టిడిపిలో ఇంకా ఎవరెవరు అసమర్ధులే ఆ ఛానల్ కే తెలుసు


నిజానికి చంద్రబాబు గారు కనుక తిరిగి సిఎం ..అంటే 2019లో కూడా గెలిస్తే...ఆయనదే అంతా ప్రభ..ఆయన మ్యాజిక్ తోనే గెలిచారు అని బాకా ఊదేందుకు రెడీగా ఉన్న వందిమాగధులకు..ఆ ఓటమి ఇంకా జీర్ణం కాలేదు..అందుకే ఇప్పుడు తమ రాతల్లో ఇంకా అదే ధోరణ ికన్పిస్తోంది..ఎవరైనా పార్టీ మారుతున్నారంటే చాలు..ఎహ...ఆయనకంత సీన్ లేదు..ఆయన గెలిచింది బాబుగారి దయవల్లనే..లేదంటే ఆయన ఎక్కడ గెలవాలన్నట్లుగా రాసుకుని స్వయంతృప్తి పడుతూ..ఎదుటివారిని కూడా తృప్తి పడమంటున్నారు..

మద్దాలి..ఉరఫ్ మద్దాళి గిరి గుంటూరులోని కోమటి కులానికి చెందినవారే..ఇందులో ఏం దాచిపెట్టేది లేదు..వెల్లంపల్లి శ్రీనివాస్ కి పదవి దక్కింది కూడా ఈ ఈక్వేషన్ తోనే..ఐతే అంత మాత్రాన తన వర్గానికే చెందిన వెల్లంపల్లితో వెళ్లి సిఎంని కలిసి పార్టీ మారేందుకు అంటూ..ఆజో...రాసుకోవడంలోని ఔచిత్యం ఏంటి..సరే అది వదిలేద్దాం..పైగా పార్టీ మారినట్లు ప్రకటిస్తే..పదవి పోతుందట..ఎలా పోతుంది..స్పీకర్ కి కంప్లైంట్ చేయాలి..ఆయన చర్య తీసుకోవాలి..అంటే స్పీకర్ చర్య తీసుకోవడానికి రెడీగా ఉన్నట్లే కదా..ఇక్కడే కదా..జగన్ తాను అన్నమాటపైనే నిలబడి ఉన్నట్లు అజో...చెప్పకుండానే చెప్తోంది..

ఇక పైన చూడండి..వాస్తవానికి ఆయన 2014లోనే ఓడిపోయారట..అంటే ఓడిపోతే ఇక సీన్ లేనట్లేనా..మరి లోకేష్ బాబుగారి సీన్ ఎంత..సరే అది వదిలేద్దాం..అంతగా సమర్ధత లేదని తెలిసినా..గిరినే ఎంపిక చేసారట..మరి గెలిచాడు కాబట్టి..సమర్ధుడైపోయాడా...పార్టీ తరపు డబ్బులే ఖర్చు పెట్టాడట..ఇదీ మరీ విడ్డూరం..ఓవైపు పార్టీ అసలు ఫండింగ్ ఇవ్వలేదు మేం ధనబలాన్ని నమ్ముకోలేదంటూనే పార్టీ డబ్బులే పెట్టాడనడం ఏంటి..అంటే సొంతడబ్బులు ఖర్చుపెట్టకుండా..ఏ సమర్ధతా లేకుండా కూడా వైెఎస్సార్సీపీ వేవ్ ని తట్టుకుని నిలిచిన కాండిడేట్ లోకేశ్ కంటే ఎలా తీసిపోయాడబ్బా..!

Comments