దొంగలు పడ్డారు...దర్జాగా పారిపోయారు..ఇప్పుడు తీరిగ్గా...!

అప్పుడెప్పుడో ఏడాది క్రితం కంప్లైంట్ ఇస్తే...ఇదిగో ఇప్పుడు నీరవ్ మోదీ ఆర్దికనేరస్తుడేనంటూ కోర్టు ప్రకటించేసింది..
ఈ సంవత్సరం మార్చిలో లండన్ కోర్టు బొక్కలో వేసింది కాబట్టి సరిపోయింది కానీ...లేకపోతే ఇంకా హాయిగా రంగూ వేషం మార్చేసి ఎంజాయ్ చేసేవాడే...ఇక్కడ 13వేలకోట్ల రూపాయలు బొక్కేసింది కాక...బ్రిటన్ పౌరసత్వంతో
అక్కడే ఓ ఉద్యోగం చేసుకుంటూ ఎంజాయ్ చేసిన మనోడి భాగోతం..ఎవడో తెలిసిన జర్నలిస్ట్ పక్కాగా పట్టుకుని అడిగేసరికి తెలిసింది..
అప్పటిదాకా హ్యాపీగా బ్యాంకు ఖాతాల్లోని డబ్బు తీసుకుని ఎంజాయ్ చే స్తూ..నెలకి లక్ష రూపాయల రెంట్ కట్టుకుంటూ షాపు నడుపుకుంటోన్న నీరవ్ మోదీ బ్యాంకింగ్ రంగంలో ఎలాంటి వ్యవహారాలు నడుస్తుంటుంటాయో చాలా చక్కగా వివరించాడు...హ్యాపీగా కాస్త ల ంచం పడేస్తే చాలు..నకిలీ లెటర్ ఆ ఫ్ క్రెడిట్లు..కోర్ బ్యాంకింగ్ కి సంబంధం లేకుండా..ఎక్కడబడితే అక్కడ లోన్లు పుచ్చేసుకుని ఆ తర్వాత దేశాలకూ చెక్కేయవచ్చు

ఇప్పుడు నేరగాడు అనే ముద్ర బడగానే..అతనేం వెంటనే ఇక్కడికి రాబడడు...లండన్ కోర్ట్ ఇక్కడికి పంపించాలంటే మరో మూడు నెలలు కనీసంగా పడుతుంది..అది కూడా అతనికి శిక్షవేసి...డిపార్టేషన్ కి అంగీకరిస్తేనే..

Comments