ఎమోషనల్ అయిన వంశీ..ఇకపై స్పెషల్ ఎమ్మెల్యే


అసెంబ్లీలో వల్లభనేని వంశీ కృష్ణ మాట్లాడటానికి ప్రయత్నించడం..టిడిపి అడ్డుకోవడం ఊహించేదే అయినా...స్పీకర్ ఇచ్చిన ట్విస్ట్‌తో సీనంతా మారిపోయింది..తమ పార్టీ  నుంచి సస్సెండ్ చేసినంత  మాత్రాన ఎమ్మెల్యే కాకుండా పోతాడా..అతని హక్కులు పోతాయా..పైగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికంటూ సభలో మాట్లాడకూడదని పార్టీగా ఎలా శాసిస్తారు..ఇదే విషయాన్ని స్పీకర్ చక్కగా పట్టుకుని..పాపం టిడిపికి ఝలక్ ఇవ్వడంతో..ఇక సభ నుంచి బైటికి పోవడం తప్ప వేరేదేం చేయలేని పరిస్తితి

తాను ఎమ్మెల్యే కాకముందు ఏం చేసిందీ..ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేసిందీ చెప్పిన వంశీ..సమయానుకూలంగా వైఎస్ పథకాలను పొగడటం..తర్వాత జగన్ తీసుకొచ్చిన అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియం చదువులపై చక్కగా మాట్లాడారు..ఎవరైనా కన్విన్స్ అవ్వాల్సిందే..ఈ సందర్భంగా ఆయన ఇక టిడిపితో కలిసేదే లేదన్నట్లుగా..పప్పు అండ్ బ్యాచ్ అని..ముసలి ఎద్దు..గుడ్డెద్దు అని మాట్లాడటం మాత్రం ఎవరిని ఉద్దేశించి అన్నాడో వారికి బాగానే తగిలింది..

ఈ సందర్భంగా తాను ఏమేం సహాయాలు చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది చెప్తూ..కాస్త ఎమోషనల్ అయ్యారు వంశీ..ఆయనకి ఉన్న చక్కని తెలుగు భాషని ఇలానే వినియోగిస్తుంటే చూడాలని ఎవరికైనా ఉంటుంది..తనని టిడిపి కాకుండా..స్పెషల్ సభ్యుడిగా గుర్తించాలంటూ కోరారు..ఇది చక్కని చర్య..నేెనెన్ని చక్కని అనే పదాలు వాడానో లెక్కపెట్టకుండా..వల్లభనేని వంశీ ఎంత రాజకీయ చాతుర్యం ప్రదర్శించారో గమనించాలి..ఎమ్మెల్యేలు..పార్టీ జంప్ అయి మంత్రులు కావడం కంటే ఇది వేయి రెట్టు బెటర్ కాదా

Comments

  1. వంశీ శాసనసభకు రాజీనామా చేసి గన్నవరం నుండి వైకాపా తరఫున పోటీ చేస్తే టీడీపీ లోకేశం బాబును నిలబెట్టితే బోలెడంత ఫ్రీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, పైగా ఎన్నికల ప్రచారాల యొక్క ప్రసారాలకు టీఆర్ఫీలు రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం!

    ReplyDelete
  2. ఓహో! అంటే సీఎం ని పొగిడితే నచ్చింది. ఎగస్పార్టీ ని తిడితే కిక్కు వచ్చింది.
    కొన్నేళ్ల తరవాత ఇదే శాసన సభ్యుడు జగన్ ని తిడితే? అప్పుడు కూడా కిక్కు వస్తుందా?☺️

    ReplyDelete

Post a Comment