ఐఆర్‌సిటిసి షేరు 500శాతం పెరిగింది..ఇంకా పెరుగుతుందా..ఏం లాభాలో..!


విన్నర్స్ ఆర్ విన్నర్స్..లూజర్స్ ఆర్ లూజర్స్ అని స్టాక్ మార్కెట్లోనే కాదు..వ్యాపారాల్లో కూడా చెప్తుంటారు..
ఉదాహరణకు చూడండి..ఆర్ టిసిలకేమో భారీ నష్టాలు...ఐఆర్ టీసీకేమో..ఫుల్ లాభాలు...తేడా అల్లా..ఒకటేమో పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్..మరొకటి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కి సర్వీస్...అంతే ఈ ఒక్క మోడలే రెండు సంస్థల మధ్యా విపరీతమైన తేడా తెచ్చింది..ఒకటేమో సర్వీసులు పెరిగేకొద్దీ నష్టపోతుంటే..ఒకటేమో సర్వీసులు పెరిగే కొద్దీ లాభాలే...మౌలికమైన తేడాని ఇంకా క్లియర్ గా అర్ధమయ్యేలా చెప్పాలంటే..ఒకటి అసలు సర్వీసైతే..మరొకటి కేవలం మీడియేటర్..

ఇక విషయానికి వస్తే ఐఆర్ సిటిసి కంపెనీ ఆన్ లైన్లో టిక్కెట్లు రైలువి బుక్ చేసుకోవాలనుకునేవారికి అందరికీ తెలిసిన పేరు..ఇంకాస్త డీప్ గా చూస్తే..రైళ్లలో సర్వీసులు..మంచినీళ్లబాటిల్స్..ఫుడ్ కూడా సర్వీస్ చేస్తుంటుంది..2019 అక్టోబర్ లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసింది ప్రభుత్వం...రేటు 320కి అటూ ఇటూగా ఉండగా..లిస్టింగ్ రోజే...డబులైంది..

ఐఆర్ సిటిసికి ఉన్న క్రేజ్..తెలిసి అంతా ఎగబడటంతో..ఇప్పుడు ఆ రేటు 1977 వరకూ వెళ్లింది..అంటే 500శాతం పెరిగిందని మనోళ్లు వాపోతున్నారు...ఇక పెరగదనీ జోష్యం చెప్తున్నారు..వాస్తవానికి ఓ కంపెనీ స్థితిగతులను బట్టి షేర్ రేటు ఎప్పుడో రేర్ గా నే ఉంటాయి..షేరు రేటు ఐతే తక్కువగానో..లేదంటే మరీ ఎక్కువగానే ఉంటాయ్..అంతెందుకు డీ మార్ట్ షేరు చూస్తే..ఇప్పుడు మూడువేలు దాటేసింది..మరి దానికి లేని వేల్యేషన్ దీనికి ఎందుకు చూడాలి..ఎందుకంటే..అసలు ఐఆర్ సిటిసిలో బయట ట్రేడింగ్ కి అందుబాటులో ఉన్న షేర్లు చాలా చాలా తక్కువ..మొత్తం ప్రమోటర్..అంటే ప్రభుత్వం దగ్గరే దాదాపు 87శాతం వరకూ ఉన్నాయ్..డిఐఐ అంటే దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా మరో ఐదారు శాతం కొని పెట్టుకుని ఉన్నారు..అంటే ఇక ట్రేడింగ్ చేయాలనుకునేవాళ్లకి కొనుగోలు చేద్దామనుకునేవారికి అందుబాటులో తక్కువ ఉంటుంది..ఇక డిమాండ్ ఉన్న సరుకు...తక్కువగా లభ్యం అవుతుంటే..రేటు పెరగడం మామాలే కదా..ఇప్పటికి ఐఆర్ సిటిసిలో మూడు నాలుగు బ్లాక్ డీల్స్ జరిగాయ్
అన్నీ ఎక్కువ రేటు దగ్గర జరిగినవే..ఒకటి 1550 దగ్గర..మరొకటి 1700  రేటు పైన..ఈ డీల్స్ అన్నీ కూడా 33వేల షేర్లపైనే జరిగాయ్..అంటే వాళ్లకి లాభం అంటే కనీసం ఓ మూడువందల రూపాయలు పెరిగితే కానీ అమ్మరు..అందుకే ఈ జర్నీ ఇప్పటిలో ఆగదని ఉజ్జాయింపుగా చెప్పేయవచ్చు..ఐతే ఏ షేరు ధర అయినా అదే పనిగా పెరుగుతూ పోతుంటే అందరి కళ్లూ దానిపై పడతాయ్..ఒకరు ఇంకా పెరుగుతుందంటారు..మరొకరు అబ్బే ఇక పడిపోద్దంటారు..
ఐఆర్ సిటిసి ప్రవేట్ గా ఓ తేజస్ రైలుని ప్రారంభించింది..అలానే కాశీ ఎక్స్ ప్రెస్ కూడా..ఇలా వరసగా ఆ సంస్థ ప్రవేట్ రైళ్లని ప్రారంభించినప్పుడల్లా ఇన్వెస్టర్లలో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ దొరకదు అన్నట్లుగా  ఎగబడి కొంటన్నారు

