నారా లోకేశ్ ఇప్పుడేం చేయాలంటే


పదవి ఊడటం ఖాయంగా కన్పిస్తోంది..
ఊకదంపుడు రొడ్డకొట్టుడు డైలాగ్స్ కాదు
ట్విట్టర్ నుంచి బైటికి వచ్చావ్..ఇక జనంలోకి రా..
నాలుగు మాటలు చక్కగా మాట్లాడితే ఐదోది జారడం..ఇది కాదు మాకు కావాల్సింది
నడిపించే నాయకుడు...మరి బాబు ఉండగా..మీకు భజనపరులే కానీ..అసలు నైజం తెలిసేదెలా
అందుకే లోకేశ్ ఇప్పుడేం చేయాలంటే...
ముందు తప్పులు లేకుండా మాట్లాడాలి.. ఆ తర్వాత తనని తాను నమ్ముతూ...పార్టీని ముందుకు నడిపించే ప్రయత్నం చేయాలి...దానికి ముందుగా జగన్ పై  ఆరోపణలు మానాలి..ఎటూ ఎంత వగచినా..పోయిన ఎమ్మెల్సీ రాదు( మరో ఏడాది సమయం పట్టినా రద్దు రద్దే)..

అలానే ఎంత శాపనార్ధాలు పెట్టినా వైఎస్ జగన్ ఈ అసెంబ్లీ పదవీకాలం ఉన్నంతవరకూ ఆయనే సిఎం..మధ్యలో అంధజోతి రాతలు చూసి..పాపం బొక్కలోకి పోతాడనే ఆశలు వదులుకోవాలి..మరి ఏం చేయాలి...
జగన్ తన పదవి కోసం..సిఎం కావాలనే లక్ష్యం కోసం ఎలా  ఎంతమందితో పోరాడాడో..అలా పోరాడాలి

పాదయాత్రలు చేయాలి...నిరాహారదీక్ష చేయాలి..అవసరమైతే...ఆమరణదీక్ష కూడా చేయాలి...ఇవన్నీ చేసినప్పుడు అప్పుడు తెలుగు జనం లోకేశ్ ని ఓ నాయకుడిగా అంగీకరిస్తారు..లేదంటే మాత్రం ఇలా విమర్శలకే పరిమితం అయితే..అంతే...
అమరావతి రాజధానిగా కొనసాగించాలంటే..ఈ మాత్రం తెగువ ఉండాలి..లేదంటే ఏ ప్రయత్నం లేకుండా గుర్తింపు రావాలంటే రాదు..బాబుగారి కొడుకుగా రాజకీయ భవిష్యత్తుకి తిరుగు ఉండదు కానీ..అందులో లైఫ్ ఏ మాత్రం ఉంటుంది..బాబు ఉన్నంతవరకే...నిజమా కాదా..!

Comments