అల్లు అర్జున్ ...రజనీకాంత్ తర్వాత సౌతిండియా సూపర్ స్టార్ అట


తెలుగులో మంచి అవకాశాల కోసం మళ్లీ ప్రయత్నిస్తోన్న శివాజీ..ఇప్పుడు అందులో కిటుకులు కూడా ప్రయోగించడానికి రెడీ అయిపోయాడు..సరిలేరునీ కెవ్వరూ...అల వైకుంఠపురములో రెండు సినిమాల మధ్య పోటీని తనకి అనువుగా మలుచుకునేందుకు అల్లు అర్జున్ వైపు చేరిపోయి భజన ప్రారంభించేసాడు..ఇది ఏదో అతనిపై అక్కసు వెళ్లగక్కడమే అనుకోవద్దు..ఎందుకంటే సౌతిండియా సూపర్ స్టార్ అంటే అల్లు అర్జున్ అట...

ముందు ఈ సౌతిండియా సూపర్ స్టార్ అంటే ఏంటో..ఆ స్టార్ డమ్ ఏంటో ఈ సంధికాలపు నటుడికి తెలుసా అని డౌట్..రజనీకాంత్..తమిళ్ , కన్నడ..తెలుగు, మలయాళానికి సుపరిచితం..మెయిన్ తమిళ్ అయినా...ఇతర భాషల్లోనూ స్టార్ హీరోలకు తగ్గని ఇమేజ్ ఆయనది..ఆ తర్వాత స్థానం ఎవరికీ దక్కదు ఎందుకంటే..అంతగా నాలుగు భాషల్లో చొచ్చుకుపోయిన నటుడు ఎవరూ లేరు..అలాంటిది...శివాజీకి సడన్ గా అల్లు అర్జున్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గా అల్లు అర్జున్ ఎలా కన్పించాడో..ఏంటో..బహుశా..దేశ ముదురు..పరుగు ల ాంటి రెండు మూడు సినిమాలు మలయాళంలో డబ్ అయి ఫర్వాలేదనిపించడంతోనే సౌత్ ఇండియా సూపర్ స్టార్ అనుకున్నాడేమో..ఆ లెక్కన.. జూనియర్ ఎన్టీఆర్ కి మలయాళంలో మంచి క్రేజే ఉంది..

ఇంకా చెప్పాలంటే..ఇప్పటి సూపర్ స్టార్ మహేష్...తమిళ్...మలయాళంలో మంచి క్రేజ్ ఉంది..మురారి తమిళ్ లో డబ్ అయి..భీభత్సమైన హిట్ కాదు కానీ...డీసెంట్ రిటర్న్స ్ రాబట్టింది..స్పైడర్ రిలీజ్ తమిళ్ వెర్షన్ కోసమే చేసారు..తప్ప తెలుగు ఆడియెన్స్ కోసం కాదు..ఇక శ్రీమంతుడు..భరత్ అను నేను మంచి హిట్స్ తమిళంలో కూడా..సినిమా ఫ్లాప్ అయినా...వందకోట్ల కలెక్షన్స్ రాబట్టడం ఒక్క మహేష్ కే సొంతం..అలాంటిది కావాలని మహేష్ ని తక్కువ చేసి..అల్లు అర్జున్ ని కాకా పడితే..మెగా కాంపౌండ్ నుంచి వచ్చే వరదల్లాంటి సినిమాల్లో చాన్సులు దొరుకుతాయనేది శివాజీ ప్లాన్ గా అర్ధమవుతోంది..ఈ కిటుకు కనుక్కున్నాడు కనుకనే..నితిన్ గుండెజారి గల్లంతయ్యిందే తర్వాత కాస్త నిలదొక్కుకున్నాడు..కార్తికేయ మెగాస్టార్ ముందు ఎమోషన్ పండించడం కూడా అందుకే డజన్ల కొద్దీ హీరోలు ఉన్నారు కాబట్టి..వారి ఫ్యాన్స్  గుడ్ లుక్స్ లో పడితే..టాక్ మంచిగా ఉంటుందనే దూరదృష్టి వాళ్లది. అదే మహేష్ ఫ్యాన్స్ అని చెప్పుకున్నారనుకుోండి( నిజమైనా సరే) మహా అయితే ఒకటో రెండో ఛాన్సులు దక్కుతాయ్...ఇదీ...మెగా కాంపౌండ్ కి భజన దరువు వెనుక అసలు నిజం

Comments