పవన్ ఇదిగో నువ్ చేస్తోన్న తప్పులు

పవన్ కల్యాణ్‌ దారెటు..ఈ వారంలో జరిగిన ఆయన యాత్రలు పరిశీలించినప్పుడు..ఆయన వేస్తోన్న అడుగులు..మాట్లాడతున్న మాటలు..వ్యవహరిస్తోన్న తీరు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి తాత్కాలికంగా సంబరం కలిగించవచ్చేమో కానీ..సీరియస్‌గా ఫాలో అవుదామనుకునే రాజకీయనేతలకు..కార్యకర్తలకు ఆందోళన కలిగిస్తోంది

మొదటిది ముఖ్యమంత్రిగా జగన్ ని గుర్తించను అనే తన ప్రసంగం ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో అర్ధం కాదు...రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం..ముఖ్యమంత్రి ఉండగా..వారిని తాను గుర్తించను అన్న వ్యాఖ్యల వెనుక అందరికీ మంచి చేసిన తర్వాతే ఒప్పుకుంటాననే ధోరణి ఉంటే ఉండవచ్చు కానీ..ఆ కామెంట్లతో జనం ముందు పలచన అవడం తప్ప వేరే కొత్తగా జనసేనకి కానీ వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్‌కి కానీ వచ్చే లాభం ఏంటో ఆయనకే తెలియాలి
మంత్రుల భాష..పై ఆక్షేపణ తెలియజేయాలనుకుంటే పవన్ ఆ  పని అంతవరకే పరిమితం చేయాలి. అంతేకానీ ఒకరిద్దరు మంత్రుల భాషని మొత్తం అధికారపక్షానికి అంటగట్టడం అంతిమంగా 150 నియోజకవర్గాలలోని జనసేన పార్టీపైనే ప్రభావం చూపెడుతుంది..ఈ సందర్భంలోనే ఆయన ఆంధ్రప్రదే‌శ్ పరిధిలోకి రానటువంటి ఓ అత్యాచార ఘటనని ప్రస్తావించడం చాలా చాలా విమర్శలకు చోటు కల్పించింది.

ఆంధ్రప్రదేశ్‌లోనూ అత్యాచారాలు జరుగుతుండొచ్చు...వాటిపై ప్రశ్నించడమే పవన్ కల్యాణ్ ఉద్దేశం అయి ఉండొచ్చు కానీ దానికి బాధ్యులైన వారిపై సానుభూతి చూపిస్తున్నట్లుగా కామెంట్లు చేయడం మాత్రం రాజకీయంగా దిద్దుకోలేని తప్పు..దీనికి ఆ తర్వాత కూడా ఆయన ఎక్కడా వివరణ ఇచ్చుకోలేదు..రాజకీయంగా తప్పులు ఎవరైనా చేస్తారు..వాటిని వెంటనే ఒప్పుకున్నప్పుడే హుందాతనం పెరుగుతుంది..యాక్సెప్టెన్సీ వస్తుంది..అది వదిలేసి విమర్శలు చేసుకుంటూ పోతుంటే మన ప్రసంగాలకు చప్పట్లైతే దక్కవచ్చేమో కానీ..రాజకీయక్షేత్రంలో అపజయాలే ఎదురవుతాయ్.

ఆ తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో ఓ కార్యకర్త తనకి అలవాటైన భాషలో వైఎస్సార్సీపీ నేతల తలలు నరికి తెస్తానంటూ బాహుబలిలో కట్టప్పలా రంకెలు వేస్తుంటే..పవన్ ఆపాల్సింది పోయి..దర్జాగా మహారాజులా వింటూ ఆనందిస్తున్నట్లు కన్పించింది..ఆ తర్వాతైనా దానిని సరిదిద్దలేదు..ఎందుకంటే రాయలసీమలో ఆయన పర్యటన ప్రారంభమైంది మొదలు ఫ్యాక్షనిస్టుల గడ్డగా మార్చారు..ఇది సాహిత్యానికి పట్టుగొమ్మ అంటూ తెగిడి..తీరా తన కార్యకర్త అదే మొరటు మోటు భాష మాట్లాడితే..ఖండించకపోవడం ఆయనలోని ద్వైదీభావనకి నిదర్శనం..దీన్నే రెండునాలుకల ధోరణి అని ప్రత్యర్ధి పార్టీలు విమర్శిస్తే అది వారి తప్పు కాదు

ఇక రాజకీయంగా అతి పెద్ద పొరపాటు..తానెప్పుడూ బిజెపికి దూరంగా లేనని చెప్పడం..2019 ఎన్నికల సమయంలోనే టిడిపికి ఫేవర్ గా ...ప్రతిపక్ష వైఎస్సార్సీపీపైనే ఎక్కువ విమర్శలు చేసిన పవన్ కల్యాణ్ అందుకు తగిన గిఫ్టే పొందారు..తాను ఓడారు..పార్టీని ఓడించారు..ఇక ఇప్పుడైనా తానో ఆల్టర్నేటివ్ అని నమ్ముకున్నవాళ్లకి భరోసా కల్పించేబదులు తానే తన నిస్సహాయతని వీలైనప్పుడల్లా బయటపెట్టుకుంటున్నారు..
2018లో వాళ్లని తిట్టి మళ్లీ కలిసి పోటీ చేస్తే అది కరెక్ట్ కాదనే బిజెపి, టిడిపితో కలవలేదని చెప్పారు

ఓ వేళ కలిసి ఉంటే 2014 సీనే రిపీటై ఉండేదని చెప్తోన్న పవన్...పరోక్షంగా జనసేన టిడిపి, బిజెపి అలయన్స్ కోరుకుంటుందని కన్ఫామ్ చేసారు..మరోవైపు ఎప్పటికప్పుడు పార్టీని కలిపేయమంటూ అడుగుతున్నారని చెప్తున్న పవన్ ఆ  లీడర్ల పేర్లేంటో కూడా చెప్పినప్పుడే జనంలో క్రెడిబులిటీ పెరుగుతుంది..అంతేకానీ ఇలా ఎప్పటికప్పుడు గందరగోళ వ్యూహాలతో క్యాడర్ నే కంగారు పెడుతుంటే నష్టమే కానీ లాభం ఉండదు

ఐతే పవన్ కల్యాణ్ పదే పదే జగన్ రెడ్డి..మతమార్పిడులు అంటూ ప్రస్తావిస్తుండటం ద్వార ా ఆంధ్రప్రదేశ్ లో ని ఓ వర్గం చేస్తున్న ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నట్లే అనుకోవాలి..ఇంగ్లీష్ మీడియం మొదలుకుని మతపరమైన ఆరోపణల వరకూ పవన్ ప్రవర్తిస్తున్న తీరు వెనుక పొలిటికల్ మైలేజ్ అనే భారీ ప్రయోజనమైతే ఆయనకి కన్పిస్తుండొచ్చు కానీ..అది చివరకు జనసేనకి కాకుండా.. ఇతర పార్టీలే హైజాక్ చేసి వాడుకునే పరిస్థితులు కన్పిస్తున్నాయ్....ఇంకా చెప్పాలంటే అవే విమర్శనాస్త్రాలు బూమరాంగ్ గా మారి వైఎస్సార్సీపీకే అనుకూలించవచ్చు కూడా..

Comments

  1. దుష్ట దుర్మార్గ ఫాక్షనిస్ట్ పరిటాల దౌర్జన్యాలనే తిప్పికొట్టిన రాప్తాడు చైతన్యం ముందు ఈ పిల్ల సాకే పిచ్చి కూతలు లెక్క చేయవు గాక చేయవు.

    ReplyDelete

Post a Comment