ఎవడ్రా ఎన్ఆర్‌సిని మేం తెచ్చామంటోంది..అసలా చర్చే లేదు..! మోదీ కంగారు..బిజెపి బేజారు


అరే...మోదీని జనం గెలిపించడం మీకు ఇష్టం లేదు..అది నేను అర్ధం చేసుకోగలను
మోదీని తిట్టాలనుకుంటే తిట్టండి
నా ఫోటోలను చెప్పుతో కొట్టాలనుకుంటే కొట్టండి
ఎంత ద్వేషించాలనుకుంటే అంతగా మీ కోపం ప్రదర్శించండి
అంతే కానీ దేశసంపదని మాత్రం తగలబెట్టకండి
పేదవాళ్ల ఆటోరిక్షాలను తగలబెట్టకండి
ఈ మార్క్ డైలాగులతో ఢిల్లీలో చెలరేగిన మోడీ గారు పాపం తన నిస్సహాయతనే ఓరకంగా ఎక్స్ ప్రెస్ చేశాడనుకోవాలి..ఎందుకంటే..పౌరసత్వ బిల్లు చట్టంగా మారిన తర్వాత ఎంత హడావుడి జరిగిందీ..జరుగుతుందీ చూసాం.
.ఈ దశలో ఢిల్లీలో  1730 కాలనీలను రెగ్యులరైజ్ చేసినందుకు ఓ కృతజ్ఞత సభ బిజెపినే ఏర్పాటు చేయడం దానికి మోదీ రావడం..కామెడీగా లేదూ..దానికంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సభ పెట్టుకోవచ్చు కదా..అలాగైతే ఏం బావుంటుంది..ప్రతిదానికో ఓ సందర్భం..దానికి తగ్గ బ్యాక్ గ్రౌండ్ సెటప్ చేయనిదే మోదీ మోడీ ఎలా అవుతారు..అందుకే..పదకొండు రోజుల క్రితం పార్లమెంట్ లో పాసైన చట్టానికి ఆదివారం సభ ఏర్పాటు చేసుకున్నారు..
గంటన్నరపాటు సాగిన సభలో మోదీ గారు ఆక్రోశం..ఆవేశం ఆగ్రహం స్పష్టంగా కన్పించాయ్..ఇంతగా దేశంలో తన చట్టానికి వ్యతిరేకత రావడంతో ఆయనలోని అన్ని ఎమోషన్స్ బైటికి వచ్చాయ్..అయితే..అందులో ఆక్రోశం ఎందుకంటే..ఇలాంటి సమయంలో ఎన్ఆర్సీని ముందుకు తీసుకెళ్లే పరి్స్థితి లేదు..

అసోంలో జరిగిన తతంగం జరిగిన తర్వాతైనా బిజెపి ఎక్కడా త గ్గలేదు..సిటిజెన్షిప్ అమండ్మెంట్ చట్టమైంది..ఇక దేశమంతా ఎన్ఆర్సీనే అంటూ ప్రతి మంత్రీ చెలరేగిపోయారు..హైదరాబాద్ లో రాజాసింగ్ మొదలు ...ఢిల్లీలో రాజ్ నాధ్ సింగ్ వరకూ అదే మాట..జార్ఖండ్ రాష్ట్రం ప్రచారంలో రాజ్ నాధ్ అరే..భాయ్ మీకు తెలుసా..ఎన్ఆర్స్ీ..ఎన్ఆర్సీ అంటే ఏందో మీకు తెలుసా...చూడండి ఎవరు ఎక్కడ్నుంచి వచ్చారో మనకి తెలియాలా వద్దా అంటూ భీషణ ప్రతిజ్ఞ చేసారు
అటు అమిత్ షా కూడా అంతే..కానీ రెండు రోజుల నుంచి బండి టర్న్ అవడం ప్రారంభించింది..ఇుప్పుడు పూర్తిగా టర్నైపోయింది..అరే...ఎన్ఆర్సీ అంట..దాని గురించి ఎంత గాలి పోగుచేస్తున్నారు ఈ కాంగ్రెస్సోల్లు..అది వాళ్లే తెచ్చారు మేం తేలేదు..పార్లమెంట్ కీ రాలేదు..అసలు నిబంధనలే తయారు చేయలేదు..ఓ వైపు ఢిల్లీలో ఇంతమందికి భూమి.ఇళ్లుపై హక్కు కల్పిస్తూ..మరోవైపు మిమ్మల్ని బైటికి పొమ్మనే చట్టం చేస్తామా అంటూ ఫుల్ టర్నై ఫైరైపోయారు మన ప్రధానమంత్రి గారు.. దీనికి ముందే బిజెపి ట్విట్టర్ నుంచి ఎన్ఆర్సీని డిలీట్ చేసింది..ఇప్పుడు ప్రధానమంత్రి ...మరి అమితాశగారు, మోదీ గారిలో ఎవరిని మేం ఫాలో అవ్వాలంటూ దీదీ అప్పుడే సైటైర్లు ప్రారంభించేసింది..

ఈ టర్నింగ్ అంతా ఎందుకో క్లియర్ గా అర్ధమవుతోంది కదా..అసలే రగులుతున్న నిప్పులో ఇప్పుడు పెట్రోల్ ఎందుకు పోయాల్రా బాబూ అనే కదా.. సో కొన్నాళ్లు ఎన్ఆరసీ లేనట్లే 

Comments