బాలకృష్ణ, రజనీకాంత్‌తో పోల్చితే..మహేష్,ప్రభాస్ ప్లేస్ ఎక్కడుండాలి..?


సూటిగా విషయంలోకి వచ్చేద్దాం...బాలకృష్ణకి 60..రజనీకాంత్‌కి 70 దగ్గరపడ్డాయ్.. అయినా ఇద్దరూ తమ రంగాల్లో దూసుకుపోతున్నారు..ఫలితం ఏమిటన్నది పక్కనబెడితే..పని చేసుకుంటూ పోవడంలో ఇద్దరూ నంబర్ వన్..మిగిలినవాళ్లలా  బాలయ్య టైమ్ అయిపోయింది..రజనీకాంత్ ని చూసి నేర్చుకోవాలి..ఇంకా ఇంతేనా..రజనీ పస తగ్గింది క్రేజ్ తప్పితే కలెక్షన్స్  లేవులాంటి చప్ప డైలాగ్స్ వేయవద్దు..తీసిన ప్రతి సినిమా హిట్టవ్వాలని రాసి లేదు..అసలు ఆ మాటకి వస్తే ఇండస్ట్రీలో ఇప్పటిదాకా 25శాతానికి మించి సినిమాలు సక్సెస్ అయిన సంవత్సరాలే తక్కువ..అలాంటిది హీరోల సినిమాలు ఢమాల్మనడం కాదు..ఆ సినిమాలతో ఎంతమంది బతుకుతున్నారన్నదే ముఖ్యం..

మరి తెలుగు హీరోలు పవన్ కల్యాణ్ తీసేసి పక్కనబెడదాం..చిరంజీవిని కూడా అంతే..అసలా మాటకి వస్తే..మెగా కాంపౌండ్ ని..పక్కనబెడదాం..మూడేళ్లకో సినిమా తీసే డైనమిక్ హీరోలు ఈ ఇండస్ట్రీకి అవసరం లేదు..డాషింగ్ గా నిర్ణయాలు తీసుకునే సూపర్ స్టార్ కృష్ణ లాంటి వాళ్లే కావాలి.. అలా చేస్తున్నవాళ్లలో బాలయ్య, రజనీకాంతే సూపర్ స్టార్స్...ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుంటూ పోతున్న వీళ్ల వయస్సుకి రిటైర్ అయిపోయిన హీరోలు బోలెడుమంది ఉన్నారు..మెగాస్టార్ అన్న బిరుదే కానీ...2009 తర్వాత ఆయన తీస్తుందెప్పుడు...రెండంటే రెండు..అంటే ఇంకో సినిమా రావడానికి కనీసం ఇంకో ఏడాది పడుతుంది..పదకొండేళ్లకి రెండు సినిమాలు..ఇక ఈయన తమ్ముడు పవన్ కల్యాణ్ కూడా అంతే..ఏదో కళాఖండాలు..అద్భుత చిత్రరాజాలు తీసేవాళ్లలాగా కథలు వింటున్నాం...అంటూ కాకరకాయ కబుర్లు చెప్పడం కాదు..
ప్రభాస్ కూడా ఇలానే మూడేళ్లు ఆగి తీసిన సాహో ఏమైంది..ఆగి ఆగి తీసే మహేష్ బాబు రీసెంట్ గా కాస్త వేగం పెంచాడే కానీ..గాడిలో పడలేదు..ఈ విషయంలో వాళ్ల నాన్నని చూసి ఏం నేర్చుకున్నాడో అతనికే తెలియాలి..
అప్పట్లో సూపర్ స్టార్  చెప్పిన డైలాగ్ ని అర్ధం చేసుకుంటే ఈ సమస్యే ఉండదు
వరసగా సినిమాలు చేస్తూ పోతే..క్వాలిటీ దెబ్బతింటుంది కదా..మంచి కథల కోసం కాస్త సమయం తీసుకోవచ్చుగా అంటే ఆయన సమాధానం వినండి..
" రెండేళ్లు మూడేళ్లు ఆగి ఓ సినిమా కథ బావుండి తీస్తే..అది కూడా ఫ్లాప్ అయితే ..అప్పుడెవరు సమాధానం చెప్తారు..ఆ టైమ్ అంతా వేస్ట్ అయినట్లేగా..ఐనా కథ మనకే కాదు..ప్రేక్షకులకు నచ్చాలి..అయినా ఒక్క సినిమా తీస్తున్నామంటే దానిపై 400మంది బతుకుతున్నట్లు లెక్క..వాళ్లందరికీ పని కల్పిస్తున్నట్లు..బడ్జెట్ మించకుండా..వీలైనంత త్వరగా పక్కా ప్లానింగ్ తో సినిమా తక్కువ రోజుల్లో తీసి రిలీజ్ చేస్తే...తీసే ఆరు సిినిమాలలో రెండు సినిమాలు ఆడినా చాలు...కనీసం ఈ ఆరు సినిమాలతో 2వేలమందికి పని దొరుకుతుంది..గ్యాప్ తీసుకోవడం వల్లన ఇంతమంది ఉపాది పోతుందే తప్ప...వేరే లాభం ఉండదు..బడ్జెట్ మించకుండా..ప్లానింగ్ తో తీసిన సినిమాలు పెయిల్ అయినా..నష్టం చాలా తక్కువగానే ఉంటుంది.."

