ఈ 4 రోజుల్లో ఏం జరుగుతుంది..ఏపి సిఎం జగన్ ఏం చేస్తాడు..బాబు ఏం చేస్తాడు


సోమవారం మండలిపై ఓ నిర్ణయం తీసుకుందాం...అప్పటిదాకా బ్రేక్..
ఈ బ్రేక్ అంత తెలివి లేకుండా ఇచ్చింది కాదు...ఇక్కడ కూడా గేమ్ ఉంది...ఈ నాలుగు రోజుల్లో ఏం జరుగుతుంది..ఏ ఛానల్ కూడా చెప్పదు..ఎందుకంటే ఏ చానల్ డప్పు దానిది కాబట్టి..మండలి రద్దు చరిత్ర...ఈ పురాణాలు వల్లించడంలోనే వాటికి సమయం సరిపోద్ది...

ఒకటి జగన్..ప్రస్తుతం బిల్లు వాయిదా పడినట్లే అని నిర్ధారణ అయినా..ఇంకా లూప్ హోల్స్ ఉంటాయి కాబట్టి..వాటిని
వెతికే పనిలో బుగ్గన సహా అందరు టీమ్ మెంబర్లనీ ఉంచేస్తాడు..ముకుల్ రోహత్గీని సంప్రదిస్తాడు..కోర్టులో ఏం చేయాలి...అలానే సభలో ఏం చేయాలి...మండలి రద్దు కాకుండానే తన పంతం నెగ్గించకునే వ్యూహం ఖచ్చితంగా పన్నుతాడు..
మొదటిది..ఎంఎల్సీ రద్దు అనేది వెంటనే అయిపోదు అని తెలిసినా కూడా..మూడు నెలల ముందునుంచే దీనికి బీజం వేసాడంటే..ఖచ్చితంగా ఆ పని చేస్తాడు..ఈ పాయింటే ఇప్పుడు 55మంది ఎమ్మెల్సీలకు ఠారెత్తిస్తోన్న విషయం..ఇప్పటికిప్పుడు వైఎస్సార్సీపీ బలం తక్కువ..వారందరికీ ఏదో పదవి ఇవ్వడం పెద్ద కష్టం కాదు..మరి మిగిలిన టిడిపి, బిజెపి ముఖ్యంగా పాపం లోకేశ్ పరిస్థితి ఏంటి..ఆయనకీ ఏం కాదు..కానీ భవిష్యత్తు మాటేంటి
అందుకే వీలైనంతమంది టిడిపి బిజెపి ఎమ్మెల్సీలతో రాయబారాలు నడుస్తాయ్..ఎంత నడిచినా..మెజారిటీ దక్కకపోయిన సిచ్యుయేషన్‌లో....సభకే రాకుండా చేయమని..ఫీలర్లు వెళ్తాయ్..

రెండవది..మండలి రద్దు...దీనికి అసెంబ్లీలో తీర్మానం చేస్తారు..అది బిజెపి అంగీకరించకపోతే..ఆర్డినెన్స్ ఉంది..దాంతో చేసేస్తారు..ఇది కూడా కుదరదనేవాళ్లున్నారు...అయినా దాని దారిన అది రద్దు పోకడలో పోతుంది..
మూడోది..మూడు నెలల తర్వాత బిల్లును రద్దుకాని (రద్దయ్యే ప్రక్రియలో ఉన్న మండలిలో) మండలిలో పెడతారు..


మరి చంద్రబాబు ఏం చేస్తాడు..ఏం చేయడు...జస్ట్ తన పాత వాదనని కొనసాగిస్తారు...అటు కేంద్రం..ఇటు రాష్ట్రంల ోమండలి రద్దు కాకుండా ప్రయత్నాలు మొదలుపెడతారు..సెలక్ట్ కమిటీ దగ్గరున్న బిల్లును వీలైనంత లేట్ చేద్దామని వ్యూహం రచించడం మినహా మరో గట్టి ప్లానేం లేదు టిడిపి దగ్గర...

....రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా...అందులో మొండోడే రాజైతే ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో జగన్ చంద్రబాబుకి చూపిస్తాడు

Comments