బొత్సగారూ ఈ మాత్రానికే మనుషులు మారిపోతారా..రామోజీ వివరణ ఇస్తారా


బొత్సగారూ మా రాతలు మా ఇష్టం  తాటికాయంత అక్షరాలతో మా అభిప్రాయాలు రాస్తాం...తప్పుంటే చీమతలకాయంత అక్షరాలతో ఎక్కడో ఏ వాతావరణ సూచికో కింద వేస్తాం..ఎందుకో తెలుసా..అదైతేనే కదా..ఎవడూ పట్టించుకోకుండా పేపర్ మడిచేసి పోయేది...ఇదేం కొత్తకాదు..ఎప్పుడైనా ఇదే మా పద్దతి...మీరు మాత్రం అనవసరంగా మేం ఎక్స్ ప్లనేషన్ ఇవ్వలేదని..ఓ గొంతేసుకుని అరిచేసి..మళ్లీ టాబ్లెట్లు వేసుకునే పరిస్తితి తెచ్చుకోకండి..

మేం తెలుగుని పూజించాలంటే పూజించాలి..ఎహే...అవసరంలేదు మా భ్రమాదేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించాలంటే చదివించాలి..మాకు అమరావతే టాప్ అంటే మీరూ టాప్ అనాలి..లేదూ వైజాగ్ లో సూపర్ అంటే మీరూ సూపర్ అనాలి..మీరుి కాంగ్రెస్ లో కలిసిపోతారంటే ఊ కొట్టాలి...ఎన్డీఏతో చెలిమి చేస్తున్నారంటే ఎస్ మీకెలా తెలిసిందని హాశ్చర్యపోవాలి...హంతే కానీ..మమ్మల్ని ప్రశ్నిస్తే...హోక్స్ వేగన్ కేసు గురించి పాత స్టోరీలు తీసి మళ్లీ మళ్లీ కొడతాం...

ఐనా ఎన్‌డిఏలో చేరితే తప్పేంటని మీరు గాఠ్టిగా అడగాలి కానీ...అనని మాట ఎందుకు రాశారనొద్దు..ఎందుకంటే..మా బాబూ మోదీ దోస్తీ చేస్తే తప్పని మేం అన్నామా...ముస్లిం ఓట్లు పోతాయని అప్పుడేమైనా బెదిరించేలాగా రాశామా..ఐనా మీ్రూ  మీ జగన్మోహనుడూ...మా మాటని లెక్క చేస్తారా..ఏదో పోనీయండి సార్...అంతేనా...హా..అంతే అంతే ఏటీ సేత్తాం....👿☺💁☺☺☺•

Comments