వాటే లుక్ పాయల్..కానీ ఎందుకిలా డౌన్ అవుతున్నావ్


చూడండి ఎంత చక్కగా అందంగా ఉందో..ఎక్కడా ఒక్క మచ్చ కూడా లేకుండా క్లీన్ గా తీర్చి దిద్దినట్లున్న ముఖారవిందం..తీరైన కనుబొమ్మలు..పొడవైన నాసిక..గుండ్రటి ముఖం..చక్కని కపోలాలు..పెద్ద పెదవులు..ఇంకా ఎంతైనా వర్ణించబుద్దయ్యే అందం..ఇంత అందం ఉంటే హీరోయినే కదా అయ్యేది ..అలానే హీరోయిన్ కూడా అయింది
పాయల్ రాజ్ పుత్..
గురుగావ్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ..తెలుగు ప్రేక్షకుల మనసును గెలిచినంత సేపు పట్టలేదు..ఐటెమ్ గాళ్ గా మారడానికి..సరే ఏదో ఇంకా గుర్తింపు కోసం అలా చేసిందనుకుంటే..క్యారెక్టర్లు కూడా చీప్ వి వేయడం ప్రారంభమైంది..క్యారెక్టర్ అలాంటిది కాబట్టి చేసా..నేను చీప్ కాదు అనొచ్చు కానీ..వ్యాంప్ తరహా హీరోయిన్ క్యారెక్టర్లు చేయడం కెరీర్ కి సరికాదు..


పాయల్ రాజ్ పుత్ కి బ్రేక్ అంత ఆషామాషీగా రాలేదు..ఎప్పుడో 2010లోనే తెరపైకి వచ్చిందీ అమ్మడు..ఐతే అది టివి సీరియల్స్ తో...అలా చేసుకుంటూ 2013కి ఓ సినిమా..ఆ తర్వాత మరో సినిమా..అలా చేస్తూ..చివరికి అజయ్ భూపతికి ఎలా చిక్కిందో కానీ...ఆర్ఎక్స్ హండ్రడ్ చేసింది..మంచి పేరూ తెచ్చుకుంది బ్యాడ్ గాళ్ క్యారెక్టర్లో...ఐతే ఆ తర్వాత చేసినవి మాత్రం పేలిపోవడంతో ఐటెమ్ సాంగ్స్ కి సిద్ధపడింది..
ఇక ఇప్పుడు మిగిలింది డిస్కో రాజాతో తన లక్ మరోసారి టెస్ట్ చేసుకోవడమే..కానీ ఆ  ప్రీరిలీజ్ ఈవెంట్ లో చూడండి..ఎలా మెరిసిపోయిందో..ఇంత గ్లామర్ ఉండి..ఇలా కెరీర్ డల్ అయిపోవడానికి ఆమే కారణం అనుకోవాలేమో...

Comments