పవన్ కల్యాణ్ మహేష్ బాబుని ఎందుకు లాగుతున్నాడు..రేటింగ్స్ తెచ్చే టైటిల్


బ్హాబ్హూ....పవన్ కల్యాణ్ గారూ...మీరు ఏం చదువుకున్నారో తెలీదు..కానీ మీరు చేసే ఎగతాళి చూస్తే..మిమ్మల్ని ఎందుకు ఎగతాళి చేయకూడదని మిత్రులు అడుగుతున్నారు..మీరు చాలా సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చారు..మీరే చెప్తుంటారు కదా..కాబట్టి మీకు తెలుగులో చదువుకునే అదృష్టం (నిజంగానే)  దక్కింది..ఇతర హీరోలకు తెలుగు రాయడం..చదవడం రాదని ఎందుకు కేకలు పెడుతున్నారు...ఇక్కడా మీరు బుక్కైపోతారు సార్..తెలుగు వచ్చిన హీరోలు..తెలుగురాని తెలుగు హీరోలు అని మాట్లాడే ముందు..మీ కాంపౌండ్‌లోని ఎంతమంది హీరోలకు తెలుగు వచ్చు...అలానే మీ రెండ ో భార్యగారి పుత్రరత్నం అకీరానందన్ గారికి తెలుగు పేరెందుకు పెట్టలేదు సర్..సరే అది మీ ఇష్టం..మీ అకీరానందన్ ఏ మీడియం సర్..వదిలేద్దాం..అకీరానందన్ బాబుగారికి తెలుగు చదవడం రాయడం వచ్చా సార్..? ఎందుకంటే..మీరు వద్దు వద్దంటున్నా మా నెత్తిపైనే అతగాడిని హీరోగా రుద్దుతారు కదా...సమస్యే లేదు..

BE THE CHANGE సింపుల్ గా నువ్ చూడాలనుకునే మార్పు నీతోనే మొదలవ్వాలంటారు..ఇదైనా తెలుసా తెలుగు పునరుజ్జీవ సంఘాధ్యక్షా...మరి మీ ఇఁట్లో లేని తెలుగు అవతలి లోగిలిలో ఎందుకు కోరుకుంటున్నారు..గొప్ప సాహిత్యం అనేి ఊరేగేముందు తమరి సినిమాలలో .....ఈ ఓమైగాడ్...ఏయ్ చికిత్తా....ఏ మేరా జహాలు..ఎందుకు పెట్టించారు బాసూ...మీరొక్కరే తెలుగు చదువుతారు..ఇంకెవరూ చదవరు కాబట్టి..ఇప్పుడు మిమ్మల్ని పల్లకీలో మోయాలా..?
మహేష్ బాబుకి తెలుగు రాదు..కానీ తెలుగే మాట్లాడతాడు..ప్రకాష్ రాజు కన్నడ..ఐనా తెలుగు మీ కంటే గొప్పగా మాట్లాడతాడు..జయసుధ తెలుగు రాయడం రాదు..చదవడం రాదు..ఐనా తెలుగే మాట్లాడుతుంది..వీళ్లంతా ఇతర ప్రదేశాల్లో చదువుకున్నారు బాబూ...నీకంటే తెలుగు పల్లెల్లో( అప్పట్లో) బాల్యం గడిచింది కాబట్టి..ఇంగ్లీష్ మీడియంలో చదివే స్థోమత లేదు కాబట్టి (  ఇది తమరే గతంలో గొప్పగా చెప్పుకున్నారు) తెలుగులో చదువుకునే అదృష్టం పట్టింది..నిజంగా తెలుగు రావడం అదృష్టమే..దానికి పెట్టి పుట్టాలి..కానీ వీళ్లేం కావాలని తెలుగుకి దూరం కాలేదురా సామీ...అందుబాటులో లేక చదవలేకపోయారు.
.మరి మీ ఇంటి మాటేంటి...
మీ అర్జున్, వరుణ్ తేజ్, రాంచరణ్, సాయి ధరమ్ తేజ్, మీ అల్లుళ్లు..మీ కూతుళ్లు..వీళ్లంతా కూడూ మా తెలుగు ప్రేక్షకులపైనేగా పడి బతుకుతోంది..ముందు వాళ్లకి నేర్పు తెలుగు ఎలా పలకాలో..ఆ తర్వాత ఇతరులపై పడి ఏడుద్దువ్..అని మా స్నేహితుడు ఒకాయన హుంకరిస్తుంటే..నిజమే కదా అన్పించింది నాకు...

Comments