ఏపి సిఎం జగన్ ఆస్తుల ప్రకటనకు చంద్రబాబుగారు రెడీ


చంద్రబాబుగారు ఇప్పుడు రెండు మూడు ఉద్యమాలకు తెరలేపారు..ఒకటి అమరావతిని తరలకుండా చూడటం..ఇంకోటి తెలుగుజాతిలో ఆత్మగౌరవం..దేశాన్ని కాపాడటం..(తెలుగు) అలానే రాజకీయనేతలందరి ఆస్తులను టీవిల ముందుకు వచ్చి ప్రకటింపజేయడం..అందులో భాగంగానే ఇప్పుడు ఏపీ సిఎం జగన్ ఆస్తులను కూడా ఆయనే ప్రకటించినా..ప్రకటించవచ్చు..ఎందుకంటే..ఇవాళ ప్రజాచైతన్యయాత్రలో నేను అడుగుతున్నా..జగన్ ఎందుకు తన ఆస్తులను ప్రకటించడు..? ఆయనకు ఎందుకు భయం.. ? చూడండి..నేను ఎలా ప్రకటించానో..దేశంలోనే నేనే ఫస్ట్..ఇలాంటి పనులు చేయడంలో..అంటూ తన ప్రసంగం సాగిపోయిది

చెత్త సిఎం ..పనికిమాలిన సిఎం..నరకాసురపాలన..ఇవన్నీ రోజూ ఉండే తిట్లే..పాత్రలు మారతాయ్..పాత్రధారుల గాత్రాలు మారిపోతాయ్..కానీ ఇలా నేనే చేసాను..ఎవరు చేయలేదు..నాలాగా ఎవరైనా చేశారా..చేస్తారా...అంటూ సవాళ్లు విసరడం ఎందుకు..ఎందుకంటే..మీరన్నీ చేసినా..ఇలా 23సీట్లకు పరిమితం ఎందుకు అయ్యారు..ఆ ప్రశ్నకి 
సమాధానం ఉందా..?

ఓటమికి వంద కారణాలు ఉండొచ్చు..కానీ నేను చే సినట్లే అందరూ చేయడం లేదని వగయడం ఏంటి..ఇలా ఎలా కుదురుతుంది..మీ తీరు చూస్తే..అసలు జగన్ ఆస్తులు చూశారా నేనే ప్రకటిస్తా..అని చెప్తారేమో..ఎందుకంటే ముందుగానే ఆయన ఆస్తులు బినామీ పేర్లతో ఉన్నాయంటూ రెండో డైలాగూ మీరే వేసేస్తారా..పోనీయండి రేపు జగన్ ఇదిగో నా ఆస్తి అని చెప్పినా మీరు వదిలేస్తారా...అంతేనా..ఇంకా ఎక్కువ..అన్నీ తప్పుడు ఆస్తులు అనరా..అంటారని కూడా మాకు తెలుసు అని చంద్రబాబుగారి సమాధానం కావచ్చు..ఎందుకంటే రాజకీయనాయకులు..రాజకీయమే చేస్తారు కదా..

Comments