దేశంలో ముఖ్యమంత్రులలో జగన్ ఒక్కడికే కాదు..20మంది సిఎంలకు ఇన్విటేషన్ లేదు..ఐతే ఏంటి


ఎహ..వదిలేయండి..అన్నీ  ఒకటే కాన్సెప్ట్..అమరావతి గోడు..జగన్ పాడు..ఇదే కాన్సెప్ట్‌గా మన వార్తలు ఉండాలి..రోజుకో సారి కాదు..కనీసం వందసార్లు ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రిపై ఏది తోస్తే అది నెగటివ్‌గా రాయాలి..అది చూసి..ఛీ..మరీ నేను ఇంత రాక్షసుడినా అని సాక్షాత్తూ మన లక్ష్యకారుడే బాధపడాలి..ఇలానే ఆదేశాలు ఇచ్చారా అన్నట్లుగా ఉంది ఆ ఛానల్ పరిస్థితి..అదే కాదు..మరో ఛానల్ పరిస్థితి కూడా..ఏపీ సిఎం జగన్ కి ట్రంప్‌తో విందుకు ఆహ్వానం అందలేదట..ఐతే ఏంటి...అదేమైనా ఘోరమా...ఆయనతో పాటు..20మంది ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు లేవు..

దానికిీ రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధం ఏంటి...ఇంకా నయం ట్రంప్ స్వయంగా ఈ ముఖ్యమంత్రులను వైట్ హౌస్ కి తీస్కపోయి..తన బెడ్ రూమ్..బాల్ రూమ్..అన్నీ చూపించి..కమాన్ మీ దేశాలలో కూడా ఇలాంటివే కట్టిండి..నేను పెట్టుబడి  పెడతా అంటాడు..ఆ ఛాన్స్ మిస్సయ్యారు అందరూ అని రాసుకుంటారేమో..
అసలు రేపు రాత్రి ట్రంప్ డిన్నర్ పార్టీలో ఎవరెవరు ఎలా సాగిలబడతారో...ఎవరు ఎవరి ముందు చేతులు కట్టుకని నిలబడతారో చూడొచ్చు..మహా అయితే..హలో అని ఓ చిరునవ్వు తప్ప...కనీసం షేక్ హ్యాండ్ కి  కూడా అమెరికన్ సీక్రెట్ ఏజెంట్లు..ప్రొటోకాల్స్ ఒప్పుకోవు..

అలాంటిచోటకి ఆహ్వానం రావడం కూడా గొప్ప విషయమే అని బావించాలా..సరే అలానే అనుకోండి..ఐనా కాంగ్రెస్ అధినేత్రి సోనియాని పిలవలేదు..కానీ కాంగ్రెస్ పార్టీ నేత అధీర్, గులాంనబీని పిలిచారంటే వైఎస్సార్సీపీ సభాపక్షనేతలను కూడా పిలిచినట్లే కదా...అంటే ఇక్కడేదో పైకి కన్పించని..లాబీనో..లేకపోతే ప్రోొటాకాల్ ప్రకారమో మిగిలిన సిఎంలకు ఆహ్వానాలు అంది ఉండాలి..అంతమాత్రాన ఇతర ముఖ్యమంత్రులు అర్జంట్ గా కడివెడు కన్నీళ్లు కార్చేసేయాల్సినంత ఇన్సల్ట్ ఏముంటుంది..ఓరే బాబులూ బుర్ర పెంచండి.రా..డబ్బులు తీసుకుని అంటే( జీతాలు) తీసుకుని ఇంత పేలవమైన స్టోరీలేంట్రా బాబూ..!

Comments