ఇప్పుడు మిడ్ క్యాప్ కేటగరీలోకి ఐఆర్ సిటిసిని చేర్చడంతో మ్యూచువల్  ఫండ్లు కూడా ఈ సంస్థలో వాటాల కోసం ఎగబడతాయని అంచనా ఉంది.. ఐతే ఇక్కడే కొంతమంది బేర్ లు చెప్పేదేంటంటే..తొందర్లోనే ఇతర సంస్తలు కూడా ప్రవేట్ రైల్ సెగ్మెంట్లలోకి వస్తారు..అప్పుడు ఐఆర్ సిటిసి జోరుండదని ..ఐతే ఓ ప్రవేట్ రైలైనా టిక్కెట్లమ్మేది మాత్రం ఐఆర్ సిటిసినే..అంతేకాదు..వచ్చే సమ్మర్ సీజన్లో రైల్లో జర్నీ చేసేవాళ్లు ఎన్ని రైల్ నీర్ వాటర్ బాటిల్స్ కొనుగోలు చేస్తే..ప్రతి బాటిల్ పైనా ఐఆర్ సిటిసికి కనీసం పది రూపాయల లాభం..ఇక టిక్కెట్లు బుక్ చేసినా...క్యాన్సిల్ చేసినా...15-30 రూపాయలు సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తుంది..పార్లమెంట్ లో రైల్వేమంత్రి చెప్పిన లెక్కలు వింటే ఏ స్థాయిలో నెలకి టిక్కెట్లు క్యాన్సిల్ అవుతున్నాయో తెలుస్తుంది.. 2019 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ 65 కోట్లకిపైనే రైల్వే టిక్కెట్లు క్యాన్సిల్ అయ్యాయ్..అంటే నెలకి 8లక్షల టిక్కెట్లు..వీటిపై కనీసం పదిహేనురూపాయల ఛార్జ్ వేసుకున్నా నెలకి ఏ సర్వీసూ చేయకపోయినా...ఐఆర్ సిటిసికి కోటి ఇరవైలక్షల రూపాయల ఆదాయం వస్తుందన్నమాట....ఇక ఫుడ్ కేటరింగ్ బిజినెస్..రైల్వే టూరిజం ఆఫర్లు..హోటళ్లు..ఇలా తన నిజమైన వ్యాపారంలో ఐఆర్ సిటిసికి లాభమే కానీ..నష్టాలే ఉండవంటారు..


ఇది నిజమే అయినా..ఏ షేరునైనా మనం తక్కువలో కొనలేం హై..రేటులో అమ్మలేం..రిస్క్ ఎప్పుడూ పొంచి ఉంటుంది..ఇది గమనించి..ఇందులో పెట్టుబడి పెట్టాలి..ఎందుకంటే డబ్బులు ఊరికే రావు..

Comments