కొడాలి నాని పంచ్..ఈసారి అసెంబ్లీ గ్యాలరీకి బాబు..లోకేశ్‌కి రాజకీయభిక్ష వైఎస్ చలవట


చంద్రబాబునాయుడిపై దూకుడు ఏ వైఎస్సార్సీపీ లీడరైనా తగ్గించాడేమో కానీ..మంత్రి కొడాల నాని మాత్రం తనకి ఆజన్మ శత్రువు అయినట్లుగా వ్యవహరించే తీరు మాత్రం ఆసక్తికరంగా మారుతుంటుంది..సభలో ఎవరూ గమనించని పాయింట్ ని హైలైట్ చేద్దామనుకుంటాడో ఏమో కానీ..అందరూ చంద్రబాబు మండలి గ్యాలరీలో కూర్చుని ఛైర్మన్ ని ఇన్  ఫ్లుయెన్స్  చేశాడని అంటే..అందులోనూ జగన్ ఫ్యాక్టర్ ని వెతుకుతాడు నాని..

ఈసారి జగన్ ఎఫెక్ట్ కి అసెంబ్లీ గ్యాలరీలో కూర్చోవాల్సిన సిచ్యుయేషన్ తీసుకురావాలని కోరతాడాయన. అలానే ఎంత రఫ్‌గా అన్పించినా..అది అతని మాట తీరు తప్ప ఒక్కటి కూడా అన్ పార్లమెంటరీ వర్డ్ అందులో కన్పించదు..పప్పునాయుడు అనడం బూతు కాదు..అలానే ఎవడిచ్చాడండీ ఈయనకి అధికారం అనే వాక్యాన్ని ఎంత ఫోర్స్‌గా మాట్లాడతాడంటే..అందులోనే కావాల్సినన్ని బూతులు ఉన్నాయని అనుకుంటారు కానీ..ఒక్కటి వాడడు..
అయితే ఆసక్తికర విషయం ఇంకోటి ఏంటంటే..కొడాలి..చంద్రబాబు ఆయన కుమారుడిపై ధ్వజమెత్తుతుంటే..వల్లభనేని వంశీ గంభీరంగా మారిపోవడం..ఇదేదో తిరిగి పాత గూటికి చేరే వ్యవహారంలా ఉంటే అందులో ఆశ్చర్యం ఏమీలేదు.. ఎంఎల్‌సి రద్దుపై కూడా కొడాలి తన అభిప్రాయాన్ని సూటిగా..సుతిమెత్తగానే చెప్పాడు.. ఒకరిద్దరు సన్నాసుల కోసం రద్దు చేయడం కరెక్టో కాదో ఆలోచిద్దామనడం సబబైన మాట..అలానే లోకేశ్ కి రాజకీయతభిక్ష పెట్టిందే వైఎస్ అని..ఆయన మండలి పునరుద్ధరించకపోతే..ఇలాంటి దద్దమ్మ మంత్రి అయ్యేవాడేనా..అసలు గెలిచే మొహమేనా అంటూ సభలో బోలెడంత వినోదం పంచడమే కొడాలి మార్క్ అనుకోవాలి

Comments