హేమంత్ సోరెన్...మోడీకి షాక్ ఇచ్చెన్


హేమంత్ సోరెన్.. జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాల తర్వాత మారుమోగుతోన్న పేరు... జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని అన్నీ తానై నడిపించే ఈ యంగ్ లీడరే ఆ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు పతనమైన పార్టీని తిరిగి వైభవం దిశగా నడిపించిన తీరు ఆషామాషీగా జరిగింది కాదు.. బలమైన బీజేపీని ఢీకొట్టిమరీ సాధించిన ఈ విజయం.. గాలివాటంగా వచ్చింది అసలే కాదు
 జార్ఖండ్ ముక్తి మోర్చా..జార్ఖండ్ రాష్ట్రంతో పాటే పెనవేసుకుపోయిన పార్టీ..ఎంత అనూహ్యంగా అధికారం చేపట్టిందో..అంతే వేగంగా అవినీతి ఆరోపణలతో నేలకంటుకుపోయింది కూడా..ఐతే తాజా అసెంబ్లీ ఫలితాలతో తిరిగి రాష్ట్రంలో ఎదురులేని ప్రాంతీయపార్టీగా తన సత్తా చాటింది. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడి 19ఏళ్లు అవుతుండగా..నాలుగుసార్లు జార్ఖండ్ ముక్తి మోర్చా తరపున సోరెన్ కుటుంబీకులు ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. పార్టీని స్థాపించిన శిబుసోరెన్ పూర్తిగా  స్థానిక భావజాలానికి ప్రతీకగా నిలవడంతోనే ఈ పార్టీ పునాదులు ఇంతగా రాష్ట్రంలో వేళ్లూనుకున్నాయ్. రాష్ట్రం ఏర్పడిన తర్వాత శిబుసోరెన్ మూడుసార్లు సిఎంగా చేయగా..ఇప్పుడు హేమంత్ సోరెన్ రెండోసారి ముఖ్యమంత్రి కానున్నారు.

 18వ ఏటనే సంతాల్ నవయుగ్ సంఘ్ అనే సంస్థని స్థాపించిన  శిబుసోరెన్ ఆ తర్వాత బెంగాల్ మార్కిస్ట్ లీడర్ ఏకే రాయ్‌తో కలిసి జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రారంభించారు. స్థానిక గిరిజనుల సమస్యలు..హక్కుల కోసమే అప్పట్లో శిబుసోరెన్..ఇప్పుడాయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి శిబుసోరెన్ పోరాడారు. ముఖ్యమంత్రులుగా కాగలిగారు. స్థానికేతరులను రాష్ట్రం నుంచి  వెళ్లగొట్టే ఉద్యమానికి నాంది పలికిన శిబుసోరెన్..1980 నుంచి ఎంపిగా ఎన్నికవుతూ వచ్చారు. 2004లో మన్మోహన్ కేబినెట్‌లో బొగ్గు గనుల శాఖామంత్రిగా పని చేశారాయన.  జార్ఖండ్ ఏర్పడిన తర్వాత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కూడా పని చేసారు. మార్చి 2, 2005 నుంచి పది రోజుల పాటు..2008 నుంచి 2009 వరకూ
2009 నుంచి 2010 వరకూ మూడుసార్లు సిఎంగా పనిచేసినా పూర్తి కాలం పదవిలో కొనసాగలేదు..ఐతే కేంద్రమంత్రిగా పని చేసిన సమయంలోనే 30ఏళ్లనాటి హత్య కేసు వెంటాడటంతో పదవినుంచి వైదొలగాల్సి వచ్చింది. 1975 జనవరి 23న గిరిజనులకు..ముస్లింలకు మధ్య జరిగిన గొడవలో పదిమంది చనిపోయారు. ఈ పదిమంది హత్యకి కారకులుగా 69మందిపై కేసు నమోదు అవగా..వారిలో ఒకరిగా శిబుసోరెన్ పేరు కూడా చేర్చారు.ఈ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో మంత్రి పదవి కోల్పోయారాయన. ఐతే బెయిల్ దొరకగానే తిరిగి కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. దీనికి ప్రతిగా జార్ఖండ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిచ్చేలా డీల్ సెట్ అయింది.కానీ అటు బిజెపి..ఇటు కాంగ్రెస్ మధ్య జేఎంఎం అధికారం కోసం పాకులాడిన వైనం రాష్ట్రవాసుల దృష్టిలో చులకన అయింది. అలానే 2006 నవంబర్ 28న తన పర్సనల్ సెక్రటరీ శశినాధ్ ఝా హత్య కేసులో సిబిఐ ఆయన్ని దోషిగా తేల్చడంతో యావజ్జీవిత శిక్ష పడింది..పివి నరసింహారావ్ ప్రధానిగా ఉన్న సమయంలో ప్రభుత్వం పడిపోకుండా ఉండేందుకు జేఎంఎం ఎంపీలతో డీల్ కుదిరింది..ఆ డీల్ తాలుకూ సీక్రెట్స్ తెలుసుకున్నందునే శశినాధ్ ఝాని మర్డర్ చేశారని శిబుసోరెన్‌పై సిబిఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది. దీంతో దుంకా నియోజకవర్గం నుంచే ఎంపిగా అనేకసార్లు గెలిచిన శిబుసోరెన్..చివరికి అక్కడి సెంట్రల్ జైల్లోనే శిక్ష అనుభవించాల్సి వచ్చింది..దీంతో పార్టీ పరువు పూర్తిగా బజారున పడిపోయింది..ఐతే 2007 ఆగస్ట్ 25న కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అప్పట్నుంచి బైటనే ఉఁటున్నారాయన.ఇప్పుడు ఆయన కుమారుడు సారధ్యంలోపార్టీ ఘనవిజయం సాధించడంతో..ఆ విజయాన్ని  జార్ఖండ్ ముక్తి మోర్చా పూర్తిగా ఆస్వాదిస్తోంది

