పితాని గారూ తప్పు చేయలేదు కానీ...తప్పైతే జరిగిందిగా..పరోక్షంగా ఒప్పుకున్న ఎక్స్ మినిస్టర్


ఈఎస్ఐ..మెడికల్ స్కామ్..మందులు అమ్ముకున్నారనో...తరలించారనో ఏదో మొత్తానికైతే ఏదో జరిగిందని హడావుడి జరుగుతుంది..అదెటూ తేలదు..ఈ  లోపు వాళ్ల పేర్లు..వీళ్ల పేర్లు వస్తాయ్...ఐతే దానిపై వేసిన సబ్ కమిటీ కానీ..సిట్ కానీ ఏదీ తేల్చకుండానే మాపైన ఆరోపణలు చేసారు...అంటూ పితాని..అచ్చెన్నాయుడు ఆందోళన చెందడం అనవసరం..వాళ్లకి తెలీక కాదనుకోండి..ఐతే మనకెటూ పాత సామెతలు ఉన్నాయ్ గా...గుమ్మడికాయల దొంగలు..భుజాలు అని..ఓ వేళ ఆ టైమ్‌లో ఉన్నదే మేమిద్దరం మంత్రులం కాబట్టి..మమ్మల్ని మాత్రం అలా అనుకోవద్దు ప్లీజ్ అని స్పందించారంటే ఓకే..కానీ ఎక్స్ మినిస్టర్ పితాని మాత్రం వెరైటీగా..ఇంకా చెప్పాలంటే చంద్రబాబుగారిని ఇబ్బంది పెట్టేలా స్పందించారు..


నా పేరు ఎక్కడా చేర్చలేదు..ఐనా నా పై ఆరోపణలు చేస్తున్నారు.చాలా బాధ కలిగించింది..ఐనా ఈ కుంభకోణంపై నేనే ఎంక్వైరీకి ఆర్డర్ వేసాను అంటాడు పితాని...అంటే ఏంటి..నేను తప్పు చేయలేదు..కానీ తప్పులు మాత్రం జరిగాయి అంటాడు..మరి ఇప్పుడిక కేబినెట్ సబ్ కమిటీ ఏమీ చేయలేకపోయింది..ఏమీ నిరూపించలేకపోయింది..ఇప్పుడు సిట్ మాత్రం ఏం తేలుస్తుంది..అంతా రాజకీయ కుట్ర అనే డైలాగులు సరైనవి కాదని ఎప్పుకున్నట్లేగా..!

ఈఎస్ఐ ఆస్పత్రుల వ్యవహారమే పెద్ద అర్ధంకాని వ్యవహారం..చాలా కంపెనీల్లో పదిహేను వేల రూపాయల జీతాలున్నవారికి ప్రతి నెలా 300 కి అటూ ఇటూగా డబ్బులు కట్ చేస్తుంటారు..ఎందుకంటే ఈ ఆస్పత్రులలో వైద్యానికి అని..కానీ అవి కట్ చేయడమే కానీ..అసలు ఆ కార్డులు ఇవ్వడం కానీ..ఆ ట్రీట్ మెంట్  తీసుకోవడం కానీ పెద్దగా ఎక్కడా కన్పించదు..మరి ఈ ఈఎస్ఐ ఆస్పత్రులలో మందుల కొనుగోళ్లలో మతలబులు జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువ..అందుకే ఇప్పుడు ఈ హడావుడి తెలంగాణ, ఏపీలో బాగానే పేలుతుంది..చివరిిక ఎవరు బుక్కవుతారో కానీ..ఈఎస్ఐ విధివిధానాలు..ఉద్యోగులు కార్డుల వ్యవహారంపై కార్మికవర్గాల్లో చర్చ నడుస్తోంది

Comments