జల్సాల జీవ రెడ్డి..ఎక్కడ కట్టాలో కాదు..ఎగ్గొట్టాలో తెల్సినోడా..


చాలా సంవత్సరాల క్రితం రెడీ అని ఓ సినిమా వచ్చింది..రామ్ హీరో అందులో..మంచి హిట్టైంది..అందులో ఓ క్యారెక్టర్ ఉంటుంది..హ్యాపీ రెడ్డి ఉరఫ్ సంతోష్ రెడ్డి అంటూ..ఏదెలా జరిగినా మనం హ్యాపీగా ఉండటమే కావాల్సిందని చెప్తూ..విలన్ గ్యాంగ్‌ మధ్య ఇరుక్కుపోతాడు...దీనికి కాస్త కొనసాగింపుగానే దూకుడులోనే కన్పిస్తాడు ధర్మవరపు..ఐతే ఆ క్యారెక్టర్ ఎవరికి పేరడీనో అందరికీ బాగానే అర్ధమైపోయింది..
పైన చూసారు కదా...ఆస్తి పన్ను ఎంత ఎగ్గొట్టాడో..ఇది జస్ట్ ట్రైలరేనంటారు..ఇంటర్నెట్ లోకి వెళ్తే సదరు సంస్థపై కంప్లైంట్ల కోసం ఏకంగా ఓ ఉద్యమమే నడుస్తుంది కూడా..అంటే జల్సాల రెడ్డికి..ఇవేం పట్టవన్నమాట..జస్ట్ బి హ్యాపీ..విత్ ఆదర్స్ మనీ..ఆనందం కోసం ఆస్తి పన్ను ఎగ్గొట్టడం ఆయన చేసే చిలిపి పనుల్లో చాలా చిన్నది అనుకోవాలేమో
ఐతే ఈ నోటీసులకు ఎంత కట్టాడో..ఇంకా ఎంత కట్టాలో కూడా పబ్లిక్ డొమైన్ లో ఓపెన్ గా పెట్టాలి..పెద్ద పెద్ద  హోర్డింగులు పెట్టి..అప్పుడే అందరికీ ఇలాంటోళ్ల భాగోతాలు అర్ధమవుతాయ్..

Comments