ఇప్పుడేంటి దారి..3 రాజధానుల కథ ముగిసినట్లేనా


3 రాజధానుల కథ...ముగిసిందా లేదు...అప్పుడే ముగియలేదు..ఇంకా కథ చాలా ఉంది..జస్ట్ ఎమ్మెల్సీలు ఈ బిల్లుని పాస్ చేయము..ఇందులో మార్పు చేయాలి..అంటూ సెలక్ట్ కమిటీకి పంపారు..అంతే..ఈ సెలక్ట్ కమిటీ ఏం చేస్తుంది..ఇందులో ముందు ఛైర్మన్ గా సదరు మంత్రిని వేస్తారు..తర్వాత సభ్యులుగా నిష్పత్తి ప్రకారం టిడిపి, వైఎస్సార్సీపీ బిజెపి..పిడిఎఫ్ మెంబర్లు ఉంటారు..వీరంతా ఏం చేస్తారు...?

ఎవరికి తోచిన సలహాలు సూచనలు ఇస్తారు..అంతే నిజమే ఎవరికి తోచిన సూచన అంటే..టిడిపి మేం పూర్తి బిల్లుకి వ్యతిరేకం అని చెప్తుంది..లేదంటే సెక్రటేరియట్..అసెంబ్లీ..మినిస్టర్ క్వార్టర్స్..అన్నీ అమరావతిలోనే ఉండాలి అని ప్రతిపాదిస్తుంది..వైఎస్సార్సీపీ లేదు మొత్తం అసెంబ్లీ మినహాయించి అక్కడకి మార్చుతాం అంటుంది..

ఇలా ఎంతకాలం...మూడు నెలలు మాత్రమే...కాదు ఎన్నాళ్లైనా అనడానికి లేదు..ఎందుకంటే..అసెంబ్లీలో మళ్లీ బిల్లు పెట్టి..ఆ బిల్లుని మండలికి పంపుతుంది ప్రభుత్వం..అప్పుడిక మార్పులు చేసినా...చేయకపోయినా...బిల్ పాస్ అయినట్లే..అసలు సిఆర్ డీ ఏ రద్దు చేస్తేనే రాజధాని తరలించడం వీలవుతుందా...అంటే లేదు..కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టంలో డెవలప్ చేసే అధికారమే తప్ప...ఫలానాది ఇక్కడే ఉండాలనేమైనా రూల్ ఉందా..లేదు అందుకే హైకోర్టు కర్నూలుకి వెళ్తుంది...అసెంబ్లీ మిగులుతుంది..లేదు ఆ రూల్ ఉంది అని వాదించేవాళ్లకి కాలమే సమాధానం చెప్తుంది..
అంటే మూడు నెలలపాటు వాయిదా తప్ప..ఏం లేదు..కానీ జనం తరపున (అమరావతి) చివరిదాకా మేం చేయగలిగినంత పని చేసామని టిడిపి చెప్పుకోవడానికి ఓ వీలు దొరికింది..అంతే..!

Comments