రాజధాని తరలింపు తప్పే..కానీ కియాపై టిడిపి రాద్థాంతం మాత్రం తెలుగువారి కడుపు కొట్టడం కాదా


ఎంత వగచినా...మరో నాలుగేళ్ల దాకా సిఎం జగనే...అంతకు ముందు ఎన్ని ఏడుపులు ఏడిచారో...సిఎం అయిన తర్వాత అతనిపై అంతకంటే ఎక్కువే ఏడుస్తున్నారు..దీనికి తోడు రాజధాని తరలింపుపై ఓ అస్త్రం దొరికింది..అసలే కోతి..అందులో కల్లు తాగింది..ఇక నిప్పు తొక్కింది..ఎలా ఉంటుందో...తెలీనివాళ్లకి టిడిపిని చూస్తే అర్ధమవుతుంది..వాస్తవానికి ఓటమితో కల్లుతాగితే..మండలి రద్దుతో నిప్పు తొక్కినట్లైంది పాపం ఆ పార్టీ పరిస్థితి..

రాజకీయంగా జగన్ చేసింది తప్పైతే..దానికి ఆ పార్టీ తప్పకుండా మూల్యం చెల్లిస్తుంది..కానీ..ఇప్పుడు కియా పేరుతో చేస్తోన్న నాటకం మాత్రం టిడిపి తీరుని ఆ పార్టీ దుస్థితికి అద్దం పట్టేదే..లేకపోతే..ఎక్కడో రాయిటర్స్...ఇక్కడ ఏపీలో తన ప్లాంట్ తరలిస్తుంటే..దానిపై స్టోరీ రాస్తుందా....పైగా అది ఇతర ఏ పేపర్ కి తెలీకుండా పోతుందా...సరే అనుకుందాం...మరి అటు ఏపీ కానీ..ఇటు తమిళనాడు కానీ..ఆఖరికి ఆ కంపెనీ కూడా అలాంటిదేం లేదని చెప్పిన తర్వాత కూడా దాన్ని పట్టుకుని లోక్ సభలో యాగ ీచేద్దామని చూస్తున్నారంటే..వీళ్ల నీచరాజకీయాలు ఏ స్థాయికి వెళ్లిపోయాయో తెలీడం లేదా..
ఫ్లాంక్లిన్ టన్ టెంపుల్టన్ అనేదే పేద్ద.దే..కానీ ఇక్కడ మిలీనియం టవర్లలో పెట్టింది అది కాదు..రెండూ తేడా తెలీని దద్దమ్మలు..దానిపై గొడవ చేస్తే..పామర జనం నిజమనుకుంటారనేకదా ఈ తాపత్రయం..శవాలమీద రాజకీయం చేద్దామనుకునే చవటలకు ఏ గతి పడుతుందో..అదే గతి ఆల్రెడీ పట్టింది అంతకంటే ఎక్కువే పట్టాలనుకుంటేనే ఇలా నీచమైన ప్రచారానికి కుట్ర చేయడం..తర్వాత దాన్ని అచ్చొత్తేయడం..దాన్ని పట్టుకుని యాగీ చేయడం..ఇలాంటి ఎన్ని చేసినా..జరిగేది జరగక మానదు...సిగ్గులేని బతుకులకు జగనే రాజధాని తరలింపు అనే అస్త్రాన్ని ఇచ్చాడు..చేతనైతే దాన్ని వాడుకుని కాస్త పబ్బం గడుపుకోవచ్చు అంతేకానీ..ఇలా నిక్షేపంగా ఉన్న కంపెనీ ఎక్కడికో పోతుందని చెప్పగానే నమ్మే వాజమ్మలు ఎవరూ ల ేరు..ఇంకా ఎవరైనా వాటిని నమ్మి భుజాన మోస్తుంటే పాపం వాళ్లపై జాలి పడటం తప్ప వేరే చేయగలిగింది లేదు..
కానీ ఇలా కుట్రపూరితంగా ఓ కంపెనీపై అవాకులు చెవాకులు పేలిన పత్రిరాజాలకు..కులభూషణులకు..రాజగురువిందలకు...ఆ పాపం ఊరికే పోదు.

ఇంకా క్లారిటీ రావాలంటే...ఇంగ్లీష్ ని సరిగా అర్ధం చేసుకోగలిగినవాళ్లకి సదరు రాయిటర్స్ కుట్రపూరితంగా రాసిన స్టోరీ లింక్ ఇది
చూడండి
రాయిటర్స్ కథనం..ఇక్కడ కూడా అన్నీ సోర్సే నట..ఎవరో చెప్పే ధైర్యం లేదు కానీ

కింద మరో రాహు కేతువు కథనం ఉంది చూడండి సందు దొరికితే చాలు...భజన చేసుకునే ఈ రాతల అర్ధం ఏంటి

Comments