జార్ఖండ్ నేర్పుతోన్న పాఠం..బీహార్‌లో పనికి వస్తుందా


జార్ఖండ్ చిన్న రాష్ట్రమే అయినా బిజెపికి పెద్ద పాఠమే నేర్పింది..పొత్తు లేకపోతే చిత్తైపోతామనే యదార్ధం తెలిసి వచ్చేలా చేసింది దీంతో ఇక బిజెపి బిహారీబాబు నితీష్ కుమార్‌ని హ్యాపీగా ఉంచడంపై ఫోకస్ పెట్టింది. వచ్చే ఫిబ్రవరిలో ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయ్ ఇప్పటికే ఇక్కడ నితీష్ కుమార్ ఐతే అటు లేకపోతే ఇటు అంటూ ఎప్పటికప్పుడు తమ స్టాండ్ మార్చుకోవడంలో సిద్దహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు
సిటిజెన్షిప్ అమెండ్మెంట్ బిల్‌కి మద్దతుపై వెనుకాడిన..నితీష్..తర్వాత  ఎన్పిఆర్..ఎన్ఆర్సీకి సపోర్ట్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చేశారు.

ఐనా ఎటుపోయి ఎటు వచ్చినా..మెజారిటీ మాత్రం మనకే దక్కాలనే ఆత్రంతో బిజెపి..డిప్యూటీ సిఎం సుశీల్ మోదీని అర్జంట్‌గా నితీష్ దగ్గరకి పంపింది.ఆయనేమో నితీష్ సారధ్యంలోనే ఎన్నికలలో వెళ్తామని చెప్తూనే..జార్ఖండ్ కాబోయే సిఎం హేమంత్ సోరెన్‌ని పొగిడేశాడు..ఇక్కడా రాజకీయమే..ఈ గెలుపు మొత్తం హేమంత్‌దే అని చెప్పడం ద్వారా..ఆర్జేడీ లీడర్ తేజస్వియాదవ్‌ని తక్కువ చేయాలన్నదే అదే..అంటే తేజస్వియాదవ్‌ని తక్కువ చేస్తే..బీహార్‌లో కూడా బిజెపి గెలుస్తుందనా...వాటే పిటీ
అటు మహారాష్ట్ర..ఇటు జార్ఖండ్ దెబ్బలే కాదు..హర్యానాలో గెలుపు కూడా బిజెపిది కాదు..జననాయక్ జనతా పార్టీది..పదిసీట్లతో ఈ పార్టీ మద్దతునే బిజెపి అక్కడ అధికారం దక్కించుకుంది. బీహర్‌లో వరదల సమయంలో గిరిరాజ్ సింగ్ నితీష్ కుమార్‌తో క్లాష్ అయ్యారు..ఐనా ఇప్పుడు సిచ్యుయేషన్ మారిపోవడంతో..పాపం బిజెపి
జేడీయూతో సర్దుకుపోవాలని డిసైడైంది..

Comments