అల్లుకు పోయిన ఈ అవార్డే ఇక రానున్న పద్మాలకు ట్రైలరా..!


పై ఫోటో చూడండి ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డుగా చెప్తోన్న ఛాంపియన్ ఆఫ్ ది చేంజ్..తీసుకుంటోన్న అల్లు  అరవింద్ గారు కన్పిస్తున్నారు..ఇది చిరంజీవి బ్లడ్ బ్యాంక్..చారిటబుల్ ట్రస్ట్ తరపున తీసుకుంటున్నట్లు తెలుగు పేపర్లలో చదివాం...ఐతే గత వారంలోనే అల్లు అర్జున్ మా నాన్న ఎంత చేసారు..కనీసం ఒక్క అవార్డు కూడా ఇవ్వరా అని అడిగిన నేపద్యం చూసాం..అలా వాపోయిన వారానికే ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డు దక్కడం సూపర్..
ఐతే ఈ అవార్డు ఎందుకు ఇచ్చారు..ఆ అవార్డు పూర్వాపరాలు ఏంటనే డౌట్ చాలామందికి కలిగింది..ఇదిగో ఆ అవార్డు వివరాలు
ఐతే ఇంటరాక్టివ్ ఫోరమ్ ఆన్ ఇండియన్ ఎకానమీ అనే ఓ స్వచ్ఛంద సంస్థ..లాభాపేక్ష లేని సంస్థ ఈ అవార్డుని ప్రకటించింది..ఇదిగో పైన కానీ..కిందకానీ..ఏ ఏ రంగాలలో ఎలాంటి సేవ చేస్తే పై అవార్డు ఇస్తామో కూడా చెప్పింది..


బహుశా...ఆ ఆరో కేటగరీలోని మెడికల్ క్యాంప్ అనే విభాగంలో అల్లు అరవింద్ గారికి ఈ అవార్డు దక్కిందనుకోవచ్చు..ఈ సంస్థ తాలూకూ మిగిలిన వివరాలు ఇలా ఉన్నాయ్...
లేదంటే హెల్తే కేర్..రంగంలో అయినా ఉండాలి అంతేకానీ స్వచ్ఛతా అభయాన్ కానీ..గర్ల్ ఛైల్డ్ కానీ...గాందేయవాద ప్రచారంలో కానీ మెగా ఫ్యామిలీ ప్రవేశించలేదు..ఐతే ఇక ఈ అవార్డు తర్వాత అల్లు అరవింద్ గారి కృషి గుర్తించి ఇతర పురస్కారాలు దక్కుతాయనే ప్రచారం జరుగుతుంది మరి

Comments