చంద్రబాబుని ఓడించినందుకే జగన్‌పై ట్రంప్‌కి కోపమా..అందుకే డిన్నర్‌కి వద్దన్నాడా..?


ఏం చేసినా కూడా రివర్స్ అవుతున్నప్పుడు ఏం చేయాలి..కొన్ని రోజులైనా సైలెంట్‌గాదా ఉండాలి..మన పెద్దవాళ్లు ఎప్పుడో చెప్పారు..అనువుగాని కాలములో అధికులమనరాదు..( యాజిటీజ్ గా ఇదే కాదు) కానీ పట్టువదలని విక్రమూర్కులకు కేరాఫ్ అడ్రెస్ అయిన మన తమ్ముళ్లు మాత్రం..అలా కాదు..ఏదో రాయేస్తూ ఉంటే..వాటిలో ఏదోటి అవతలివాడికి తగలదా అనుకుంటారు..ఈలోపు మన బాక్సు బద్దలైనా పర్వాలేదనేది వాళ్లు నమ్మిన సూత్రం

అలాంటి వాటిలోనే ట్రంప్ రాక తెలుగుదేశానికి బాగా కలిసి వస్తుందనిపించింది..ఇకనేం...దావోస్ నుంచి..దామరచర్ల రాయి వరకూ పెతీదీ జగన్ పై వేయడం ప్రారంభించారు..అసలు ఇలాటి పనులు (ఎలాంటివో మరి) చేయబట్టే ట్రంప్ విందుకు జగన్ కి ఆహ్వానం లేదు అంటూ సాక్షాత్తూ పార్టీ  ప్రెసిడెంటే..రెచ్చిపోతుంటే..ఇక కింది నేలక్లాసు కార్యకర్తలు ఊరుకుంటారా...అరే నిజమేరా..లేకపోతే జగన్బ్బాయిని ఎందుకు పిలవలేదు..అదే మన బాబుగోరుంటేనా...బాగా సాగిలబడేవాళ్లు...కేసీఆర్ దొర సూడు..ఎలా వంగి వంగి సలాములు పెట్టించుకున్నాడో ట్రంపు చేత..అదే మన చంద్రబాబుగారైతేనే...తాట తీసి..నోట్లో మన ఆంధ్రా గోంగూర పెట్టేవాళ్లు తెలుసా..ఆ దెబ్బకి వెంకయ్యనాయుడు..మోదీ కూడా నోరెళ్లబెట్టేవాళ్లు..ఛ..మన బాబుగారు భారతదేశంలో ఉండబట్టి..ట్రంప్ కి ఇక్కడకు రావాలనిపించింది మనం చేసుకున్న పుణ్యం ఇది అనుకునేవాళ్లు...

ఇవన్నీ చూసిన తర్వాత మనోళ్లు..తెలివితక్కువగా ఓ మాటంటున్నారు...ఓరేయ్...నాకిప్పుడు తెలిిసిందిరా ...
చంద్రబాబుగారిని జగన్ ఓడించినందుకే ట్రంప్ దొరకి కోపమొచ్చిందిరా..అంటున్నారు..

Comments