వైఎస్సార్సీపీ లీడర్లూ కాస్త తగ్గండి..అప్పుడు మీరు చేసింది కూడా ఇదే

పోలీసులని బెదిరిస్తున్నారు..ఇదేమైనా పద్దతేనా...అంటూ బొత్స, థర్మాన సహా వైఎస్సార్సీపీ లీడర్లంతా చంద్రబాబుపైనా..ట్విట్టర్ లో అదేపనిగా లొట్టలేస్తోన్న లోకేసంపైనా మండిపడుతున్నారు కానీ..రెండేళ్ల క్రితం మనం చేసింది కూడా అదే కదా మగానుభావుల్లారా..?

వైజాగ్‌లో చంద్రబాబు టూర్ ని అడ్డుకోవాల్సిన అవసరం లేదు..రాజకీయనేతలు రాజకీయం కాకపోతే..సమాజసేవ చేస్తారా..అయితే వైజాగ్ లో చంద్రబాబుపై రాళ్లు విసిరిందెవరనే అంశంపై అంత తాత్సారం..గుంజాటన పడాల్సిన అవసరం లేదు..వైఎస్సార్సీపీ లీడర్లే ఉంటారు..కానీ వారు మాత్రం ఉత్తరాంధ్రవాసులు కాకుండా పోతారా...ఎయిర్ పోర్ట్ లో అడుగుపెట్టీ పెట్టగానే వెనక్కి పంపించేయాల్సింది..కానీ నోటీసులు..దాడులు మాత్రం సరైంది కాదు...

ఐతే జగన్ కి అప్పుడు ఎదురైన స్వాగతమే ఇప్పుడు బాబుకి ఎదురైంది..దానికి విమర్శలు కూడా అప్పుడు జగన్ అండ్ కో ఎలా చేసారో..ఇప్పుడు బాబు అండ్ పార్టీ అవే చేస్తారు..దానికి అబ్బే..అలా కాదు.ఇలా కాదు అని యువజన శ్రామిక రైతుల పార్టీ ఆరోపించడం గతం గుర్తున్నవారికి రుచించే విషయం కాదు..ఎందుకంటే వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో చేసిన శఫథం అందరికీ గుర్తుంది..ఎవ్వరినీ వదిలేది లేదు..సిఎంను టచ్ చేస్తున్నారు..అంటూ జగన్ ఇచ్చిన వార్నింగ్ ఇంకా మారుమోగుతోంది బొత్సగారూ...ఐతే జగన్ గారు అనుకున్నది నెరవేర్చుకున్నారు..మరి ఆ సత్తా లోకేశం గారికి ఉంటుందా అనేదే ఇక్కడ అసలు విషయం..

Comments