కరోనా గురించి భయం వద్దు..ఇది ఇండియా గురూ..!



ఇండియా ఈజ్ గ్రేట్..ఇప్పటిదాకా ఎన్ని వైరస్ ‌లు పుట్టినా కూడా..అన్నీ ఇతర దేశాలనుంచే కానీ మన దగ్గర కాదు..ఇది విచిత్రంగా ఉన్నా..ఇక్కడి నేల మహిమ అనడంలో సందేహమే లేదు..సైన్స్ చెప్పినా...సెంటిమెంట్ చెప్పినా..ఇదే వాస్తవం..పైగా నిరూపణ అయిన సత్యం..ప్రపంచం మొత్తం కరోనా బాధితులు 90వేలనుకుంటే..మన భారతంలో ఎంతో తెలుసా..3...ఇతర దేశాల్లోని మనోళ్లకి సోకింది...20లోపే..ఈ లెక్క చాలదా..మన ఇమ్యూనిటీ పవర్ గురించి..దీన్ని ఇంకాస్త డీటైల్డ్ గా చర్చించుకుందాం

కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుంది.. సందేహమే లేదు..మరి మన జనాభా 130 కోట్లు..ప్రతి కిలోమీటర్లో 420-440 మంది బతుకుతున్నాం అని ఎకనమిక్ టైమ్స్ లో ఓ రచయిత రాసాడు..అంటే ప్రతి వంద మీటర్లలో నలుగురు ఉంటారు..అలాంటిది ఇక్కడ జబ్బు ప్రవేశిస్తే...నిజమే భారీగానే నష్టం వాటిల్లుతుంది..మరి వచ్చిందా..లేదు కదా..కాదు ఇది ఇప్పుడే కాదు..ఇంకా సెకండ్ వేవ్ అంటూ ఓ ప్రబుద్దుడు చెప్తున్నాడు..అసలు భారత్ లో కరోనా వైరస్ సోకిన వాళ్లు వచ్చింది..జనవరిలోనే అది కూడా కేరళలో...మరి ఆ పాజిటివ్ కేసులు ఏమయ్యాయ్...నిక్షేపంగా ట్రీట్ మెంట్ తీసుకున్నారు..బైటికి వచ్చేసారు..డీటైల్స్ బైటికి చెప్పరు కానీ..స్క్రీనింగ్..అబ్జర్వేషన్ ఉంటది..అలానే 23వేలమందికిపైగా వైరస్ లక్షణాల్లా అన్పిస్తే..పరిశీలన కూడా చేశారు..ఇన్ని వాస్తవాలను వదిలేసి..లేదు లేదు..అమెరికా వాడు ఇట్టన్నాడు...చైనా వాడు అట్టన్నాడు అంటూ కూతలెందుకు...నిజమే వైరస్ సోకితే భయపడాల్సిందే ..కానీ దానికోసం స్టాక్ మార్కెట్లలో షేర్లు పడేయడం...పని మానేయడం కరెక్టేనా...వస్తే ఏం చేయాలనేది..గవర్నమెంట్ గాఠ్టిగా చూసుకోవాలి..ఇప్పటికే మన డజనున్నర ఛానల్లు చేసిన హడావుడితో బాగానే అవేర్ నెస్ ఉంది..ఐతే ట్రీట్ మెంట్ ఇవ్వగలరా అనేదే చర్చించుకోవాల్సిన అంశం అంతే కానీ..భయపెట్టడమో..భయపడటమో కాదు..

బేసికల్ గా మన డిఎన్ఏలోనే ఆ నిరోధకత ఉంది..మొన్నా మధ్య డెంగూ కేసుల్లో చనిపోయినవారు ఎందుకు పోయారంటే..డెంగూ దెబ్బకి కాదు..ట్రీట్ మెంట్ సరిగా ఇవ్వక..ఇప్పించుకోలేని పేదరికం..నిర్లక్ష్యం.(ప్రభుత్వానిది)
చైనా..అమెరికా, దుబాయ్, సౌదీ, ఆస్ట్రేలియా సౌత్ కొరియా, జపాన్..ఇలా ప్రతి దేశంలోనూ మనోళ్లున్నారుగా...మరి చైనా నుంచే మనోళ్లని 300మందిని తీసుకొచ్చారుగా..వాళ్లలో వైరస్ ఉందా..ఎందుకు సోకలేదు..అదే అమెరికాలో మాత్రం ఏ దేశం వెళ్లని లేడీకి కూడా సోకిందట..ఇదేం విచిత్తం కాదు..ఐతే వైరస్ ఎక్కడైనా పుట్టగలదనే సిగ్నల్స్ వచ్చేశాయ్ కాబట్టి..అప్రమత్తంగా ఉండాలి..అంతే కానీ భయపెట్టకూడదు..హలో..హలో వైరస్..దిసీజ్ ఇండియా....

Comments

  1. ఇండియా అయినంత మాత్రాన రోగాలు రావనుకుంటే భ్రమ. ఎన్నాళ్ళు మనవాళ్ళు క్షయ రోగం తో బాధపడ్డారో తెలుసా.
    వైరస్ వ్యాపించేది చాలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో. ఇండియాలో వేడి ఎక్కువ కాబట్టి వైరస్ వ్యాపించే అవకాశాలు తక్కువ.
    అయితే ఏ రోగానికైనా మానసిక స్టైర్యమే మొదటి మందు.
    వైరస్ గురించి జాగ్రత్త పడాలి గాని అతి విశ్వాసం, అతి భయం పనికిరాదు.

    ReplyDelete

Post a Comment