.ఈ ఉద్యోగాలు ఇప్పుడు పోవడమేంటి జ్ఞానేషూ...వామ్మో ఇన్ని లక్షల కోట్లా..చెవిలో పూలకుండీలా..?


చంద్రబాబుగారి హయాంలో లక్షకోట్ల పెట్టుబడులు వచ్చాయట..నిజంగా ఇది నిజమైతే..23సీట్లకి ఎవరూ పరిమితం  చేయరు..కానీ టిడిపి ఇంకా జనాలను అదే భ్రమలో ఉంచాలనుకుంటూ వాళ్లే ఆ హెలూసినేషన్స్‌లో బతుకుతున్నారు.  జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం అన్నది ప్రజాస్వామ్యంలో జరిగిన ఓ ప్రక్రియ..అది ఇష్టం లేకపోతే..చచ్చినట్లు ఐదేళ్లు ఎదురు చూడాల్సిందే..లేకపోతే ప్రభుత్వం చేసే తప్పులపై పోరాడే హక్కు ఉంటుంది ఎప్పుడూ

అంతేకానీ దున్నపోతు ప్రభుత్వం...చేతగాని ప్రభుత్వం అంటూ పనికిరాని డైలాగులేసినంత మాత్రం  పనైపోదు..ఎందుకంటే..ఎవరి పర్సనాలిటీ ఎలా ఉందో అందరికీ తెలుసు..రాజధాని రైతుల తరపున కనీసం ఓ వారం రోజులు నిరాహారదీక్ష చేయలేని మీరు అడ్డదారుల్లో విమర్శలు చేస్తుంటే..మిమ్మల్ని నమ్ముకున్న జనం గగ్గోలు పెట్టడం ఖాయం


పైనే చూడండి..ఏకంగా అదానీ గ్రూప్ 70వేలకోట్ల పెట్టుబడి పెట్టిందడ..ఇక మెడ్ టెక్ జోన్...పదివేల కోట్లట..సినార్మస్ పాతికవేల కోట్లట..అంటే  ఈమూడే లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి..వచ్చి పడ్డాయట..ఛ..సిగ్గేస్తుంది..నీతిమాలిన రాజకీయం చూస్తుంటే..ఇక్కడ ఎవరు ఏ పార్టీ అనేది పక్కనబెట్టండి కనీసం మెమెరాండమ్ ఆప్ అండర్ స్టాండింగ్..కి..కంపెనీల కార్యకలాపాల ప్రారంభానికి తేడా తెలీని లీడర్లు...యువకుల భవిష్యత్తుని నిర్ణయిస్తున్నారంటే..

నిజంగానే ఇవి మూడూ వచ్చి...వెనక్కి వెళ్లేట్లైతే...ఆ సంస్థలకి ఎంత నష్టం వాటిల్లుతుంది..ఆ కంపెనీలు దద్దమ్మల్లా చేతులు ముడుచుకుని వెనక్కి వెళ్తాయా....? అందులో అదానీ గ్రూప్ గౌతమ్ అదానీ చేవచచ్చిన వాడా..నీ మెడ్ టెక్ జోన్ ఎవరికి ఎంత వాటాలు పంచుకుంటే దానిపై ఎంక్వైరీ జరుగుతుందో తెలీదా...
ఇక  అపోలో టైర్స్..అశోక్ లేలాండ్..ఇంకా..రిలయన్స్ వీళ్లంతా కూడా జగన్ కి భయపడిపోయి..(అక్కడికేదో ఈయన భయపెట్టినట్లు..వాళ్లూ ఎస్ బాస్..మావల్ల కాదు మేం పోతాం అని చెప్పేసి పోయినట్లు) జెండాలు పీకేస్తారా..కనీసం కోర్టుల్లో కూడా కేసులు వేయలేనంత అసమర్ధులా ఈ కంపెనీల ఓనర్లు చెవిలో  పూలు పెట్టాలని చూడండి..కానీ ఏకంగా పూలకుండీనే పెడతానంటే ఎలా మందలగిరి బాబూ...


ఇదిగో బాబుగారి సొంత డబ్బా చూడండి..అది కూడా ఎక్స్ క్లూజివ్‌గా మన అంధజోతికే


లోకేష్ గారి ట్వీట్లకు జనం కౌంటర్లు

Comments