కరెక్ట్‌గా ఈ సూత్రం నమ్మారు కాబట్టే రజనీకాంత్ కబాలి, కాలా, రోబో2, పేట, దర్బార్‌తో వచ్చారు.దర్బార్ రిలీజ్ కాకముందే మరో సినిమా కూడా సెట్స్ పై ఉంది..అంటే మూడేళ్లలో ఆరు సినిమాలు..తీసేసారు..మరిదే మూడేళ్లలో మన సూపర్ స్టార్లు..ప్రభాస్, మహేష్..బ్రహ్మోత్సవం, మహర్షి, భరత్ అను నేను..మూడు..ప్రభాస్ ఒక్క సినిమా..సిగ్గుండొద్దా..తెలుగు తెర వేల్పులు అని చెప్పడానికి..
అందుకే కదా..బాలయ్యకి ..రజనీకి ఇప్పటికీ వీర ఫ్యాన్స్ ఉండటానికి కారణం అదేగా..

ఓ పదేళ్ల క్రితం మాట..టివిలలో ఓ సినిమా కార్యక్రమాలు రూపొందించే పెద్దాయన నాతో మాట్లాడుతూ..ధనుష్ ఇంటర్వ్యూ చూశాను రాత్రి..ఖచ్చితంగా వచ్చే పదేళ్లలో పెద్ద సూపర్ స్టార్ అవుతాడండి..ఎంత చక్కగా మాట్లాడాడు అని అన్నాడు..కాలచక్రం గిర్రున తిరిగింది..ఈ పదేళ్లలో ధనుష్  స్టార్ డమ్ ఎంత పెరిగిందో తెలీదు కానీ...రజనీకాంత్ అలానే ఉన్నాడు..ఆయన స్టార్ డమ్ ఆకాశానికి ఇంకా ఇంకా పెరుగుతూనేఉంది..నాకనిపించింది ఏంటంటే..రజనీకాంత్ ఉండగా..ఇంకో సూపర్ స్టార్ తమిళం వరకూ రాడేమో అని..అతిశయోక్తి అన్పించినా...వాస్తవం అలానే ఉంది..



ఫైనల్ టచ్ గా చూద్దాం..పైన ఫోటోలో చూడండి...రజనీకాంత్..మోహన్ లాల్..మోహన్ లాల్ కూడా అంతే 60..ఈయనా వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు..మధ్యలో మలయాళంలో బోలెడంతమంది యంగ్ యాక్టర్లు వచ్చారు క్యారెక్టర్ యాక్టర్లుగా కూడా మారిపోయారు..దీన్నేమంటారు..

Comments

  1. ఎవరికి నచ్చిన వేగంతో వారు సినిమాలలో నటిస్తున్నారు. మీకు ఏమి ఇబ్బంది వచ్చింది. ఈ వ్యాసం వ్రాసిన తీరు బాగాలేదు.

    అసలు తాతయ్య వయసులో ఉన్న రజనీ కాంత్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వయసుకు తగ్గ వేషాలు వేయకుండా ఇంకా మనవరాలి వయసు హీరోయిన్లతో డాన్సులు చేయడ మేమిటి.

    ఈ తాత హీరొలు హుందాగా తప్పుకుంటే మంచింది. లేదా తాతల వేషాలు వేసుకోవచ్చు.

    మంచి క్వాలిటీతొ సినిమా తీయాలంటే కనీసం ఏడాది సమయం అవుతుంది. రెండు నెలల్లో చుట్టేసిన సినిమాలు (ఉదా. లింగా, రూలర్, అగ్నాత వాసి..) నాసి రకంగా ఉన్నాయో చూశాము కదా.

    ReplyDelete
  2. https://www.youtube.com/watch?v=01FnEEG0JoU

    ReplyDelete
  3. పైన లింక్ పెట్టి దాని వ్యూస్ పెంచాలనా..లేక ఏంటి..ఇక్కడ వారి ప్రతిభ గురించో...సినిమా హిట్టో ఫ్లాపో గురించి ఎవడూ ఏడవలేదు..టాప్ స్టార్లంటే ఇలా ఉండాలి..ఏ రంగంలో టాపర్లు..ఆ రంగంపై ఆధారపడేవాళ్లకి ఉపాధి కల్పించాలి..ఇదే చెప్పాం కానీ..వాళ్లే వేగంతో చేస్తే మీకెందుకు..వాళ్ల వయసేంటి..అనే చొప్పదంటు ప్రశ్నలు వేయవద్దు..ఇండస్ట్రీని బతికించేవాడే..హీరో కానీ..మూడేళ్లకో..పదేళ్లకో సినిమాలు తీసేవాళ్లు కాదని చెప్పడం ఉద్దేశం..ఇదెవడికి నచ్చినా నచ్చకపోయినా ఇండస్ట్రీవాళ్లని అడిగితే చెప్తారు..వాళ్ల ఒపీనియన్ ఏంటో

    ReplyDelete

Post a Comment