అయోధ్య కేసులోనూ క్యూరేటివ్ పిటీషన్


ముగిసిపోయిందనుకున్న అయోధ్య కేసులో సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటీషన్ దాఖలు అవనుంది. ధ్వంసమైన మసీద్ నుంచి ప్రతి ఇటుకా తమకే ఇవ్వాలంటూ బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ కోర్టులో ఈ పిటీషన్ దాఖలు చేసేందుకు నిర్ణయించింది.
 అయోధ్య కేసులో రివ్యూ పిటీషన్లన్నీ సుప్రీంకోర్టు కొట్టేసినా..ముస్లిం సంఘాలు మరోరూపంలో కోర్టుని ఆశ్రయించబోతున్నాయి. 1991న చోటు చేసుకున్నవిధ్వంసం తాలూకూ ప్రతి ఇటుకనూ తమకే ఇవ్వాలంటూ బాబ్రీమసీద్ కార్యాచరణ కమిటీ సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటీషన్ దాఖలు చేయనుంది..ఈ మేరకు లక్నో ఇస్లామియా కాలేజ్‌లో జరిగిన ఓ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ముస్లింసంఘాల నేతలు.

 సుప్రీంకోర్టు నవంబర్ 9న అయోధ్యలోని 2.77 ఎకరాల స్థలాన్ని  రామజన్మభూమికే చెందుతుందంటూ  తీర్పు ఇచ్చింది..ఈ తీర్పుపై  ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సహా పలు సంఘాలు రివ్యూ పిటీషన్ ను దాఖలు చేశాయి. వాటన్నింటినీ సుప్రీంకోర్టు డిసెంబర్ 12న కొట్టి వేసింది. నవంబర్ 9నాటి తీర్పులో ఎలాంటి మార్పుండదని స్పష్టం చేసింది..దీంతో బాబ్రీ మసీదు కార్యాచరణ కమిటీ ఇప్పుడు తాజాగా క్యూరేటివ్ పిటీషన్ దాఖలు చేయాలను నిర్ణయించింది..దీంతో కోర్టు తప్పనిసరిగా తమ పిటీషన్‌పై విచారించాల్సి వస్తుందనేది వారి ధీమా..బాబ్రీ మసీద్ శిథిలాలను తమకి కేటాయించేలా యూపీ ప్రభుత్వానికి.. రామజన్మభూమి కమిటీకి ఆదేశాలు కోరుతూ..ఈ క్యూరేటివ్ పిటీషన్‌ని బాబ్రీమసీద్ కార్యాచరణ కమిటీ దాఖలు చేయబోతోంది..

చూస్తుంటే చట్టాలను సరిగా అవగాహన చేసుకుంటే..తీర్పు అమలు కాకుండా ఎన్నాళ్లైనా సాగదీయవచ్చేమో అన్పించడంలో తప్పు లేదేమో 

Comments