నిత్యానంద నిర్వాకం తెగువ..ఏకంగా ఐక్యరాజ్యసమితికే

కలకలం రేపుతోన్న నిత్యానంద కైలాసం సీరియల్లో మరో ఎపిసోడ్ బైటపడింది..తనకి తానే ఓ దేశం ఏర్పాటు చేసుకున్న ఈ దొంగబాబా భారత్‌పైనే కంప్లైంట్ చేసేందుకు తెగబడ్డాడు..దేశమే తనని వేధించిందని..మీరే  కాపాడాలంటూ ఏకంగా ఐక్యరాజ్యసమితికే మొర పెట్టుకున్నాడు..శరణార్ధి హోదా ఇస్తే తన లోకంలో తాను బతుకుతానంటూ విచిత్రమైన వాదనకి తెరతీసాడు
దేశం విడిచి జంపైన ఘరానాసామి నిత్యానంద..మరో సామ్రాజ్యం పెట్టుకున్న సంగతి కలకలం రేపుతుండగా..తనని తాను కవర్ చేసుకోవడానికి మనోడు ఏకంగా..ఐక్యరాజ్యసమితికే రాయబారాలు పంపుతున్నాడిప్పుడు..తనని శరణార్ధిగా గుర్తించాలంటూ సొంతదేశంపైనే అలవిమాలిన ఆరోపణలు చేస్తున్నవైనం చూడండి..పోలీసులు..మహిళాసంఘాలు..పొలిటికల్ పార్టీలు అన్నీ తనపై కత్తి గట్టాయంటూ 46 పేజీల లేఖ యూఎన్ఓకి పంపాడట..అంతే కాదు..ఏకంగా భారత న్యాయస్థానాలు కూడా తనపై పగ పెంచుకున్నాయంటూ ఆరోపణలు చేశాడు.

 ఈ దేశం నాకొద్దు..ఇలాంటి దేశంలో నేనుండలేను నన్ను కాపాడండి..నా దేశాన్ని నన్ను ఏలుకోనివ్వండి..దానికో కంట్రీ స్టేటస్ కూడా పడేయండంటూ ఐక్యరాజ్యసమితికి నిత్యానంద విన్నపం చూస్తుంటే..అసలితగాడి వ్యవహారం ఇక్కడిదాకా వచ్చేదాకా దిక్కులు చూస్తుండటమే పోలీసులు చేసిన తప్పు అనుకోవాలి. బిడది ఆశ్రమంలో నేరాలు..చాటు మాటు యవ్వారాలు..అహ్మదాబాద్ ఆశ్రమంలో లీలలు బైటపడిన తర్వాత కూడా నిత్యానంద బ్యాంక్ ఖాతాలు
ఫ్రీజ్ చేసిందీ లేనిదీ తెలీదు..2010నాటి కేసు నుంచి తప్పించుకునేందుకు తాను సంసారానికి పనికి రానంటూ నమ్మబలికాడు..ఐతే కోర్టు లైంగికసామర్ధ్య పరీక్షకి ఆదేశాలిచ్చిందప్పట్లో..దీన్నే ఇప్పుడు ఐక్యరాజ్యసమితికి రాసిన లేఖలో పొందుపరిచాడు..భారత న్యాయస్థానాలు ముద్దాయిల పట్ల అనాగరికంగా వ్యవహరిస్తాంటూ ఆరోపించాడు..బజరంగ్ దళ్, డిఎంకే, ఆర్ఎస్ఎస్ సహా అనేక పార్టీలపై తన అక్కసు వెళ్లగక్కాడు..ప్రస్తుతం భారత్‌లో మూకదాడి సంస్కృతి పెరిగిపోయిందని..ఇలాంటి దేశంలో తానుండలేనని..తనని శరణార్ధిగా గుర్తించాలంటూ కొత్త డ్రామాకి తెరతీసాడు..ఓ వేళ ఐక్యరాజ్య సమితి కనుక ఇతగాడికి శరణార్ధి అనే ముద్ర వేస్తే..ఇక ఏ రేప్ కేసులూ తననేం చేయలేవనది ఇతని ధీమాగా చెప్తున్నారు..
 మరోవైపు నిత్యానంద తాను దేశంగా చెప్పుకుంటోన్న కైలాసానికి అప్పుడే మంత్రిత్వశాఖలు కూడా ఏర్పాటు చేశాడట..సరిహద్దులు లేని తన దేశానికి ప్రధానమంత్రిగా ఓ నటిని ఎంపిక చేశాడనే గుసగుసలు కూడా విన్పిస్తున్నాయ్..ఈ కైలాస వెబ్‌సైట్ సంగతే చూస్తే..ఐపీ నంబర్‌ని ట్రేస్ చేయగా..ఇది అమెరికా నుంచి పని చేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. 2018 అక్టోబర్ 21న ఈ సైట్ ప్రారంభం కాగా...చివరిసారిగా 2019 అక్టోబర్ 10న అప్ డేట్ చేశారు..ఐతే వీడియోలు మాత్రం యూట్యూబ్‌లో కొత్తగా కూడా అప్‌లోడ్ అవుతూనే ఉన్నాయ్. ఎప్పుడైతే నిత్యానందుడి కైలాసం గురించి న్యూస్ గుప్పుమందో..వెంటనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ప్రారంభమైపోయింది.. వృషభ ధ్వజంతో..ధార్మికమైన ఆర్ధికవ్యవస్థ ఉంటుందని చెప్పుకుంటోన్న నిత్యానందుడి కైలాసం ఎక్కడుందో చెప్పాలంటూ ఆరా తీయడం కూడా మొదలైంది..నిత్యానంద దొరకాలే కానీ..అతగాడి పిచ్చి మేం కుదుర్చుతామంటూ కత్తులు నూరేవాళ్లూ తక్కువలేరు.

Comments