పదో తరగతి..పేరు కూడా రాయలేని స్థితిని ఏమనాలి.. హరీష్ రావ్‌కి పిచ్చ లేచి ఉంటది


ఫోటోలో చూడండి..చక్కగా యూనిఫామ్ దానిపై టక్ చేసుకుని టై పెట్టుకుని దర్జాగా ప్రవేట్ స్కూల్ స్టూడెంట్ లానే ఉన్నాడు ఈ కుర్రాడు..చదివేది టెన్త్ క్లాసట..కానీ..మనోడికి స్కూల్ హెడ్మాస్టర్ పేరు రాయడం రాదు..సరే అతని పేరు రాదు ...వదిలేద్దాం అనుకున్నాడు హరీష్ రావ్..

ఆ తర్వాత ఇంకో షాక్ ఇచ్చాడు ఎక్కాలు కూడా రావని తెలీడంతో..ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు..లోపల కుతకుతలాడి ఉంటాడు పైకి మాత్రం తరగతులన్నీ వరసగా పాస్ చేసుకుంటూ పోయారు..అదే సెవెన్త్ క్లాస్ లోనే డీటైన్ చేసి..వెనక్కి పంపించి ఉంటే..నేర్చుకుని ఉండేవాడు కాదా..ఇలానా టీచర్లు పాఠాలు చెప్పేది..ఇదే మన పిల్లలైతే ఇలానే వదిలేస్తామా అంటూ మెత్తగా చీవాట్లు పెట్టాడు..

ఇక్కడ అర్దం కాని విషయం ఏందంటే...సిగ్గుపడాల్సిన విషయాినికి అక్కడ అంతా ఎందుకు నవ్వులు కురిపిస్తున్నారన్నదే..ఓ పదోతరగతి అబ్బాయి పేర్లు కూడా రాయలేని స్థితిలో మన విద్యావ్యవస్థని నెట్టేసింనందుకు సిగ్గుపడొద్దా..సిగ్గు కాదు..ఇంకో పదం వాడాలి..మొహం నల్లబడిపోయి..కనీసం నాలుగు రోజులు తిండి మానేసేంత ఘోరమైన అవమానం అది..ఒకప్పుడు టెన్త్ క్లాస్ అంటే ఎంత గొప్ప..అది పాసవడం కూడా ఓ యజ్ఞమే..మరిప్పుడో తెలుగు సహా అన్ని పేపర్లలో 100కి 100 గీసిపారేస్తున్న వైనం కన్పిస్తుంది..ఇదీ ఆ ఫస్ట్ క్లాస్ చదువుల వెనుక ఉన్న వాస్తవం...
ఏదో బిట్ పేపర్లో ఆన్సర్లు గుర్తు పెట్టే విధానం కనుక ఉందంటే..ఇక ఏమీ రాకపోయినా పాస్ మార్కులు వచ్చే సిస్టమ్‌ ఎప్పుడు వచ్చిందో..ఇక జ్ఞానం ఎక్కడుంటుంది..అవగాహన ఎందుకు వస్తుంది..అన్వయం ఎలా చేస్తారు..ఇదేనా నేటి ప్రభుత్వ పాఠశాలల్లో పని తీరు..ఈ స్కూల్ తూప్రాన్ గురుకుల పాఠశాల అట..ఇదొక్కటేనా.. వెతికితే అన్ని రాష్ట్రాలలో  ఇలాంటి స్వాతిముత్యాల పల్లకిలు బయటపడతాయా..

నెలకి ఆరువేల జీతం కోసం పన్నెండుగంటలు ఉద్యోగం చేసే టీచర్లున్న ప్రవేట్ స్కూళ్లలో ఫీజులపై బాధపడతాం...కనీస ఫీజుతో
నడిచే సర్కారీ పాఠశాలలో 25వేల జీతం తీసుకునే పంతుళ్లు మాత్రం చదువులు చెప్పే తీరు ఇదేనా..కనీసం రెండు చేతులతో నోట్లోకి అన్నం పోతున్నప్పుడు మనం ఏం తింటున్నామో కాస్తైనా స్పృహకి రాదా..వస్తే ఇలానే వదిలేస్తారా 

Comments