కాదు నెపోటిజం అన్నాను నేను. మదరాసు గుమాస్తాలు రావడం వెల్లోడి సైనిక పాలన నుండే మొదలయిందా, ఒకే. అప్పటి గోల్కొండ పత్రిక చదివి వెరిఫై చేసుకోవచ్చు కానీ పాయింటు ఏమిటి? ఇదీ నెపోటిజం కదా.

      తెలంగాణా వాళ్ళు తాగుబోతులు, సోమరిపోతులని మీ అభిప్రాయం మీ ఇష్టం. దుబాయిలో బొంబాయిలో బొగ్గుబాయిలో ఉన్నోళ్లు కూడా అంతే కాబోలు!

      తెలంగాణా ఫోకస్ మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్ట్, రైతుబంధు, పంచాయతీలుగా తండాలు గొర్రెల పంపిణీ ఇత్యాదులపై ఉంది. ఆంధ్ర గ్రామ వాలంటీర్లు/సచివాలయం, అధికార వికేంద్రీకరణ ఇతరత్రా విషయాలపై దృష్టి సారించింది. ఇరువురూ తమతమ ప్రయారిటీ లను బట్టి వెళ్తున్నారు తప్ప ఒకళ్ళను చూసి ఇంకొకళ్ళు వాటాలు పెట్టుకోవడం లేదు. ఇదే సరయిన పంధా అని నా నమ్మకం.

      By different methods different men excel: Charles Churchil.

      ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం జగన్ వాగ్దానం. మాకూ అదే కావాలని తెలంగాణా ఆర్టీసీ ఉద్యోగులు కోరడాన్ని తెలంగాణా బహుళ ప్రజానీకం సమర్తించలేదు కనుకనే సమ్మె ఘోరంగా విఫలమయింది.

      చంద్రబాబు ఐదేళ్లు "పక్కోడి కంటే ఘనుడు" చూపించుకుందామనే తాపత్రయంలో బొక్కబోర్లా పడ్డాడు. హైదరాబాదు తలదన్నే రాజధాని గట్రా అట్టడుగు వర్గీయులకు తిండి పెట్టదని తెలిసిన జగన్ ఆ ట్రాపులో పడకుండా తమ అవసరాలు & ఆకాంక్షలకు మేరకు జనరంజక కార్యక్రమాలు సంతోషకరం. కులమీడియా & పచ్చ బాచీకి ఇంకా "పొరుగింటి పుల్లకూర" వాసనలు పోలేదు.

      కెసిఆర్ "నేను ఆంధ్రోళ్ల కంటే గొప్పోడిని" ప్రూవ్ చేయాలని ఆరాట పడితే అతనూ ఖంగు తినడం ఖాయం. పసుపు & ఎర్రజొన్న రైతులు, పోడు భూములు లాంటి సమస్యలు గాలికి వదిలేసి ఫెడరల్ ఫ్రంట్ అంటూ తిక్కవేషాలు మొదలెడితే చావు తప్పి కన్ను లొట్ట పోయింది. ముఖ్యమంత్రి పదవి కంటే యాదగిరిగుట్ట శిల్పి హోదాయే పెద్దనుకుంటే చివరికి అదే మిగుల్తుంది.

      Delete
    6. కేసీఆర్ రెండుసార్లూ... అంధ్రొల్లని తిట్టే ఓట్లు సంపాదించాడు. కాకపోతే, అప్పటికే చదువుబాటపట్టిన తెలంగాణా ప్రజల వల్ల, ఇక ఆంధ్రావాళ్ళ మీదపడి ఏడ్చి తుత్తిపడేవాల్లు తక్కువవ్వడంవల్ల.. ఓట్లు అంతకుమునుపుకంటే తగ్గిపొయ్యాయి. అందుకే ఇక అభివృద్ది గురించే మాట్లాడాల్సిన అవరం ఏర్పడింది.
      ఇక ఇక్కడ నాచబానా విషయానికొస్తే, కొడుకును ప్రమోట్ చేసుకోవడం ఇప్పుడు కాకపోతే, ఇంకెప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే, తర్వాతి ఎన్నికలకి నాచబానాకి వయస్సు మీదపడిపోతుంది. అప్పుడు లోకేశానికి ఖచ్చితంగా పార్టీపై పట్టొచ్చే అవకాశాలు పూర్తిగా తగ్గిపోయి.. ప్రియాంకా గాంధీని ముందుకుతెచ్చినట్టు, లోకేశం భార్యని ముందుకుపెట్టాల్సిన అవరం పడొచ్చు.. ఎందుకంటే, ఎంత కాం గా ఉన్నా.. బుడ్డోడ్ని... నాచబానా అస్సలు నమ్మట్లేదు. అందుకే.. పార్టీ ని ఫణంగాపెట్టిమరీ.. మాలోకాన్ని ముందుకు తెచ్చాడు. చాలామంది అనుకున్నట్టు.. పార్టీ ఓడిపోతుందని.. నాచబానా ముందే ఊహించలేదు అనుకోకండి. అవన్నీ ఖచ్చితంగా తెలుసు కాబట్టే.. చివరిప్రయత్నంగా.. వారి పెయిడ్ మీడియాతో.. వీర విహారం చేపించారు.. అప్పటి వీడియోలన్ని ఇప్పుడు చూస్తుంటే మనకు నవ్వాగదు. ఉదా: పెతిదానికీ ఓ 4 ఓటి కుండలు ఏసుకోనొచ్చే.. ఒక పిచ్చ తొత్తువి పాత వీడియోలు చూడండి.

      బాలకృష్ణ ఇచ్చిన జలక్ అన్నిటికంటే పెద్దదెబ్బకొట్టింది. దాంతో... కాస్తో, కూస్తో... ఓ 60 వరకూ ఒస్తాయనుకున్న సీట్లు 23(24) కి పడిపొయ్యాయి. ఈ ఎన్నికలు.. తెదేపా పార్టీ కోసం మాత్రం జరగలేదు.. లోకేశానికి జాకీ వెయ్యడానికే జరిగాయి. ఆబరువుకి జాకీ ఇరిగిపోయింది.

      Delete
  4. చంద్రలత గారు వ్రాసిన ఆ పుస్తకం పేరు "రేగడి విత్తులు" అండీ జై గారూ.
    వ్రా‌సింది ఆంధ్రావిడ అనే విముఖతను కాస్త పక్కన బెిట్టి ఆ పుస్తకం చదవండి. ఒక మంచి రచన.

    ReplyDelete
    Replies
    1. ఆమె ఆంధ్రానా కాదా అనవసరం. పేరు రాయడంలో టైపో పక్కన పెడితే, సదరు పుస్తకం ఆవిడ పెదనాన్న అనుభవాల సారం (of course hagiographic in nature but reasonably well written).

      ఆ పుస్తకం ఆధారంగా మా పెద్దాయనే తెలంగాణా వాళ్లకు తెలీని వ్యవసాయం నేర్పాడు అని తానా చెప్పుకోవడం, కాదు ఆయనే రైతుల దగ్గర వ్యవసాయం నేర్చుకున్నానని అందుటి నుండో చూపించడం రెండూ ఎప్పుడో ఐపోయాయి.


      Delete

Post a Comment