 జార్ఖండ్ ముక్తిమోర్చా ఘనవిజయం సాధించడంలో హేమంత్ సోరెన్ వన్ మేన్ ఆర్మీగా వ్యవహరించారనడంలో సందేహం లేదు..ఐదేళ్లూ ప్రతిపక్ష పాత్రని పూర్తి సమర్ధవంతంగా
నిర్వహించడంతో పాటు..స్థానిక ఆదివాసీల తరపున నాయకుడిగా ఎదగడంలో ఆయన అహర్నిశలూ శ్రమించారు..అందుకే ఆ రాష్ట్ర ఓటర్లు ఆయనకి అంతటి ఘనవిజయం కట్టబెట్టారు


 ఐతే అధికారానికి దూరమైనా కూడా పార్టీని నడిపించడంలో శిబుసోరెన్ కుమారులు సక్సెస్ కాగలిగారు. శిబుసోరెన్‌కి దుర్గసోరెన్ పెద్ద కుమారుడు కాగా..ఆయన కూడా ఎమ్మెల్యేగా పని చేసారు..ఆయనే వారసుడవుతారనుకుంటే..2009లో అకస్మాత్తుగా నిద్రలోనే మరణించారు..దీంతో హేమంత్ సోరెన్ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది..ఐతే తండ్రి గైడెన్స్‌లో హేమంత్ సోరెన్ త్వరగానే పాలిటిక్స్‌ని వంటబట్టించుకున్నారని చెప్పాలి. రావడమే 2009లో అర్జున్ ముండా ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా పని చేసిన హేమంత్ ఆ తర్వాత రాష్ట్రపతిపాలనతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరు నెలలపాటు సిఎంగా కొనసాగారు. 2013 జులై 13 నుంచి 2014 డిసెంబర్ 28 దాకా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.  హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎం పీఠాన్ని ఎక్కనుండటం ఇది రెండోసారి. 2013లో రాష్ట్రపతి పాలన అనంతరం తొలిసారి సీఎం అయిన హేమంత్.. కేవలం ఆరు నెలలు మాత్రమే పదవిలో కొనసాగారు. .ఐతే ఆ తర్వాత కాంగ్రెస్ కూటమిలో చేరిపోయిన హేమంత్ సోరెన్ పూర్తిగా స్థానికుల సమస్యలపై దృష్టి పెట్టారు.  జార్ఖండ్‌లో మైనింగ్ రూపేణా భారీగా ఆదాయం వస్తుంటుంది. దీంతో ప్రభుత్వం కానీ..ప్రవేట్ వ్యక్తులు కానీ ఇక్కడి భూములపై కన్నేస్తుంటారు.. పూర్తిగా ఆదివాసీల డామినేషన్ ఎక్కువైన ఈ రాష్ట్రంలో  భూముల అమ్మకాలు, కొనుగోళ్లపై జార్ఖండ్  కఠినమైన చట్టాలున్నాయి. ఆదివాసీల హక్కుల రక్షణ కోసం చట్టాలు ఏర్పాటు చేసి ఉన్నాయ్.  అందులో చోటా నాగ్ పూర్ టెనెన్సీ యాక్ట్  , సంతాల్ పరగణా  టెనెన్సీ యాక్ట్ ముఖ్యమైనవి..ఐతే  2016లో రఘుబర్ దాస్ ప్రభుత్వం.. ఈ రెండు చట్టాల్లో సవరణలు తేవాలని ప్రయత్నించింది. ఆ సవరణలతో ప్రభుత్వ, ప్రైవేటు పనుల కోసం గిరిజనుల భూముల్ని ఇతరులు తీసుకునే వీలు ఏర్పడింది.  దీనిపై స్థానికుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. దీన్నే జార్ఖండ్ ముక్తి మోర్చా బాగా క్యాష్ చేసుకుంది..ఈ సవరణలకు వ్యతిరేకంగా హేమంత్ సోరెన్ పోరాడారు. అలా స్థానికులకు ప్రతినిధిగా హేమంత్ సోరెన్ పిలుపు ఇస్తే లక్షలాది మంది రోడ్డెక్కడం సర్వసాధారణంగా మారిపోయింది..అలా రాష్ట్రంలో  పార్టీ పట్టుని తిరిగి సాధించడంలో హేమంత్ సోరెన్ సక్సెస్ అయ్యారు. దానికి ప్రతిఫలంగా ఇప్పుడు రెండోసారి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోనున్నారు.
ఇంతగా నమ్మకం సాధించింది కాబట్టే.. తాజా ఎన్నికలలో జార్ఖండ్ ముక్తి మోర్చాకి పార్టీ పుట్టిన తర్వాత ఎప్పుడూ లేని స్థాయిలో ఓటర్లు సీట్లు కట్టబెట్టారు..జాతీయ పార్టీలను కాదని 30మందికిపైగా ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపారు. దీంతో  జార్ఖండ్‌లో సోరెన్ల హయాం మరోసారి ప్రారంభం కాబోతోంది..
గెలిపించారు.

Comments