ప్రాణాలు పోతే కానీ.. విషయం అర్ధం కాదా ? మోదీ గారూ..అంతేనా!


ఉత్తరప్రదేశ్‌లో 16మంది..మంగళూరులో ఇద్దరు ..18మంది ప్రాణాలు పోయిన తర్వాత కానీ మనకి అర్ధం కాలేదు..పరిస్తితి ఈ స్థాయిలో ఉందని..అసలు గొడవలు మొదలైన రోజే మాట్లాడి ఉంటే..ఈ సమస్య ఇక్కడిదాకా వచ్చేదా..లేదూ పార్లమెంట్‌లోనూ చట్టం పాస్ అయ్యే ముందు చెప్పవచ్చు కదా..అయ్యా బాబూ..ఈ చట్టంతో ఇక్కడి బతికేవాళ్లకి ఎలాంటి సంబంధం లేదూ...
బయట దేశాలనుంచి వచ్చేవాళ్లకి ...ఇక్కడి ఉండేవాళ్లకి భద్రత కోసమే కొత్త చట్టమని..కానీ ఇప్పుడు తీరిగ్గా గొంతు చించుకుంటే ఆ చనిపోయినవాళ్ల కుటుంబాలు ఆనందిస్తాయా...

మరి ఇప్పుడు ఇక్కడ ఎన్ఆర్సీ విషయంలో జరిగింది..కూడా అంతేగా...కొంతమంది జనం బలైతేకానీ..
పరిస్థితి తీవ్రత పైకి పాకదన్నమాట...సిటిజెన్షిప్ చట్టంతోనే..ఇలాగుంటే...ఇక ఎన్ఆర్సీతో ఎలాగుండబోతోందో ట్రైలర్ తో తెలిసినట్లుంది..అందుకే ఇక ఎన్ఆర్సీ మేం తేలేదు..మాపై ఎందుకు బురద జల్లడం..మేం అది పార్లమెంట్ కి తీసుకురానే రాలేదు..అంటూ బ్యాక్ స్టెప్ ఏసింది అందుకేగా..!

అంతే 30 ప్రాణాలు పోతే కానీ...ఆర్టీసీ స్ట్రైక్ ఆగలేదు..ఛార్జీలు పెరిగి..ఎప్పటిలాగా తిరగడం లేదూ
పదుల సంఖ్యలో జనం చచ్చిన తర్వాత కానీ ఇసుక లారీలు కదల్లేదు


మనలో మన మాట..ఇప్పుడలా..జరిగితే కానీ. కేపిటల్ విషయంలో వెనుకడగులు...హామీలు..తూచ్ లు చోటు చేసుకుంటాయా ఏంటి..వద్దు బాబూ వద్దు ముందే కళ్లు తెరవండి

Comments