ఒక్క ఎమ్మెల్యేతోనే ప్రభుత్వాన్ని కూల్చేసే మొనగాడు..చరిత్ర సృష్టించడం ఖాయం


ఆయనంతే..ఏదనుకుంటే అది చేసేస్తారు..తలచుకుంటే ఎవరి తాటైనా తీసేస్తారు..వళ్లు చీరేస్తారు..అసలు ఆయనకి ఈ ప్రపంచంతో సంబంధం లేదు..తనకి అడ్డొస్తే కాటమరాయుడే..ఆగ్రహిస్తే..జల్సా చేయడం మానేసి..గుడంబా శంకర్‌లా ప్యాంట్ పై ప్యాంటేసుకుని జానీలా ప్రత్యర్ధుల బెండు తీస్తాడు..పిఎం అయినా...సిఎం అయినా..ఆయన ముందు నిలబడి బాబ్బబ్బూ కాస్త మమ్మల్ని గుర్తించు అంటూ బతిమాలాడుకోవాల్సిందే..లేదంటే  వాళ్ల పోస్టులకు గుర్తింపు లేకుండా చేస్తాడు మరి..

అంతటి ఘనుడు కాబట్టే..జనం 2009లో..2019లో ఆయన సత్తా ఆయనకి తెలిసేలా చేసి..బాబూ సున్నాకి ఉన్న విలువ మనం కట్టేది కాదు..కాబట్టి..సున్నా కంటే మీరు మరీ ఎక్కువ కాబట్టి..మేమివ్వగలిగేది..ఒకటే అని తమ అశక్తత వెల్లడించారు..ఈ పాడులోకాన్ని కాదు మీరు ఏలాల్సింది..ఈ నియోజకవర్గాలు..ఈ అసెంబ్లీలు మీ హోదాకి తగవు..అందుకే మీకో పెద్ద పోస్ట్ ఇస్తాం..కావాలనుకుంటే మళ్లీ మీకే మేం సిఎం పోస్ట్ కట్టబెడతాం అని బతిమాలాడుకున్నారు..లేదంటే ఈపాటికే కనీసం రెండు మూడుసార్లు ముఖ్యమంత్రి కాావాల్సిన మహానుభావుడీయన
పాతికేళ్లపాటు రాజకీయంలో ఉంటానని చెప్పగలిగిన ఈ మహానేతకి ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చాయి..కావాలనుకుంటే ఎన్ని పార్టీలైనా పెట్టగలరు..తీసేయగలరు..అలాంటప్పుడు మనం ఇంకో పార్టీకి సపోర్ట్ ఇస్తే తప్పేంటి అని.. ఆ మాట ముందే అనుకునేవాడే కానీ..పదవులు ఆయన దృష్టితో తుచ్ఛం కాబట్టి..వదిలేశారు..లేకపోతేనా 2019లో కూడా బిజెపి టిడిపితో కలిసేవాళ్లట..సీన్ 2014దే రిపీటయ్యేదట..మరి టిడిపితో కలిసేవాళ్లు..ఎన్డీఏ నుంచి బైటికి వస్తే తిరిగి బిజెపి టిడిపిని కలుపుకునేదా అని అడగొద్దు..అయ్యవారు తలుచుకంటే ఏదైనా చేయగలరు

అందుకే ఇప్పుడో మహాయజ్ఞం కాదు కాదు లెండి..అది మనబోటివారికి మహాయజ్ఞం కానీ..ఆయనకి చిన్న ఆకుపూజే..రైతులను కలుసుకోకుండా చేస్తే ప్రభుత్వాన్ని పడేస్తానంటూ జస్ట్ చిన్న సిగ్నల్ ఇచ్చేశారు..151మంది ఎమ్మెల్యేలు బహుశా పవన్ గారి న్యాయకత్వాన్ని బలపరచాలని రాత్రి డిసైడైనట్లు కలొచ్చిందో లేక..అమిత్ షా గారు మోదీతో కలిసి పవన్ బాబుని సిఎంగా నామినేట్ చేద్దామన్నట్లు కలగన్నారో కానీ..ఈ మాట చెప్పగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో..అందులో..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైందట..బాబ్బబ్బూ..ఆ పని మాత్రం చేయకు..పోయి ఆ టమాటా రైతులనే కలుసుకో..కలుసుకుని.." 150మంది ఎమ్మెల్యేలుండి ఏం లాభం..టమోటాలు మొక్కల పైన కాస్తున్నాయ్..గ్రౌండ్‌లో కాయించవచ్చుగా " అనో...ఇంతమంది ఉండి ఏం లాభం టమోటాలను ఆపిల్ రేట్లకి ఎందుకు పెంచలేదనో ఊరడించుకోండి అని వాపోతున్నారట

Comments

  1. I don't know what pavan kalyan wants to achieve with his incoherent speeches. He was a reasonably good actor in films like gabbar singh , atharintiki daredi etc.

    With his total lack of understanding about any issue and inconsistent thoughts, his daily sermons make little sense. The beauty of all this is he is ignorantly blissful about it.

    If he doesn't want to recognise democratically elected Jagan as CM, so be it. It doesn't make any difference.

    Very childish and desultory behaviour from Pavan Kalyan. I pity him.
    The sooner he quits politics and goes back to films, his terra firma, the better.

    ReplyDelete

Post a Comment