జార్ఖండ్..ఎంత చిన్నది..ఐనా పెద్ద కర్రతో కొట్టాల్సిందేనా


81 అసెంబ్లీ స్థానాలు..ఐతేనేం రాష్ట్రం రాష్ట్రమే..అందులోనూ మన కేజీఎఫ్ సినిమాలాగా..బోలెడన్ని గనులున్న ప్రాంతమాయె..పూర్తిగా ఆదివాసీల అడ్డా అయిన జార్ఖండ్‌లో పదిహేనుసార్లు ముఖ్యమంత్రులు మారారాంటే..దానికి కారణం..ఈ తక్కువ సీట్ల అస్థిరతే కారణం..పుట్టి 19ఏళ్లు కాకముందే ఇన్నిసార్లు ఫిరాయింపులతో ప్రభుత్వాలు మారింది బహుశా ఇక్కడే అనుకుంటా..

అలాంటి జార్ఖండ్‌లో ఇప్పుడు బిజెపికి ఝలక్ రెడీగా ఉంది..కాంగ్రెస్ జార్ఖండ్ ముక్తి మోర్చా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమైపోయింది..ఐనా బిజెపి ఏదో మాయ చేద్దామనే తపనే..గోవాలో లాగా..ఎవరో ఒకరిద్దరిని లాగేసుకుంటే..ఏకంగా ప్రభుత్వమే తమది చేయవచ్చనుకుంటోంది కాబోలు..ఆల్ స్టూడెండ్స్ జార్ఘండ్ యూనియన్ ని..జార్ఖండ్ వికాస్ మోర్చాని దువ్వుతోంది..రండి కలిసి ఉందామంటోంది..వాస్తవానికి జార్ఖండ్ వికాస్ మోర్చా..2014లో బిజెపితో కలిసే ఉంది..కానీ సీట్ల దగ్గర తేడా వచ్చి విడిగా అన్ని సీట్లకీ పోటీ చేసేసింది..బిజెపి 79 సీట్లకే పోటీ పెడితే..జేవిఎం మాత్రం 81 సీట్లలో పెట్టింది..గెలిచింది సింగిల్ డిజట్ కే అయినా..ఈ మిత్రబేధమే బిజెపికి షాక్ ఇచ్చినట్లుంది..
అటు కాంగ్రెస్ మాత్రం విల్లంబులు వీరుడు ముసలి అవినీతి సింహం శిబుశోరెన్ కొడుకు హేమంత్ సోరెన్ అండతో బాగానే సీట్లు కొట్టకొచ్చింది..42 సీట్లు గెలవాల్సిన స్థితిలో మెజారిటీ దిశగా స్థానాలు పదిలం చేసుకున్నట్లు సీన్ కన్పిస్తుంది..ఐనా బిజెపి ఎక్కడ గేలమేస్తుందో అన్నట్లుగా అలర్ట్ గా ఉంది..


మహారాష్ట్ర, హర్యానా లో బిజెపికి ఝలక్ తగిలినా...హర్యానాలో మేగ్జిమమ్ ప్రతిభ చూపించేసి పీఠం దక్కించుకుంది..ఇక జార్ఖండ్ లో కూడా అలా చేసే ప్లాన్ లో ఉండటం చూస్తే...చిన్న రాష్ట్రమైనా..పెద్ద ప్లానే వేయాలనే వ్యూహం ఫాలో అవుతున్నట్లుంది..కానీ లాభం కన్పించేట్లు లేదు

Comments