కేపిటల్ ఏరియాలో భూములు ఉన్నాయ్...కానీ...వరసగా ఎక్స్‌ప్లనేషన్లు..హెరిటేజ్, ఏపీఎన్ఆర్‌కే


ఎక్కడైనా..ఆరోపణలు చేసినదానికి ఖండనలే విన్పిస్తాయ్..కానీ అవును మీరు చెప్పినట్లే చేసాం కానీ తప్పు చేయలేదు అంటే...లోకం ఎలా నమ్మతుంది..అసలు రాజధాని ఏరియాలో భూములు కొన్నారు అంటే..కొంటే తప్పేంటని అడగాలి తప్పితే..మాకు భూముల్లేవ్ అనడం తర్వాత  ఉన్నాయనడం ఏంటట...అదే జరిగిందిప్పుడు

ఓ వైపు మేం ఎప్పుడో కొనాలనుకున్న భూమిని కొన్న మాట వాస్తవమే అని ఒప్పుకుంటూ ప్రభుత్వం వాదనకే
పరోక్షంగా మద్దతు పలికింది హెరిటేజ్ ఫుడ్స్..

2014 జులై..ఆగస్ట్ నెలల్లో భూమి కొనడం అంటే అప్పటికి ప్రభుత్వం ఏర్పడి 3,4 నెలలు అయింది..మరి అప్పటికి రాజధాని ప్రాంతమేదో తెలీదు అనడం శుద్ద దండగమాట..ఎక్కడ రాజధాని వస్తుందో తెలుసుకుని.ముందే కొనేసుకున్నారని కదా అరోపణలు..మీరూ అదే మాట చెప్తే ఎలాగండీ సాంబశివరావ్ గారూ..


ఇక ఈయనదో బాపతు అక్రోశం...అసలు ఏపి ఎన్ఆర్‌టి అంటే..ఏంటి అదో పెద్ద ప్రభుత్వరంగ సంస్థ అయినట్లు..2014 తర్వాత పుట్టుకొచ్చిన అమాంబాపతు యాపారాల్లో అదీ ఒకటి..విదేశాల్లో ఉన్న తెలుగు వ్యక్తులు..ఇక్కడికొచ్చి పెట్టుబడులు పెట్టేందుకు ఏర్పాటు చేసినట్లుగా అప్పట్లో చెప్పకు్నారు...అలానే అమెరికాలో ఒకరిని ఏపీకి ప్రతినిధంటూ తగలబెట్టారు..వీల్లు కానీ..వాళ్లు కానీ ఏం ఊడబొడిచారో ఇంతవరకూ తెలీదు..

మన గ్రూపే ఓ సంస్థగా ఏర్పడటం..ఆ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ మెంట్స్  చేస్తుందని ముందు నుంచీ బాకాలు ఊదుకోవడం..ఆ తర్వాత..వాటి గురించి పుంఖానుపుంఖాలుగా వార్తలు రాయించుకోవడం ప్లాన్ 1 లో పని..
తర్వాత ఇక సదరు పే..ద్ద..గో...ప్ప సంస్త ఆంధ్రప్రదేశ్ కి అందులోనూ అమరావతికి రాబోతోంది..దాన్ని మాబాబుగారే..సాధించుకొచ్చారని ఊదరగొట్టడం..ఆ తర్వాత వాళ్లకి మనం ఏదోటి చేయాలి లేకపోతే పెట్టుబడులు పెట్టరంటూ ఎకరాలకి ఎకరాలు తగలబెట్టడం..ఇక ఆ సందర్బంగా ఊకదంపుడు ప్రసంగాలు...ఇంటర్వ్యూలు...దీంతో..ఆహా...అమరావతికి మావాడి వల్లకదూ ఈ మహానుభావులు వచ్చి ఇరగదీయబోతోందని సంబరపడటం...ఇదీ ఏపీ ఎన్ఆర్టీ కథా కమామీషూ...అందుకే ఇది ఏపిీ ఎన్ఆర్టీ కాదు.ఏపీ ఎన్ఆర్కే అని ఐవైఆర్ కృష్ణారావ్ అప్పట్లో ఈసడించుకుంది...

Comments

  1. Dbbulu sampadinchi loans petti chaala mandi sadhaarana prajalu amraavati lo invest chesaru. Andaru nerastulenaa? Andari meeda caselu pettandri. Maaku gittani chota enduku konnaarani.

    ReplyDelete
  2. బచ్చుగారూ....అమరావతిలో ఇన్వెస్ట్ చేసేదేంటి...ఎవరు ఎక్కడైనా పొలాలు స్థలాలు కొంటారు...దాన్నెవడు తప్పుబట్టాడు...ఇప్పుడు ఎవరైతే కేపిటల్ సంగతి ముందే తెలుసుకుని కొన్నారో..వాళ్ల గురించే మాట్లాడుతున్నారు తప్ప..ఇంకొకరి గురించి కాదు..అది అర్ధం చే సుకోండి..తర్వాత..ఏదైనా ప్రాజెక్టు వస్తుందంటే డబ్బులు పోసి కొనడం మామూలే...ఓ వేళ ఆ ప్రాజెక్టు రాకపోతే నష్టం కలగడం కూడా రియల్ ఎస్టేట్ జనాలకు సర్వ సాధారణం..అలా రియల్ ఎస్టేట్ లో సామాన్యజనం ఎవరూ వేలు పెట్టరు..సామాన్యులకు కోట్లకి కోట్లు డబ్బు పెట్టి ఎకరాలకు ఎకరాలు కొనగలిగే సామర్ధ్యం ఉందా...పైగా అలాంటి సామాన్యులకు లోన్లిచ్చే బ్యాంకులు కూడా ఉన్నాయా....కొన్నవాళ్లపై కేసులు పెడుతున్నారని ఎవడూ అనలేదు...డోన్డ్ వెప్ట్

    ReplyDelete

Post a Comment