స్టేట్ లెవల్ లీడరే కదా ! బాలయ్య కూడా పార్టీ మారబోతున్నట్లే అని సదరు పత్రిక అభిప్రాయమా..



ఉన్నదే 23మంది ఎమ్మెల్యేలు..వారిలో ఇద్దరు ముగ్గురు అసలు పార్టీ వైపు చూడటం లేదని చంద్రబాబుగారు ఎప్పటికప్పుడు వాపోతుంటారు..ఆగ్రహిస్తుంటారు..మీ లెక్కలు తెలుసని ఆంధ్రజ్యోతి గొంతు ద్వారా వార్నింగులిస్తుంటారు..అలాంటిది..మరి పార్టీలో స్టేట్ లెవల్ లీడర్లంటే ఎవరు...నిస్సందేహంగా..చంద్రబాబుగారు..లోకేశ్ గారు..మరి..ఆ తర్వాత...డౌటెందుకు అఖండ ప్రజాదరణ కలిగిన బాలకృష్ణ...కాస్తో..కూస్తో..13 జిల్లాల గురించి అవగాహన ఉన్న లీడర్లలో పయ్యావుల కేేశవ్ ఒకరు..ఇంకా చెప్పాలంటే గత ప్రభుత్వంలో మంత్రిపదవి వెలగబెట్టిన మంత్రి నారాయణ..గంటా శ్రీనివాసరావ్, దేవినేని ఉమా...మరి వీళ్లలో ఎంతమంది టిడిపి కార్యక్రమాల్లో కన్పిస్తున్నారు..?

మరి గంటా..పార్టీ ప్రోగ్రామ్స్ కి రాకపోతే..జంప్ అవుతున్నట్లేనని..మద్దాలి గిరి కూడా దూరంగా ఉండటం కూడా అందుకేనంటూ ముక్తాయింపు ఇచ్చిన అ.జో..రాకీకి..మరి బాలకృష్ణ కూడా టిడిపి ఏ ప్రోగ్రామ్ లోనూ కన్పించడు..అసలు అసెంబ్లీలో అయితే ఒక్క మాట కూడా మాట్లాడినట్లు లేదు..ఇంత ఫాలోయింగ్ ఉండి..
పార్టీ అధినేత బావమరిది..వియ్యంకుడు, జస్ట్ మిస్ సిఎం మామ అయి ఉండి కూడా..బాలయ్య ఇలా చేయడం తగునా

మరి బాలయ్య కూడా పార్టీ మారుతున్నట్లేనా..లేదూ మా బాలయ్య కూడా పార్టీకేదో మేలు చేసేందుకు బరిలో దిగుతాడు తప్ప..పార్టీలో సీరియస్ కాండిడేట్ కాదని చెప్పాలా...ఏదో క్లారిటీ ఇవ్వండి అజో ప్రభూ..!

Comments