ఎక్కడ చంపారో..అక్కడే మటాష్

అమాయకమైన ఓ ఆడపిల్లని నమ్మించి గొంతు కోసినందుకు సరైన శిక్షే పడింది..అది కూడా ఎక్కడైతే తాము ఆ  ఆడపిల్ల నిండు ప్రాణం తీసారో..అక్కడే పదిరోజుల్లోపే ఖతమయ్యారు..ఎక్కడైతే తమ మారణకాండ సాగించారో..అక్కడే  కుక్క చావు చచ్చారు..ఆడపిల్ల ఉసురు తీస్తే ..తగిలితే ఏం జరుగుతుందో అదే జరిగింది..

సృష్టిలో చర్యకి ప్రతిచర్య అదే స్థాయిలో వ్యతిరేక దిశలో ఉంటుందనే వాస్తవం ఖచ్చితంగా కళ్ల ముందు కన్పించడంతో ఇంకా ఆ అసలు నిజం సింక్ అవడం లేదు..యువతిని చంపిన సంఘటనే ఇంకా జీర్ణించుకోలేకపోతుంటే..ఇప్పుడు ఈ ఎన్ కౌంటర్ మరీ అనూహ్యం...చంపితే బావుండు అనుకున్నారే తప్ప ఇలా నిజమవుతుందనుకోలేదు

కానీ ఈ నలుగురిని నిరాయుధంగా చేసి కాల్చడం..ఏ మూలో కాస్త సానుభూతి కలిగిస్తుందన్న మరో సెకన్ లోనే ఓ అమ్మాయిని చేతులు కాళ్లూ కట్టి దాడి చేసి బలి చేసిన వైనం గుర్తుకు వస్తుంటే...వళ్లు రగిలిపోక మానదు..అందుకే ఇక్కడ మానవహక్కుల ప్రస్తావన 80శాతంమందికి రావడం లేదు..నిజంగా ఆత్మలు..పరమాత్మలు ఉంటే..ఈపాటికి సదరు యువతి ఆత్మ ఈ నలుగురి చావుతో కాస్తైనా సంతోషిస్తుందనడంలో సందేహం లేదు..కానీ నూరేళ్ల బతుకు బుగ్గిపాలు అవడం మాత్రం తట్టుకోగలమా..మన ఇఁట్లో పిల్లకే ఇలా జరిగితే...గుండె పగలదా..అందుకే..అందరి వేదనే వీళ్లని వెంటాడి గొయ్యిలో పడుకోబెట్టింది

Comments